Search This Blog

Sunday, 17 June 2018

తల ఫై అక్షింతలు ఎందుకు వేస్తారు? - WHY SHOULD WE PUT AKSHATA ON HEAD

తల ఫై అక్షింతలు ఎందుకు వేస్తారు?

 పెద్దల దగ్గర ఆశిర్వాదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?

అక్షింతలు అంటే మనకందరికీ తెలుసు..

 బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాలలోను మన పెద్దలు మనల్ని అశిర్వదించడానికి  మన ఫై అక్షింతలు వేస్తారు.

అయితే ఈ అక్షింతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో  తెలుసుకుందాం..

    అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగని వి అని..  శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట.

 అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక,నూనెతొ కలిపి అక్షింతలు తయారు చేస్తారు.

 నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు.

 ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి
ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.

 మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది అని మన  పెద్దల నమ్మకం.

అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు..  అందుకే అక్షింతలను తల ఫై వేసి ఆశిర్వదిస్తారు..

     సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని ని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం.
ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.

 పెద్దలు మన ఫై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి.

ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదండీ!

మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా.

తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా అక్షింతుల ద్వార  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.  ఇక పసుపు క్రిమి సంహారకం,
ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చుకొనేవారికి రాకుండా ఉంటాయి.. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనట..

    ‘అన్నాద్భవన్తి భూతాని’

అని భగవద్గిత లో మూడవ అధ్యాయంలో చెప్పబడింది.

జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే.

పెద్దల దగ్గర ఆశిర్వదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?

    పెద్దల దగ్గర మన ఆశిర్వదం తీసుకోనేపుడు వారి పాదాలకు నమస్కారించడం మన సంప్రదాయం. అయితే అలా చెయ్యడం లోని అర్ధం మేమిటో తెలుసుకుందాం..

మన  శరీరం లో తల ఉత్తర దృవం అయితే పాదాలు దక్షిణ దృవం.. వ్యతిరేక దృవాలే  ఆకర్షించుకుంటాయి.. అప్పుడే గా శక్తి విడుదల అవుతుంది. అలానే మనం పెద్దల దగ్గర ఆశిర్వాదం తీసుకోనేపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశిర్వాదం తీసుకుంటాం. అప్పుడు వారి పాదాలలోని దక్షిణ దృవం మన తల లో గల ఉత్తర దృవం తో ఆకర్షితంమై శక్తిని వెలువరుస్తుంది.. అందుకే మన హిందు సంప్రదాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.

     చూసారా ఇలా మన సంప్రదాయలో  ప్రతీ దానికి ఏదొక పరమార్దం దాగి ఉంటుంది.
మన సంప్రదాయాలను అర్దం లేనివని కొట్టి పారేయకుండా వాటిలోని పరమార్దం తెలుసుకొని  ఆచరిద్దాం..

No comments:

Post a Comment