కాంచీపుర వైభవం - కామాక్షి తల్లి కటాక్షం
1) కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు . తల్లి సంకల్పమే ప్రధానం . ( ఇది గొప్ప విశేషం )
2) సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం . ( మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది . (అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది )
3) ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు . (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )
4) ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు.
( ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు )
5) కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది . కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మితల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే , భర్తను నిందించిన దోషం
పొతుంది . మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది .
6) కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం .
తపస్సులో భాగంగా ,శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి .
7) కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు , శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు .( తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి )
అమ్మధ్యానంలో , "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది .
ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది . భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది .
కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి
No comments:
Post a Comment