Search This Blog

Sunday 17 June 2018

Ramayanam - Bala kanda - Gangavataranam & Skondotpatti


Ramayanam - Bala kanda - Gangavataranam & Skondotpatti

35. ముప్పదిఇదవ సర్గము
గంగా పార్వతుల కథ )
ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః|
నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోsభ్యభాషత ||
తా|| మిగిలిన రాత్రి ఆ శోణానదీ తీరమున ఆ మహర్షులతో గడిపి రాత్రి తరువాత సుప్రభాత సమయములో విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

సుప్రభాత నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ ||
తా|| 'ఓ రామా! రాత్రి గడిచినది సుప్రభాత పూర్వ సంధ్యాసమయమైనది. లెమ్ములెమ్ము.నీకు శుభమగుగాక. ప్రయాణమునకు సిద్ధము కమ్ము'.

తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్ |
గమనం రోచయామాస వాక్యం చేద మువాచ హ ||
అయం శోణః శుభజలో గాఢః పులినమండితః |
కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయమ్ ||
తా|| ఆ మాటలను విని ఉదయపు కార్యక్రమములను నిర్వర్తించి ప్రయాణమునకు సిద్ధమై రాముడు ఇట్లు పలికెను. ఈ శోణానది శభమైన జలములతో లోతుగా విలసిల్లు చున్నది. ఓ బ్రహ్మన్ ! మనము ఏవిధముగా ఈ నదిని దాటవలయునుఅని.

ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోsబ్రవీదిదమ్ |
ఏషపంథా మయోద్దిష్టో యేన యాంతి మహర్షయః ||
ఏవముక్తాశ్చ ఋషయో విశ్వామిత్రేణ ధీమతా |
పశ్యంతస్తే ప్రయాతావై వనాని వివిధాని చ ||
తా|| ఈ విధముగా పలికిన రామునితో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను."ఇచట మహర్షులు పయనించు మార్గము అదృష్టవశాత్ నాకు తెలుసును". ధీమంతుడైన విశ్వామిత్రుని వచనములను విని ఋషులందరూ అదే మార్గమున వివిధరకములైన వనములను చూచుచూ కొనసాగిరి.

తే గత్వా దూరమధ్వానం గతేsర్ధదివసే తదా |
జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్ ||
తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంస సారస సేవితామ్ |
బభూవుర్ముదితాస్సర్వే మునయః సహ రాఘవః ||
తా|| వారందరూ మద్యాహ్నమువఱకూ ప్రయాణము చేసి అత్యుత్తమమైన గంగానదీ తీరమునకు చేరిరి. ఆ హంసలతో ఇతర పక్షులతో సేవించబడుచున్న ఆ పుణ్యమైన జలములను చూచి ఆ రామునితో సహా మునులందరూ మహదానందపడిరి.

తస్యాస్తీరే తతశ్చక్రుః త ఆవాస పరిగ్రహమ్ |
తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః ||
హుత్వాచైవాగ్ని హోత్రాణి ప్రాశ్య చామృతవద్ధవిః |
వివిశుర్జాహ్నవీ తీరే శుచౌ ముదిత మానసాః ||
విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః |
అథ తత్ర తదా రామో విశ్వామిత్రం అథాబ్రవీత్ ||
తా|| అంతట వారు ఆ తీరములో ఒక ప్రదేశమును నివాసయోగ్యముగా చేసికొని స్నానము చేసి యథావిధిగా పితృదేవతలకు తర్పణములిచ్చిరి. అగ్నికి హవిస్సులు సమర్పించి హవిషాన్నమును అమృతమువలె సేవించి ఆ జహ్నవీ తీరములో వారందరూ అత్యంత సంతోషపడిరి. అప్పుడు మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ వారందరూ కూర్చుని ఉండగా శ్రీరాముడు విశ్వామిత్రుని ఇట్లడిగెను.

భగవన్ శ్రోతుమిచ్ఛామి గంగాం త్రిపథాం నదీమ్ |
త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్ ||
చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః |
వృద్ధిం జన్మచ గంగాయా వక్తుమేవోపచక్రమే ||
తా|| 'భగవన్ ! గంగానది మూడులోకములలో ప్రవిహించునట్టి త్రిపథగా ఏట్లు పేరుపొందినది ఏవిధముగా నదులకు పతి యగు సాగరుని చేరినది?' అని. రామునిచే చెప్పబడిన ఆ మాటలను విని మహామునియగు విశ్వామిత్రుడుగంగానదియొక్క జన్మ మరియూ వృద్ధి గురించి చెప్పసాగెను.

శైలేంద్రో హిమవాన్ నామ ధాతూనామకరో మహాన్ |
తస్య కన్యాద్వయం రామ రూపేణా ప్రతిమం భువి ||
యామేరు దుహితా రామ తయోర్మాతా సుమధ్యమా |
మేనా మనోరమా దేవీ పత్నీ హిమవతః ప్రియా ||
తస్యాం గంగేయమభవత్ జ్యేష్ఠా హిమవత్సుతా |
ఉమా నామ ద్వితీయాsభూత్ నామ్నా తస్యైవ రాఘవ ||
తా|| 'ఓ రాఘవా ! పర్వతములలో ఇంద్రునివంటి హిమవాన్ అను పేరుగలఅనేక ధాతువులతో సమ్మిళితమైన ఒక పర్వతము కలదు. ఆ హిమవంతమునకు అప్రతిమమైన రూపములుగల కుమార్తెలు ఇద్దరు ఉండిరి. మేరువు యొక్క సుందరమైన కుమార్తె మైనా హిమవంతుని భార్య . అతనికి ప్రియురాలు. ఆ హిమవంతుని కి గంగా జ్యేష్ఠ పుత్రి . ఉమా అనబడు ఆమె రెండవపుత్రి'.

అథ జ్యేష్ఠాం సురాస్సర్వే దేవతార్థ చికీర్షయా |
శైలేంద్రం వరయామాసుః గంగాం త్రిపథాం నదీమ్ ||
దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీమ్ |
స్వచ్ఛందపథగాం గంగాం త్రైలోక్య హితకామ్యయా ||
తా|| అంతట దేవతలందరూ దేవతార్థము కొఱకై జ్యేష్ఠ కుమార్తె యగు గంగను తమకు ఇవ్వమని ఆ శైలేంద్రుని అడిగిరి. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని నిరాటంకముగా సాగిపోవునట్టి తన తనయను మూడు లోకముల హితము కొఱకు దేవతలకిచ్చెను.

ప్రతిగృహ్య తతో దేవాః త్రిలోక హితకారిణః |
గంగామాదాయ తే sగచ్ఛన్ కృతార్థేనాంతరాత్మనా ||
తా|| ఆ గంగను ప్రతిగ్రహించి ఆ దేవతలు తాము కృతార్థులైనట్లు భావించి వెళ్ళిపోయిరి.

యా చాన్యా శైలదుహితా కన్యాssసీత్ రఘునందన |
ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా ||
ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరస్సుతామ్ |
రుద్రాయా ప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్ ||
తా||ఓ రఘునందనా ! ఆ శైలెంద్రుని రెండవ కుమార్తె చాలా తీవ్రమైన వ్రత నిష్ఠతో తపస్సు చేసెను. అట్లు తీవ్రమైన తపస్సు చేసిన ఆ ఉమను హిమవంతుడు లోకములచే నమస్కరింపబడు రుద్రునకు ఇచ్చెను'.

ఏతేతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే |
గంగా చ సరితాం శ్రేష్ఠా ఉమాదేవీచ రాఘవ ||
తా|| 'ఓ రాఘవా ! ఈ వి్ధముగా ఆ శైలేంద్రుని పుత్రికలు ఇద్దరూ నదులలో శ్రేష్ఠమైన గంగ మరియూ ఉమాదేవి లోకములో పూజ్యులైరి.'

ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ |
ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాంవర ||
తా||' ఓ రామా ! త్రిపథగా గంగ ప్రథమముగా ఏట్లు వెళ్ళినదో ఈ విథముగా విశదీకరించితిని'

సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా |
సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ ||
తా|| 'ఆనాడు హిమవంతునికి కుమార్తెగా జన్మించి సురలోకమునకు చేరిన నదియే ఈ పుణ్యప్రదమైన గంగా నది'

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే పంచ త్రింశస్సర్గః ||
సమాప్తం||

|| ఈ విధముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో ముప్పది ఇదవసర్గ సమాప్తము ||
||ఓమ్ తత్ సత్ ||

అలా వాళ్ళు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ప్రాంతం ఫలాలుపుష్పాలతొ చాలా శోభాయమానంగా కనబడింది ప్రాంతం ఇంత ఆనందంగాఅందంగా ఉండడానికి కారణమేంటని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వకాలంలొ బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడుఆయనకి కుశాంబుడుకుశనాభుడుఅధూర్తరజసుడువసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, " మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండివాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి " అని ఆదేశించాడుఅప్పుడు వాళ్ళు కౌశాంబీమహోదయముధర్మారణ్యముగిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారుప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములొ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు నగరం 5 పర్వతాల మధ్యలొ ఉందిశోణానది  5 పర్వతాల మధ్యలొ ప్రవహిస్తుందిఅందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. 
కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారువాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకికుశనాభుడికి జన్మించారువాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులుమెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారుఒకనాడు  కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూవీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలొ అక్కడికి వాయుదేవుడు వచ్చాడువాయువు వాళ్ళని చూసి మీరు చాలా అందంగా ఉన్నారుకాని మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలొ ఎంతోకాలం ఉండలేరుకొంత కాలానికి మీ యవ్వనంతొ పాటు మీ అందం కూడా నశిస్తుందికాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండినన్ను పెళ్ళిచేసుకుంటె మీరు కూడా నిత్య యవ్వనంలొ ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడువెంటనే  100 కన్యలు ఏక కంఠంతో.........
కుశనాభ సుతాః దేవం సమస్తా సుర సత్తమ |
స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామః తు తపో వయం ||
మా భూత్  కాలో దుర్మేధః పితరం సత్య వాదినం |
అవమన్యస్వ స్వ ధర్మేణ స్వయం వరం ఉపాస్మహే ||
పితా హి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం  సః |
యస్య నో దాస్యతి పితా  నో భర్తా భవిష్యతి ||

మాదెగ్గర అపారమైన తపఃశక్తి ఉందికావున మమ్మల్ని మేము రక్షించుకోగలముమేము తలుచుకుంటె నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి నిన్ను తొలగించగలముమాకు పెళ్ళంటూ జెరిగితెఅది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ఎవరిని చూపించి చేసుకోమంటె వాళ్లనే చేసుకుంటాము కాని మా అంతట మేము నిర్ణయించుకోము దేశంలొ  స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని  కన్యలందరూ ఏక కంఠంతొ చెప్పారువారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు  నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడుదానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు.
తరవాత  కన్యలందరూ కుశనాభుడి దెగ్గరికి వెళ్లి జెరిగినది చెప్పారుఅప్పుడు  కుశనాభుడు తన కుమార్తెలను చూసి, " అమ్మామీకు  స్థితి కల్పించిన  వాయుదేవుడిని మీరు శపించలేదుఓర్పు వహించారునాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని...............
క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః  పుత్రికాః |
క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్ ||

స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పుఅమ్మానూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారుమీలో ఒక్కరికి కూడా కోపం రాలేదుఅందం అంటె ఇదిఓర్పె దానంఅన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పెఓర్పుకి మించిన యజ్ఞం లేదుఓర్పుని మించిన సత్యం లేదుఓర్పుని మించిన ధర్మం లేదు ఓర్పు వల్లనె  భూమి నిలబడుతోంది " అని చెప్పాడు. 


అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికిఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేదిఅలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు  మహర్షి ఆమెతొ....... నేను నీకు ఏమిచెయ్యగలను అని అడిగారుఅప్పుడామె.......నేను ఎవరికీ భార్యని కానుకాని అపారమైన తపఃశ్శక్తిబ్రహ్మతేజస్సు కలిగిన నీ వలనశారీరిక సంపర్కం లేకుండామానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగిందిఅప్పుడు  చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమదకి ప్రసాదించారుపుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడుకాపిల్యము అనే నగరంలొ ఉండేవాడుకుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని  బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జెరిపించాడుబ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటె ఒక్కొక్కరి అంగవైకల్యం పోయివాళ్ళు మళ్ళి పూర్వ సౌందర్యాన్ని పొందారుఅప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడిందిఅని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.
 వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు.

అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు గంగా నదిని సమీపించారుఅందరూ గంగని చూడగానె ఎంతో సంతోషించారుఅక్కడున్న మహర్షులు మొదలగువారు  గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించిఅగ్నిహొత్రం చేసి ఒడ్డున కూర్చొనిమిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారుఅప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు...." కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారుకాని కుమారులు లేరుతనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు యాగం జెరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందిగాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశ పేరు నిలబెడతాడుఅన్నాడు. 
నేను  గాధి యొక్క కుమారుడినే రామా అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.
 పితా మమ కాకుత్స్థ గాధిః పరమ ధార్మికః |
కుశ వంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన ||


అప్పుడు విశ్వామిత్రుడు..... " నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారునా అక్క పేరు సత్యవతిఆమె భర్త పేరు ఋచకుడుకొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారుఅప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయిందిమా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుందిఅందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీదమా అక్కకి దెగ్గరగా ఉంటానుఇప్పుడు  సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చానునీ తేజస్సు చేత రక్షింపబడ్డాను " అని రాముడితొ చెప్పాడు.
అక్కడే ఉన్న ఋషులు అప్పుడు.........
విశేషేణ భవాన్ ఏవ విశ్వామిత్ర మహాయశః |
కౌశికీ సరితాం శ్రేష్ఠః కుల ఉద్యోతకరీ తవ ||
నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యిందిమీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. 
అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందొ చెప్పమన్నాడుఅప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు...... " పూర్వకాలంలొ హిమవంతుడు అనే పర్వత రాజుఆయన భార్య మనోరమ ఉండేవాళ్ళువాళ్ళ పెద్ద కుమార్తె గంగరెండవ కుమార్తె ఉమస్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే  నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగాదేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడుఅలా దేవనదిగా గంగ స్వర్గంలొ ప్రవహించేదిఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయ్యిహైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టిందిపరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేవబడి పాతాళానికి చేరింది, 3 లోకములలొ ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారుఅని విశ్వామిత్రుడు చెప్పాడు.
మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరుకావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనదిమనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడుఅప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు...." పార్వతి పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరాలు క్రీడించారు విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసిందిపార్వతీదేవి - శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవికాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు దేవతలంతా బయలుదేరి కైలసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్ధించారుఅప్పుడు శంకరుడు బయటకి వచ్చాడుఅప్పుడు వాళ్ళు ఆయనతోస్వామీమీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారుమీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తేమేము ఎవరము దానిని తట్టుకోలేముకావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు.
వాళ్ళు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడుకాని ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలిందిఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారుదాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడుఅప్పుడు  దేవతలు.....
యత్ తేజః క్షుభితం హి అద్య తద్ ధరా ధారయిష్యతి |
మీ తేజస్సుని భూమి భరిస్తుందికావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారుశంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడువదిలిన  తేజస్సు భూమి అంతా వ్యాపించిందిఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చినాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారుకావున.....
అపత్యం స్వేషు దారేషు  ఉత్పదయితుం అర్హథ |
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః ||
ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి |
అవనే  ఏక రూపా త్వం బహు భార్యా భవిష్యసి ||
  పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రం అనిచ్ఛతీ ||

మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరునా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టిఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుందిఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారుభూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించిందిఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు.
వ్యాపించిన  శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయిందిఅప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి  రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారుఅప్పుడు అగ్ని  తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. 


తప్యమానే తపో దేవే దేవాసర్షిగణాపురా.

సేనాపతిమభీప్సన్త
పితామహముపాగమన్৷৷



తతోబ్రువన్ సురాస్సర్వే భగవన్తం పితామహమ్.

ప్రణిపత్య సురాస్సర్వే సేన్ద్రాస్సాగ్నిపురోగమా
:৷৷


యో న స్సేనాపతిర్దేవ దత్తో భగవతా పురా.

తప
పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా৷৷



యదత్రానన్తరం కార్యం లోకానాం హితకామ్యయా.

సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హి న
పరమా గతి:৷৷



దేవతానాం వచశ్శ్రుత్వా సర్వలోకపితామహ:.

సాన్త్వయన్మధురైర్వాక్యైస్త్రిదశానిదమబ్రవీత్
৷৷



శైల పుత్ర్యా యదుక్తం తన్న ప్రజాస్యథ పత్నిషు .

తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయ
:৷৷


ఇయమాకాశగా గఙ్గా యస్యాం పుత్రం హుతాశన
:.

జనయిష్యతి దేవానాం సేనాపతిమరిన్దమమ్
৷৷



జ్యేష్ఠా శైలేన్ద్రదుహితా మానయిష్యతి తత్సుతమ్.

ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయ
:৷৷


తచ్ఛ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునన్దన.

ప్రణిపత్య సురాస్సర్వే పితామహమపూజయన్
৷৷


తే గత్వా పర్వతం రామ
కైలాసం ధాతుమణ్డితమ్.

అగ్నిం నియోజయామాసు
పుత్రార్థం సర్వదేవతా:৷৷


దేవకార్యమిదం దేవసంవిధత్స్వ హుతాశన.

శైలపుత్ర్యాం మహాతేజో గఙ్గాయాం తేజ ఉత్సృజ
৷৷


దేవతానాం ప్రతిజ్ఞాయ గఙ్గామభ్యేత్య పావక:.

గర్భం ధారయ వై దేవి
దేవతానామిదం ప్రియమ్৷৷


తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్.

దృష్ట్వా తన్మహిమానం స సమన్తాదవకీర్యత
৷৷


సమన్తతస్తదా దేవీమభ్యషిఞ్చత పావక:.

సర్వస్రోతాంసి పూర్ణాని గఙ్గాయా రఘునన్దన
!৷|


తమువాచ తతో గఙ్గా సర్వదేవపురోహితమ్.

అశక్తా ధారణే దేవ
తవ తేజ స్సముద్ధతమ్.

దహ్యమానాగ్నినా తేన సమ్ప్రవ్యథితచేతనా
৷৷


అథాబ్రవీదిదం గఙ్గాం సర్వదేవహుతాశన
:.

ఇహ హైమవతీ పాదే గర్భోయం సన్నివేశ్యతామ్
৷৷


శ్రుత్వా త్వగ్నివచో గఙగా తం గర్భమతిభాస్వరమ్.

ఉత్ససర్జ మహాతేజ స్స్రోతోభ్యో హి తదానఘ 
!৷৷


యదస్యా నిర్గతం తస్మాత్తప్తజామ్బూనదప్రభమ్ .

కాఞ్చనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభమ్
৷৷


తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత৷৷
మలం తస్యాభవత్తత్ర త్రపు సీసకమేవ చ.

తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత
৷৷


నిక్షిప్తమాత్రే గర్భే తు తేజోభిరభిరఞ్జితమ్.

సర్వం పర్వతసన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్
৷৷


జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవ.

సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశనసమప్రభమ్
৷৷

తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాఞ్చనమ్
.

తం కుమారం తతో జాతం సేన్ద్రాస్సహ మరుద్గణా:৷৷1.37.23৷৷

క్షీరసంభావనార్థాయ కృత్తికాస్సమయోజన్
.


తాక్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమమ్৷৷1.37.24৷৷

దదు
పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితా:.



తతస్తు దేవతా స్సర్వాకార్తికేయ ఇతి బ్రువన్৷৷1.37.25৷৷

పుత్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయ
:.4-


తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే৷৷1.37.26৷৷

స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్
.



స్కన్ద ఇత్యబ్రువన్ దేవాస్కన్నం గర్భపరిస్రవాత్৷৷

కార్తికేయం మహాభాగం కాకుత్స్థ
జ్వలనోపమమ్.


ప్రాదుర్భూతం తతక్షీరం కృత్తికానామనుత్తమమ్ ৷৷
షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయ
:.

గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా 
అజయత్స్వేన వీర్యేణ దైత్యసేనాగణాన్ విభు
:.

సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిమ్৷৷1.37.30৷৷
అభ్యషిఞ్చన్ సురగణా స్సమేత్యాగ్నిపురోగమా:.

ఏష తే రామ గఙ్గాయా విస్తరోభిహితో మయా৷৷
కుమారసమ్భవశ్చైవ ధన్య
పుణ్యస్తథైవ చ.

భక్తశ్చ యకార్తికేయే కాకుత్స్థ భువి మానవః.
ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కన్దసాలోక్యతాం వ్రజేత్||

శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడుఅదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడుతను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడుఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దెగ్గరికి వెళ్లారుఅప్పుడు బ్రహ్మగారు ఆలోచించిహిమవంతుడు - మనోరమల కుమార్తెలైన గంగా - పార్వతులకి తేడా లేదుకావున పార్వతీదేవి అక్క అయిన గంగలో  తేజస్సుని విడిచిపెడితేపార్వతీదేవికి కోపం రాదుకాబట్టి  శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారుఅప్పుడా దేవతలు గంగమ్మ దెగ్గరికి వెళ్ళిదేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దెగ్గరనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారుదేవతా కార్యము కనుక గంగ సరే అన్నదిఅప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి  తేజస్సుని అగ్ని నుండి స్వీకరించిందిశివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది తేజస్సుని నేను భరించలేనునన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగిందిఅప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ  తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. 
అలా భూమి మీద పడ్డ  తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారంవెండి పుట్టాయి తేజస్సు యొక్క మలం నుంచి తగరముసీసము పుట్టాయి తేజస్సు యొక్క క్షారం నుంచి రాగిఇనుము పుట్టాయిమిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయిఅక్కడ బంగారు పొదలుగాశరవణ పొదలు పుట్టాయిఅక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించిందిపుట్టిన  పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగాపార్వతీదేవి అంశ అయిన కృత్తికలు  పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడుకృత్తికల పుత్రుడు ) అని పిలవాలిఅలా అయితే పాలు పడతాము అన్నారుదేవతలు సరే అన్నారు.
 మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడుఏక కాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడుషణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయిఅలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకిఅగ్నిసంభవహా అని నామాలుఅలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారుఅలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుకస్కందుడు అని పిలిచారుపార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుకఅమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారుపరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారుఅని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. 
గంగ అసలు భూమి మీదకి ఎందుకొచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడుఆయనకి కేశినిసుమతి అని ఇద్దరు భార్యలుసుమతి గరుక్మంతుడి సోదరితనకి కుమారులు కలగడం కోసం తన ఇద్దరు పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు స్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరాలు తపస్సు చేశాడు సగరుడు భృగు స్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించినీకున్న ఇద్దరు భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడురెండవ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడుఇది విన్న కేశినిసుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగాఆయన మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారుపెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగిందినాకు మహొత్సాహము కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగిందిఆయన సరే అన్నారు.

కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడురెండవ భార్యకి ఒక సొరకాయ పుట్టింది సొరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు వచ్చారువాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారువాళ్ళందరిని కలిపి సగరులు అన్నారుపెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రొజూ రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయు నదిలోకి తీసుకెళ్ళినీళల్లో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడుకొంతకాలానికి రాజుకి విషయం తెలిసి.....
ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిబాధకః ||
పౌరాణాం అహితే యుక్తః పిత్రా నిర్వాసితః పురాత్ ||

తప్పు చేసినవాడు కొడుకైనా సరేఅతనివల్ల ప్రజలకి కీడు జెరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు అసమంజసుడిని రాజ్యం నుంచి బహిష్కరించాడు అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దెగ్గర పెట్టుకున్నాడు  సగర చక్రవర్తిఅలా కొంతకాలానికి  సగరుడు అశ్వమేథ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు  విషయాన్ని సగరుడికి చెప్పాడుఅలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని  యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారుఅప్పుడా సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి భూమి 60,000 యోజనాలు ఉంటుందికనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండిభూమి మొత్తాన్ని వెతకండని చెప్పి పంపాడువజ్రాల్లాంటి తమ గొళ్ళతో  సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారుఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దెగ్గరికి వెళ్లి................దేవాసగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయిఏమి చెయ్యమంటారు అని అడిగారుఅప్పుడు బ్రహ్మ దేవుడు..........మీరెవరు కంగారు పడమాకండి భూమంతా శ్రీమహా విష్ణువుదికనుక ఆయనే  భూమిని రక్షించుకుంటాడుప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు.

కాపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం |
తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజా ||

 సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వాళ్ళు సగరుడికి వద్దకు వెళ్ళి జెరిగినది చెప్పారునాకు గుర్రం తప్పకుండా కావాలిమీరు పాతాళం దాక తవ్వెయ్యండని చెప్పి వాళ్ళని మళ్ళి పంపాడు సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారుఅలా తవ్వుతున్న వాళ్ళకి భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశా గజం అనే ఏనుగు కనిపించింది ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగావాళ్ళకి మహా పద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించిందిఅలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగుఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారునాలుగు దిక్కులలో గుర్రం ఎక్కడా కనపడలేదు సారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారుఅలా తవ్వగా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలొ సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడుఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉందికాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగాలించాడని  సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగుతీసారువెంటనే  కపిల మహర్షి ఒక 'హుం'కారం చేసేసరికి  60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. 
ఎంతకాలమైన సగరులు రాకపోయేసరికి సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడుఅంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడుఅక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడువాళ్ళకి ఉత్తర క్రియలు జెరగలేదు కనుక నీళ్ళు తీసుకువద్దామని బయలుదేరగా సగరుల మేనమామ అయిన గరుక్మంతుడు ప్రత్యక్షమై భూమిలోని  జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరువాళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలికాబట్టి గంగని భూమి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడుసరే అని  యాగాశ్వాన్ని తీసుకెళ్ళి యాగం పూర్తి చేశారుతన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధ పడ్డాడుతరవాత ఆయన ఒక 30,000 వేల సంవత్సరాలు జీవించి శరీరం వదిలాడుఆయన తరవాత అంశుమంతుడు రాజయ్యాడుఆయన 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడుఅలా తపస్సులోనే శరీరం వదిలేశాడుఆయన తరవాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు కాని గంగని తీసుకురాలేకపోయాడుదిలీపుడి తరవాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని మంత్రులకి అప్పజెప్పిగోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరాలు తపస్సు చేయగాఆయనకి బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చాడుఅప్పుడు భగీరథుడు " నాకు కుమారులు లేరుకాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడుఅలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకి పంపించుఅన్నాడు. 

అప్పుడు బ్రహ్మదేవుడు " నీ మొదటి కోరికని నేను తీరుస్తానుకాని గంగని భూమి మీదకి వదిలితేదాన్ని పట్టగలిగేవాడు ఎవడూ లేడుకేవలం శివుడు తప్పకావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యిఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతానుఅని అన్నాడు.



అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బొటనువేలి మీద నిలబడి ఒక సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యినీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడుఅప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడిరెండు చేతులు నడుము మీద పెట్టుకొనికాళ్ళని చాపితన జటాజూటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడునా ప్రవాహంలో  శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతానుఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగఅలా అనుకొని ఆకాశం నుంచి శంకరుడి జటాజూటంలోకి జారిందిఅలా  గంగ ఒక సంవత్సరం పాటు పడుతూనే ఉందికాని శంకరుడి శిరస్సు నుండి ఒక చుక్క నీరు కూడా నేల మీద పడలేదుఅలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉందిభగీరథుడు శంకరుడిని ప్రార్ధించగాఆయన  గంగని బిందుసరోవరంలో వదిలాడుఅప్పుడు  గంగ హ్లాదినీపావనీనళిని అని మూడు పాయలుగా తూర్పుదిక్కుకి వెళ్ళిందిసుచక్షువుసీతాసింధువు అని మూడు పాయలుగా పడమరదిక్కుకి వెళ్ళింది ఏడవ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళిందిరథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహించిందిగంగతో పాటు మొసళ్ళుతాబేళ్లుచేపలు  గంగలో ప్రవహించాయి అపురూపమైన ఘట్టాన్ని చూడడానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారుపాపాలు చేసిన వాళ్ళు  గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారుకొందరు శంకరుడి పాదాల దెగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్ళు తల మీద జల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. 
అలా వెళుతున్న గంగ అక్కడే యాగం చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసిందిఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారుభగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమి లేదువెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగాఆయన గంగని తన చెవులలోనుంచి విడిచిపెట్టాడుజహ్ను మహర్షి చెవులనుంచి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారుఅలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళ లోకంలో ఉన్న ఆయన పితృదేవతల భస్మాల మీద నుంచి ప్రవహించిందిగంగ యొక్క ప్రవాహం తగలగానే  సగరులు స్వర్గానికి వెళ్ళారు.

స్వర్గలోకంలో ప్రవహించేటప్పుడు గంగని మందాకినీ అనిభూమి మీద భాగీరథి అనిపాతాళ లోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతరణం గూర్చి చెప్పాడు

No comments:

Post a Comment