Search This Blog

Monday, 25 June 2018

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం SRI RUDRADHYAYAM - NAMAKAM & CHAMAKAM WITH MEANING

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం 
SRI RUDRADHYAYAM - NAMAKAM & CHAMAKAM WITH MEANING




రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి, నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.

శ్రీ రుద్ర ప్రశ్నః
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః

నమకం
మొదటి అనువాకము:
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరాஉపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశోஉవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నోஉహం తేభ్యో’உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయాஉస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||

శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||

తాత్పర్యము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము. ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక. గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

రెండవ అనువాకము:
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినేஉన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||

తాత్పర్యము:
స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము:
నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమోஉస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోஉశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||

తాత్పర్యము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

నాలుగవ అనువాకము:
నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యోஉరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || ౪ ||

తాత్పర్యము:
దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

అయిదవ అనువాకము:
నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః
శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || ౫ ||

తాత్పర్యము:
సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో ఉన్నరుద్రునికి నా నమస్కారములు.

ఆరవ అనువాకము:
నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చాஉవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || ౬ ||

తాత్పర్యము:
అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు, వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు, గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

ఏడవ అనువాకము:
నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || ౭ ||

తాత్పర్యము:
పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు, మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను, వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.

ఎనిమిదవ అనువాకము:
నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || ౮ ||

తాత్పర్యము:
ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు, రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు

తొమ్మిదవ అనువాకము:
నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || ౯ ||

తాత్పర్యము:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు, ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో, మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు, ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు, కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.

పదవ అనువాకము:
ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మాஉరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితోஉవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || ౧౦ ||

తాత్పర్యము:
పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు. మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక. నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక. ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము. భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా! శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర! నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.

పదకొండవ అనువాకము:
సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్మ్’ సహస్రయోజనేஉవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్మ్’ సహస్రయోజనేஉవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || ౧౧ ||

త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మాஉమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజోஉయగ్మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||

సదాశివోమ్ |

ఓం శాంతిః శాంతిః శాంతిః
తాత్పర్యము:
ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు, కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు, పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్

కొల్లూరు మూకాంబిక - KOLLURU MOOKAMBIKA


 కొల్లూరు మూకాంబిక - KOLLURU MOOKAMBIKA




ఆ ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం.

ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు.

జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ చల్లటి సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి.

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం.

క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది.

ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు.

ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది.

తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు.

శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి.

మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైన హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి  ప్రత్యేకమైనది.

సౌపర్ణికానది..💐
ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి.!
సర్వే జనా సుఖినో భవంతు..!!💐

                     💐శ్రీ మాత్రే నమః

VARANASI VAIBHAVAM వారణాసి కాశి వైభవం

VARANASI VAIBHAVAM
వారణాసి కాశి వైభవం



కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం
స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలంతో కాశీిని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు.
కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు...

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూలచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది.

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

 ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి
అందులో కొన్ని
1) దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్ ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధావుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్ ఇక్కడే బుగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్ తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్ ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు
నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాసపర్వతం నుండి బుగర్భ జలాధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది.

15) నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్ ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం...
ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలిగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్ ఇక్కడే పూర్వం బ్రమ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞాలను తొలగించమని వక్రతుండ వినాయకున్నీ తపస్సు చేసి ప్రసన్నున్ని చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశి
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల ద్ధగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి

పూర్వం కాశిలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.
కానీ  మొహమ్మదియ దండ యాత్రికులు కాశిని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము

విశ్వనాథ ,బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మజిదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.
అక్కడే శివుడు త్రశులం తో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

వీరభద్రుడు - VEERABHADRUDU - SRISAILAM


 వీరభద్రుడు - VEERABHADRUDU - SRISAILAM





శ్రీశైలంలో ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు.

చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

ఇష్టకామేశ్వరి - ISTAKAMESWARI DEVI

 ఇష్టకామేశ్వరి - ISTAKAMESWARI DEVI




మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.

కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.

ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.

* అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
* అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
* రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
* ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
* సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
* కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?

అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.

ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు

ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు.

ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే.

త్రయంబకుడు - TRAYAMBAKESWAR

త్రయంబకుడు - TRAYAMBAKESWAR

త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి??? శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి???
శివ తత్వాన్ని వివరించే అద్భుతమైన పోస్ట్....అందరూ తప్పకుండా చదవండి

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

అర్ధం :-

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!








ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో... ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది -

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.

ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.

ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -

జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.

మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.

విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.

నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.



శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.

తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.

మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.

ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.

విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను.
Sent from my ASUS

BHRAMHARSHI VISWAMITRA STORY -బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి జీవిత విశేషాలు_


BHRAMHARSHI VISWAMITRA STORY_   బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి జీవిత విశేషాలు_




విశ్వామిత్రుడు (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

● 1) _గాయత్రీ మంత్ర సృష్టి కర్త_

● 2) _శ్రీరామున కు గురువు._

● 3) _హరిశ్చంద్రుని పరీక్షించినవాడు._

● 4) _త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడ_

● 5) _శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత._

గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.

*వంశ వృత్తాంతం*

బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా గాధి జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.

*వశిష్ఠుని విందు*

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్య పాలన చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.

శబలను కోరడం, వశిష్ఠుడు నిరాకరించడం అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను తనకు ఇచ్చి లక్ష గోవులను దానంగా స్వీకరించమంటాడు. లక్ష గోవులు ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించడు.

దానితో విశ్వామిత్రుడు కోపించి "నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి" అంటాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవ్యం (హవిస్సులు), కవ్యం (పితృకార్యాలు) జరుగుతున్నాయి, అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తోంది అన్నాడు. పద్నాలుగు వేల ఏనుగులు, ఎనిమిది బంగారు రథాలు, పదకొండు గుర్రాలు, కోటి గోవులు, బంగారం, వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు.. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు.

ఆ మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలో గొలుసు వేసి, తోలుకొని పోతుండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది "నేనేమైనా లోపం చేశానా, నన్ను పరిత్యజిస్తున్నారు? మీరు నన్ను రక్షిస్తారా లేక నన్ను నేను రక్షించుకొనుమంటారా?" వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు.అప్పుడు శబల ఒక హూంకారం (అంబా నాదం) చేసి, వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది.అది చుసి క్రోధ పరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్రుద్ధ అయిన శబల తన శరీరం నుంచి కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాలనుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి నూరుగురు కుమారులు వశిష్ఠమహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడంతో నూరుగురు భస్మరాశులై పడిపోతారు. అది
చూసిన విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, రాజ్యానికి తిరిగి వెళ్ళి, మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి, హిమాలాయాలకు వెళ్ళి పరమశివుడి తీవ్రమైన తపస్సు చేస్తాడు.

*పరమ శివుడి కోసం తపస్సు*

విశ్వామిత్రుడి ఘోర తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమై తన కోరికను వెల్లడించమంటాడు. తనకు ధనుర్వేదం లోని సర్వ రహస్యాలు సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవిస్తాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్లుగా ఉత్సాహంతో ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.

వశిష్ఠుని మీద ధనుర్వేద ప్రయోగంవశిష్టుని ఆశ్రమంపై దండెత్తిన విశ్వామిత్రుడు తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు కకావికలై ప్రాణభయంతో పరుగులుతీస్తారు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి కుటీరం నుండి బయటకు వస్తాడు. విశ్వామిత్రుడు ఆమహర్షిని చూసిన వెంటనే అగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండము ను అడ్డు పెడితే ఆ ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండంలోకి చేరిపోతుంది.

అది చూసిన విశ్వామిత్రుడికి కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరసగా ఒకదాని వెంట మరొకటి ప్రయోగిస్తాడు.
_ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం_ అనే వివిధ అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠమహర్షి నిశ్చలుడై ఉంటాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధం కాగా సముద్రాలు పోర్లుతాయి, పర్వతాలు బ్రద్దలౌతాయి.

బ్రహ్మాస్త్రాన్ని సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండం లోకి చేరి పోతుంది.

*_అది చూసిన విశ్వామిత్రుడు చింతించి, బ్రహ్మణ బలాన్ని క్షత్రియ బలం తో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు._*

*దక్షిణ తీరాన బ్రహ్మ గురించి తపస్సు*

భార్యాసమేతంగా దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి వెయ్యి సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. ఆసమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మధుస్సందుడు, ధృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖబ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, "విశ్వామిత్రా నువ్వు రాజర్షి వి అయ్యావు" అని దీవించి అంతర్ధానమౌతాడు. విశ్వామిత్రుడు దానితో ప్రీతి చెందలేదు. "ఎప్పటికి నేను ఋషిని అవుతాను? ఎప్పటికి మహర్షి అవుతాను? ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను?" అని చింతిస్తాడు.

*త్రిశంకు స్వర్గం*

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె కాక, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తనచేత ఏదైనా యాగం చేయించుమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు వారిస్తాడు.

అంతట వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి తన ఇచ్ఛను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్టుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు.

ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపించి ఛండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులు గా మారిపోయి త్రిశంకుడు ఛండాలుడుగా మారిపోతాడు.

ఛండాలుడి గా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో
తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి,

తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు. వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడనీ విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు.

ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులను భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ శపిస్తాడు. మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడనికూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు.

అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా! రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు.

అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని, నక్షత్రమండలాన్ని) చేయనారంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గం లో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

*అంబరీషుడి అశ్వమేథం - శునశ్శేఫుడికి విశ్వామిత్రుడి మంత్రాలు:*

త్రిశంకుడిని ఆవిధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తరువాత విశ్వామిత్రుడు తపస్సుచేసుకోవడం కోసమని పశ్చిమ దిక్కు కు చేరుకొంటాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీషుడు అనే మహారాజు అయోధ్య ను పరిపాలన చేస్తూ అశ్వమేథ యాగం లోని భాగంగా అశ్వాన్ని విడిచి పెడతాడు.

ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు.యాగం నిర్వహించే ఋత్విక్కులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయి అనిచెప్పి దాని నివృత్తి కోసం అశ్వం తో సమానమైన పశువును తీసుకొని వచ్చి, అశ్వాన్ని పెట్టవలసిన స్థానం లో యూప స్తంభము నకు కట్టి ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు.అశ్వంతో సమానమైన పశువు ని వెతికే పని మీద అంబరీషుడు తన రథం మీద వెళ్ళుతుండగా భార్యా సమేతంగా ఋచీకుడు అనే ఋషి భృతుంగ పర్వతం మీద కనిపిస్తాడు.

ఆ ఋషి కి తన కథచెప్పి యాగ సమాప్తి కొరకు సహాయం రూపం గా ఋషి కుమారుడిని అర్థిస్తాడు. మొదటి సంతానం పూర్వ కర్మ సుకృతం వల్ల జన్మిస్తుంది కనుక తన మొదటి సంతానాన్ని ఇవ్వ లేననీ, మిగిలిన సంతానం విషయమ్ లో తన భార్యను కనుక్కోవలసినదనీ ఋషి చెబుతాడు. చివరి సంతానం మైన శునేకుడిని ఇవ్వడానికి తల్లి నిరాకరిస్తుంది.

ఇక ఆమధ్య సంతానమైన శునశ్శేఫుడి ని అంబరీష మహారాజుకి దానమిచ్చేస్తాడు ఋచీకుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు,
మాణిక్యాలు, బంగారం, పది లక్షల గోవులు ప్రతిగా దానమిస్తాడు.
అంబరీషుడు శునశ్శేఫుడిని రథం ఎక్కించుకొని అశ్వమేథం చేసే స్థలానికి బయలు దేరుతాడు.

మార్గమధ్యంలో బడలిక తీర్చుకోవడానికి ఒక ప్రదేశం లో ఆగితే అక్కడ శునశ్శేఫుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకొనే ఆశ్రమం కనిపిస్తుంది. శునశ్శేఫుడు విశ్వామిత్రుడి వద్ద కు వెళ్ళి తన కథంతా విన్న వించుకొని తనకు బ్రతికి ఉండవలెనని కోరిక ఉన్నదని, ఎంతో గొప్ప తపస్సు చేయాలనే తపన ఉన్నదని చెప్పగా విశ్వామిత్రుడు తన కుమారులను యాగం కోసం బలి గా వెళ్ళమంటాడు.

అది విన్న విశ్వామిత్రుడి కుమారులు "నాన్నా! నువ్వు చెప్పినది కుక్క మాంసం తిన మన్నట్లుంది, ఏవరినో రక్షించడం కోసం కుమారులను బలి ఇస్తావా?" అంటారు. విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కుమారులను వెయ్యి సంవత్సరాలు వశిష్ఠ కుమారులకు పట్టిన గతే పట్టు గాక (కుక్క మాంసం తినేవాళ్ళు గా అవుదురు గాక) అని శపిస్తాడు. (వరుసకు విశ్వామిత్రుడు శునశ్శేఫుడికి
మేనమామ అవుతాడు పరశురాముడు జన్మవృత్తాంతం చూడండి).

అలా కుమారులను శపించాక విశ్వామిత్రుడు శునశ్శేఫుడి వైపు తిరిగి "శునశ్శేఫా! నీకు నేను అభయం ఇస్తునాను, నిన్ను తీసుకొని పోయి యూప స్తంభానికి కట్టేస్టారు, ఎర్రటి బట్ట కడతారు,రక్త చందనం పూస్తారు, నీవు కలత చెందకు, అశ్వమేథ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్లు నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తున్నాను, వేరే చింతన లేకుండా ఈ రెండు మంత్రాలను మనస్సులో మననం చేసుకో, యాగం సమాప్తి అవడానికి మునుపే ఇంద్రుడు వచ్చి యాగం తోసంతృప్తి చెందాను ,యాగానికి కోటి రెట్ల ఫలాన్ని ఇస్తున్నాను అని చెబుతాడు." అని అంటాడు.

ఇది విన్న శునశ్శేఫుడు ఏంతో ఆనందంతో అంబరీష మహారాజు రథం ఎక్కి యాగానికి చేరు కొంటాడు.యాగం లో శునస్సేఫుడిని యూపస్తంభానికి కట్టేస్తారు. అయినా శునశ్శేఫుడు కలత చెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన రెండు మంత్రాలు బాగా మననం చేసు కొంటూఉంటాడు. దీనితో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగ సమాప్తికి మునుపే వచ్చి యాగం తో సంతృప్తి పొందాను అని చెబుతాడు. అంతే కాకుండా శునశ్శేఫునికి దీర్ఘాయువు ఇవ్వడంతో శునశ్శేఫుడు యూప స్తంభం నుండి విడుదలై స్వేచ్చగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళి పోతాడు.

*మేనకా విశ్వామిత్రుల క్రీడలు*

ఆవిధంగా శునశ్శేఫుడిని పంపించేశాక మళ్లీ పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లో తపస్సు మొదలు పెట్టబోతాడు. ఆసమయం లో మేనక పుష్కరక్షేత్రం లో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసి కాముకుడై విశ్వామిత్రుడు మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుంది. ఇలా ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడికి పది సంవత్సరాలు అయిపోయాయి అని స్ఫురణలోకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి, కామక్రోధాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన హిమాలయా లకు చేరుకొంటాడు. మేనక,తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడుబిడ్డను మేనక అక్కడే విడిచి వెళ్ళి పోతుంది. అప్పుడు ఆ బిడ్డను పక్షులు తమ రెక్కల సహాయం తో నీడ కల్పించి రక్షిస్తాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళ్ళుతున్న
కణ్వ మహర్షి ఆ బాలిక ను చూసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి, పెంచుతాడు కణ్వుడు ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెంచి పెద్దచేస్తాడు. శకుంతల దుష్యంతుని వివాహము చేసుకొని తద్వారా భరతుని కి జన్మనిస్తుంది. ఈ భరతుని పేరు మీదగానే భారత దేశానికి భరతఖండమని పేరువచ్చిందని ప్రతీతి. శకుంతల జన్మించిన కణ్వాశ్రమ ప్రాంతము భారతదేశములో వివిధ ప్రాంతాలలో ఉన్నదని చెపుతున్నప్పటికీ, రూఢిగా తెలియడంలేదు.

*ఉత్తర తీరంలో తపస్సు - మహర్షి అవడం* ■■■

ఉత్తర తీరానికి వెళ్ళి,అత్తగారైన సత్యవతి కౌశికి నది రూపం లో ఉండగా అక్కడ ఘోరాతి ఘోర మైన తపస్సు చేయనారంభించాడు.( పరశురాముడి జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ వచ్చి "విశ్వామిత్రా! నీ తపస్సుకి మెచ్చాను. నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు బాధ పడక, ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ఆరంభిస్తాడు. గ్రీష్మ ఋతువు లో పంచాగ్ని హోత్రం మధ్య నిలబడి, శిశిర ఋతువు లో నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి, పరీక్ష కోసంరంభ ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను, వసంతుడు, మన్మథుడు ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా, ఆశ్రమమంతావసంత ఋతువు లా మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి,రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.

*బ్రహ్మర్షి అవడం*

విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్న బ్రహ్మ మరియు ఇతర దేవతలు
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తు బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచి పెట్టడం మానేస్తాడు. ఆవిధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్ఠం క్రింద (ఒక పుల్ల లా) మారిపోయింది. ఆ కాష్ఠాన్ని నిలబెట్టు కోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చొండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని (కబలం)ఇచ్చేస్తాడు.మళ్లీ కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మ స్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశికా! బ్రహ్మర్షీ! అని పిలిస్తే సంతోషించి, బ్రహ్మ ను ఒకకోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది
అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని కి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.

అయితే... వశిష్ఠుడు విశ్వామిత్రుడిలో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. "బ్రహ్మర్షీ" అని పిలిపించుకునేందుకు తహతహలాడడం చూసి, ఇంకా అతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. దీంతో తొలుత అతన్ని "రావయ్య పిలుస్తాను" అని ఆహ్వానిస్తాడు. దగ్గరకు రాగానే "ఇక్కడికెందుకొచ్చావ్? వెళ్లు" అంటూ గద్గద స్వరంతో దూరంగా వెళ్లమంటాడు. దీంతో విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తుండగా... మళ్లీ "అదేంటి...? వచ్చిన పని ముగించకుండా వెళ్లిపోతున్నావ్?" అనడంతో విశ్వామిత్రడు మళ్లీ నమస్కరించి ముందుకు రావడం... వశిష్టుల వారు చీదరించుకోవడం జరిగింది. అలా నాలుగైదు మార్లు జరిగాక... విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని, ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక "బ్రహ్మర్షీ" అని పిలుస్తాడు.

*వారసత్వం (విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు)*

హిందూ వర్ణవ్యవస్థ లో విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు విశ్వామిత్రుడు తమ వంశానికి ఆది పురుషునిగా భావిస్తారు. విశ్వామిత్ర గోత్రజులు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తమ మూలపూరుషునిగా భావిస్తారు. వీరిలో చకిత విశ్వామిత్ర గోత్రము అనే ఉపశాఖ కలదు. ఈ ఉపశాఖకు చెందినవారు విశ్వామిత్రుని ఆశ్చర్యమునుండి ఉద్భవించినారని వారి నమ్మకం.

అయితే ఇది కేవలం ప్రధానశాఖ నుండి ఉద్భవించిన ఒక చీలిక వర్గమే అన్నది మరింత సమంజసమైన తర్కము. అలానే, కామకాయన విశ్వామిత్ర అనే గోత్రము దక్షిణ భారతదేశము లో కనిపిస్తుంది.

కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూలపురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని ప్రతినామమే కౌశికుడు. 96 మరాఠా వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికే చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ వంశము, రాష్ట్రకూట వంశములు కౌశిక గోత్రానికి చెందినవేనని భావిస్తారు. మరాఠా వంశాలలో రెండు వంశాలు విశ్వామిత్ర గోత్రానికి చెందినవి.
విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు ఉత్తరాదిన క్షత్రీయులలో ఎక్కువగాను, దక్షిణాదిన బ్రాహ్మణులలో ఎక్కువగా కనిపిస్తారు. సూర్యవంశమునకు చెందిన బైష్ రాజపుట్ వంశము నకు కౌశిక గోత్రము కలదు.

*సంస్కృతిలో విశ్వామిత్రుడు*

విశ్వామిత్రుడు భారతీయ సంస్కృతికి గాయత్రీ మంత్రంతో పాటు, భారతీయ భాషలకు త్రిశంకు స్వర్గం అన్న పదాన్ని కూడా అందించాడు. అటుఇటు కాక నట్టనడుమ కొట్టుమిట్టాడే పరిస్థితిని త్రిశంకు స్వర్గమనటం నేటికీ పరిపాటే.

" బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక " ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.

*_నీతి మనం తెలుసుకోవలసినది_*

◆ *ఎంత నియమ నిష్ఠలతో సాధన తపస్సు చేసినా కామం క్రోధం ద్వేషం అంతః కరణం లో ఉంటే సాధన వ్యర్ధం అవుతుంది.*

◆ *ఒక కుండ నిండా అమృతం నింపి అందుకు కామము క్రోధము ఇత్యాది రంధ్రాలు పెట్టిన ఆ అమృతం అందులోనుండి కారిపోతుంది వ్యర్థమైపొతుంది.ఈ ప్రక్రియ కి కుండకి కానీ అమృతానికి కానీ ఎలాంటి బాధ్యత ఉండదు.*
*అలాగే మనలో ఉన్న కామము క్రోధము ఎవరో మనల్ని గుర్తించాలి అని ఎవరో మనల్ని విలువ చేసి మర్యాదలు చేయాలని అనుకుంటూ చేసిన కాస్త సాధన ఫలం వ్యర్థం చేసుకోకూడదు...*

*ఎవరి కర్మ వారిదే ఎవరి గమ్యం వారిదే ... ఒక ఇంట్లో పుట్టినా ఒక ఊరిలో పెరిగినా ఒక గురు వద్ద విద్యాభ్యాసం చేసినా ఎవరి కర్మని అనుసరించి మరియు వారి అంతః కరణ శుద్ధిని అనుసరించి వారికి ఫలితం ఉంటుందనేది సత్యం.*

*నేడు మానవులు సత్యం మరచి ఇతర మనుషుల యొక్క చేష్టల వల్ల ప్రభావితులు అయ్యి...*
*అనవసరమైన మానసిక చింత లో ఉండటం లాభం లేనిది అని తెలుస్తున్నది....*

*ఉత్తమమైన నీతి ఏమిటంటే మనము, మన ఉన్నతి కేవలం మన సాధన తపస్సు మరియు మన పవిత్రత వల్ల మాత్రమే కలుగుతుంది కానీ ఇతరుల వల్ల మనకి మంచి జరుతుందేమో కానీ చేడు మాత్రం ఒక 10శాతం మాత్రమే జరుగుతుంది మిగతా 90 శాతం మన వల్ల మనకే...*

*ప్రపంచం.మారాలంటే మనం మారాలి....*

*ఆదిశంకరులు ఒక చోట ఇలా సెలవిచ్చారు " ఏ మానవుడు ఆశకి లోబడి ఉంటాడో అతడు ప్రపంచానికి వశుడై కష్టాల పాలు అవుతాడు అలాగే ఎ మానవుడికి ఆశ లోబడి ఉంటుందో ఆతడికి లోకమే వశమై ఉంటుంది "*

స్వస్తి

Sunday, 17 June 2018

కేదారనాథ్ - KEDARNADH

కేదారనాథ్




జయ భోలేనాథ్ - భోలే నాథుడిపై భక్తిని రెట్టింపు చేసే కధ

కేదారనాథ్ ని ‘జాగృత మహాదేవుడు’ అని ఎందుకు అంటారు? రెండు నిముషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది. పూర్తిగా చదవండి-
 ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు। దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు। మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు। అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి।
 చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు। కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు। అతడు మందిరం ద్వారాలు మూసేవేళ అక్కడకు చేరాడు। పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు- ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను। కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’। అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే। నియమం నియమమే మరి। అతడు చాలా దుఃఖపడ్డాడు। మాటిమాటికీ శివుని స్మరించాడు. ‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా?’ అని। అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు।
 పూజారి అన్నాడు కదా- ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలయ్యాకే తలుపును తెరిచేది’ అని। ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’। అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు। అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు। ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి। కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద – ఆయన తప్పక కృప చూపుతాడని। అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి।
 అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు। చూస్తే ఒక సన్యాసి అతని వైపు వస్తున్నాడు। ఆ సన్యాసి అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు। అడిగాడు- ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’। అని బాధపడ్డాడు. సన్యాసి అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు। తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండిపోయాడు।  సన్యాసికి అతడి పై దయ కలిగింది। ఆయన- ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది। నీకు తప్పక దర్శనం దొరుకుతుందనిపిస్తున్నది’। అని అన్నాడు
 మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు। సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి। అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు। అతడికి ఏదైనా అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు। అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు – ‘నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’। అని. పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు – ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా। ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే। నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను। నేనెటూ కదలలేదు’। అని.
 పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు। ఆయన అన్నాడు – ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం। నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ అని. పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు। ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు? అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు। ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’। అని.
 వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు। ఇట్లా అన్నారు – ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే। నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు। ఆయనే తన యోగమాయతో నీకు ఆరునెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు। కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు। ఇదంతా నీ పవిత్రమైన మనస్సు, శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది। మేము నీ భక్తి కి ప్రణామాలు అర్పిస్తున్నాము’। అని.
#LordShivaStories

శ్వేత వినాయకర్ - SWETHA VINAYAGAR TEMPLE - KUMBHAKONAM

శ్వేత వినాయకర్



సముద్ర నురుగుతో తయారుచేసినట్లు చెప్పే వినాయక విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తకరని చెబుతారు. అదే విధంగా ఈ విగ్రహాన్ని వినాయకచవితి రోజు పూజిస్తే ప్రతి రోజు వినాయక పూజ చేసిన ఫలితం దక్కుతుందని స్థానికులు చెబుతారు. ఇక స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రం పూర్తి వివరాలు మీ కోసం

 1. మొదటి పూజ వినాయకుడికి

ఏదైనా కార్యం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా విఘ్నరాజైన వినాయకుడికి పూజ చేయాలి. లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెబుతాయి.
 
2. అమృతం బదులు హాలహలం

ఇదిలా ఉండగా అమరత్వం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మధనం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట అమృతం బదులు హాలహలం వచ్చింది.

3. సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం

ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే రాక్షసులతో పాటు దేవతలకు తాము చేసిన తప్పు తెలిసివచ్చింది. దీంతో ఆ పరమశివుడి సూచన మేరకు సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం చేసి దానిని పూజించారు.
 
4. స్వర్గానికి తీసుకువెళ్లి

దీంతో అటు పై నిర్విఘ్నంగా వారి కార్యం కొనసాగి చివరికి అమృతం దక్కించుకొన్నారు. అటు పై ఇంద్రుడు ఆ నురుగుతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లి అక్కడ పూజించేవాడు.
 
5. భూమి పైకి తీసుకువచ్చి

ఇలా కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు గలిగిన శాప నివృత్తికోసం సముద్ర నురుగుతో తయారుచేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవాడు.
 
6. ఆ శ్వేత వినాయకుడిని

ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కుంభకోణానికి ఇంద్రుడు ఆ నురుగుతో చేసిన ఆ శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడి పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడైన వినాయకుడు ఇక్కడే ఉండిపోవాలనుకొంటాడు.

7. శివార్చనకు సమయం

ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు. దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు. అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతుంది.

8. కింద పెట్టకూడదని చెబుతాడు

దీంతో ఆ పిల్లవాడి చేతికి స్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెలుతాడు. శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెబుతాడు.

9. బలిపీఠం కింద పెట్టి

అయితే ఇంద్రుడు అలా వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుడిని అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లి పోయాడు.
 
10. ఎన్ని ప్రయత్నాలు చేసిన

తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విగ్రహం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. అటు పై దేవ శిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు. ఆ రథం పై వినాయకుడు ఉన్న ప్రాంతంతో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు.
 
11. అశరీర వాణి

అదే సమయంలో అశరీరవాణి శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండాలని భావిస్తున్నాడని చెబుతుంది. దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.

12. ప్రతి వినాయక చవితికి

అంతేకాకుండా ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతి రోజూ పూజించిన ఫలితం లభిస్తుందని అశరీర వాని ఇంద్రుడికి సూచిస్తుంది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు.

13. అభిషేకం చేయరు

ఇక ఇక్కడి విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తకరని చెబుతారు.

14. త్వరగా వివాహం

ఇక ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

 
15. ఎక్కడ ఉంది

ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సిటీ బస్సుల్లో తిరిగితే ఖర్చు తక్కువ. అయితే ఓపిక లేనివారు సిటీ ట్యాక్సీల్లో తిరగవచ్చు. ఇందుకు కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.          స్వెత వినాయగర్ ఆలయం, తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని కుంబకోణం తాలూకాలో ఉన్న స్వామిమలై సమీపంలోని తిరువల్లాంచూజి గ్రామంలో ఉన్న ఒక హిందూ ఆలయం.

దిక్కుల ప్రాదాన్యత - IMPORTANCE OF DIRECTIONS

దిక్కుల ప్రాదాన్యత



మనకు ఎనిమిది దిక్కులు ఉన్నాయి. వాటిని 'అష్ట దిక్కులు' అంటాము. వాటిని పాలించే వారిని 'దిక్పాలకులు' అంటారు.దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములను 'దిక్కులు' అంటారు.

విదిక్కులు: ఈ నాలుగింటితో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము అను నాలుగు విదిక్కులు కూడా కలవు. అన్నింటిని కలిపి అష్టదిక్కులు అంటాము.

1) తూర్పు: తూర్పు దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత ఇంద్రుడు. ఇంద్రుని భార్య శచీదేవి. ఆయన వాహనము ఏనుగు. నివసించే పట్టణము 'అమరావతి.' ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము. ఈయన పురుష సంతాన కారకుడు. అధికారం కలుగజేయువాడు. సూర్య గ్రహం ప్రాదాన్యత వహించే ఈ దిక్కు దోషం వలన అనారోగ్య సమస్యలు, అదికారుల బాధలు ఉంటాయి.

2) ఆగ్నేయ మూల: ఆగ్నేయ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు. అగ్ని భార్య స్వాహాదేవి. వాహనము పొట్టేలు. అగ్నిహోత్రుడు నివసించే పట్టణము తేజోవతి. ధరించే ఆయుధము శక్తి. ఈయన కోపం,అహంకారం ప్రసాదించే వాడు. ఆగ్నేయం శుక్రుడు ప్రాదాన్యత వహిస్తాడు. ఆగ్నేయం వంటకు సంబందించిన దిక్కు. వంట స్త్రీలకు సంభందించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి.

3) దక్షిణము: దక్షిణ దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత యమధర్మరాజు. ఈయనకు దండపాణి అని మరో నామధేయమున్నది. యముని భార్య శ్యామలాదేవి. యముని యొక్క వాహనము మహిషము (దున్నపోతు). నివసించే పట్టణము సంయమని. యముడు ధరించే ఆయుధము దండము. దండమును ఆయుధముగా కలవాడు కాబట్టి ఈయనను 'దండపాణి' అని కూడా అంటారు. యముడు వినాశనం, రోగం ప్రసాదించేవాడు. కుజుడు ఆదిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచు వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.

4) నైరుతి మూల: నైరుతి దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. ఇతని భార్య దీర్ఘాదేవి. వాహనము నరుడు. ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన. నైరుతి ధరించే ఆయుధము కుంతము. వంశ నాశకుడు నైరుతి. నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాదాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసికమైన చికాకులు అధికం

5) పడమర: పడమర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వరుణుడు. వరుణుని భార్య కాళికాదేవి. వాహనము మకరము (మొసలి). ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి. ధరించే ఆయుధము పాశము. సర్వ శుభములను ప్రసాదించేవాడు. పడమర దిక్కు శనిగ్రహ ప్రాదాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి.

6) వాయువ్య మూల: వాయువ్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత వాయువు. అనగా వాయుదేవుడు. ఈయన భార్య అంజనాదేవి. వాహనము లేడి. నివసించే పట్టణము గంధవతి. ధరించే ఆయుధము ధ్వజము. పుత్ర సంతానమును ప్రసాదించువాడు. వాయువ్య దిక్కు చంద్రుడు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి.

7) ఉత్తరము: ఉత్తర దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత కుబేరుడు. ఇతని భార్య చిత్రలేఖ. వాహనము గుర్రము. కుబేరుడు నివసించే పట్టణము అలకాపురి. కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము. విద్య, ఆదాయము, సంతానము, పలుకుబడి ప్రసాదించువాడు. బుధుడు ఉత్తరదిక్కు ఆదిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం, విద్యా సంబంద విషయాలలో ఇబ్బందులు వస్తాయి.

8) ఈశాన్య మూల: ఈశాన్య దిక్కును పాలించువాడు, అధిష్ఠాన దేవత శివుడు. శివుని భార్య పార్వతీదేవి. శివుని వాహనము వృషభము(ఎద్దు). నివసించు ప్రదేశం కైలాసం. శివుడు ధరించు ఆయుధం త్రిశూలం. గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు, భక్తి జ్ఞానములు, ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు. ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆదిపత్యం ఉంటుంది.ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎర్పడతాయి.

ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాలురు ఉండి మానవు లను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా, దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు.

దిక్పాలకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు. అష్ట దిక్కులకు వారిని నియమించి, విధి విధానాలను, నియ మాలను, ధర్మాలను ఆజ్ఞాపించు వాడు, నడి పించు వాడు, అధి(పతి)కారి శ్రీ మహా విష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు.

కాంచీపుర వైభవం - కామాక్షి తల్లి కటాక్షం KANCHI KAMAKSHI KATAKSHAM

కాంచీపుర వైభవం -    కామాక్షి తల్లి కటాక్షం 



  1) కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు . తల్లి సంకల్పమే ప్రధానం . ( ఇది గొప్ప విశేషం )
  2)  సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం . ( మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది . (అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది  )
  3)  ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు . (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )
 4) ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు.
  ( ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు )
  5)  కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది . కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మితల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే , భర్తను నిందించిన దోషం
పొతుంది . మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది .
  6)  కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం .
తపస్సులో భాగంగా ,శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి .
  7)  కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు , శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు .( తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి )
    అమ్మధ్యానంలో , "శోకాపహంత్రీ  సతాం" అనే దివ్య వాక్కు గురించి వర్ణణ ఉంది .
ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది . భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది .

      కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి

భ్రమరాంబా అమ్మవారి - BHRAMARAMBA DEVI


 భ్రమరాంబా అమ్మవారి



శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది. 

పోతన మొట్టమొదట పద్యం - POTANA FIRST POEM


పోతన  మొట్టమొదట పద్యం


పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!

పోతనగారి శక్తి ఏమిటోపోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు.

 రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెట్టే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –

’కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా డింభకున్’

అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు.