పార్వతీ కళ్యాణము – పార్ట్ 3
దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరమును వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకు జగదంబ శక్తి స్వరూపిణి కావాలి. అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మా నీవు మరల ఆవిర్భవించాలి. మమ్మల్నందరినీ రక్షించాలి అని ప్రార్థించారు. అమ్మ సౌమ్య రూపంతో దర్శనమిచ్చి మీ అందరి కోరిక తీర్చడానికి నేను మళ్ళీ పార్వతి అనే పేరుతో మేనకాహిమవంతులకు కుమార్తెగా పుడతాను అంది. అయితే ఈ మేనకా జననము నందు ఒక పెద్ద రహస్యం ఉంది. దక్షప్రజాపతి కుమార్తెలలో ‘స్వధ’ అనబడే ఒక ఆమె ఉన్నది. ఆమెను దక్ష ప్రజాపతి పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. వారికి ముగ్గురు కుమార్తెలు జన్మించారు. మొదటి ఆవిడ పేరు మేనక. రెండవ ఆవిడ పేరు ధన్య, మూడవ ఆవిడ పేరు కళావతి. ఈ ముగ్గురూ పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. అయోనిజల స్థాయిలో గౌరవింపబడినవారు. ఈ ముగ్గురూ ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు. శ్రీమహావిష్ణువు కొలువుతీరి ఉండగా వీరు లోపలికి వెళితే వారిని ఉచితాసనములయందు కూర్చుండబెట్టారు. ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడి సంకల్పం వేరుగా ఉంది. అక్కడ శివమాయ ప్రసరించింది. సనక సనందనాదులు వస్తుండగా ఈ పిల్లలు లేవలేదు. సభలోకి బ్రహ్మజ్ఞానులయినవారు వెళ్తున్నప్పుడు లేచి నిలబడాలి. లేవలేదు కనుక వారికి శాపం ఇచ్చారు. మీరు ముగ్గురూ భూమండలమునందు జన్మించెదరు గాక! అని. అపుడు వారు లేచి మహర్షుల పాదముల మీద పది ‘మాకీ శాప విమోచనం ఎలా కలుగుతుందో ఆజ్ఞాపించవలసినది’అని వేడుకున్నారు. సనత్కుమారుడు శాపవిమోచనమును చెప్పారు. ‘విష్ణువు అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. మేనక విష్ణ్వంశ కలిగిన హిమవంతునకు భార్యగా వెడుతుంది. ధన్య మహాజ్ఞాని అయిన జనకమహారాజుగారి భార్య అవుతుంది. కళావతి భూలోకమునందు వృషభానుడు అనే ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మతల్లి జన్మిస్తుంది. కళావతీ వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. ధన్య సీతమ్మ తల్లికి తల్లియైన కారణం చేత విష్ణు లోకమును పొందుతుంది. కళావతి రాధకు తల్లియైన కారణం చేత గోలోకమును పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరములను ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ మేనకి హిమవంతునకు భార్య అయింది.
మేనక ప్రతినెలా అష్టమినాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది. అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడకు ప్రత్యక్షం అయింది. ఏ వరముకోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప పూజ చేస్తున్నావు? అని అడిగింది. ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజ్రుంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరగాలి. ఇక్కడ పార్వతీ దేవిగా ఆవిడ పుట్టాలి. అపుడు మేనక ‘నాకు నూర్గురు కుమారులు కావాలు. నూర్గురూ గుణవంతులు కావాలి. వారి తర్వాత ఒక కుమార్తె కావాలి. ఆమె త్రైలోక్య పూజిత కావాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశమును, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశమును ఉద్ధరించేలా ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నీవే నాకు కూతురుగా రావాలి అంది. ఈ మాటలకు అమ్మవారు చాలా సంతోషపడిపోయి నీ భక్తికి మెచ్చుకున్నాను. నీవు కోరిన విధంగా నీకు కూతురుగా పుడతాను. పర్వతరాజ పుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతి అని పిలుస్తారు. కొంచెం నల్లగా పుడతాను కనుక కాళి అని పిలుస్తారు. నారాయణుని చెల్లులుగా ఉంటాను కాబట్టి నారాయణి అని అంటారు. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టమును మీరు పొందుతారు. సశాస్త్రీయమయిన వివాహం జరుగుతుంది. కాముడిని కాల్చగలిగిన శంకరుడిని పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారమునకు వచ్చేటట్లు చేస్తాను. మీరు పిల్లనిస్తున్నారని ఆడ పెళ్ళి వారింటికి మగపెళ్ళివారు వచ్చేటట్లు చేస్తాను. కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలి వచ్చేటట్లు చేస్తాను. శంకరుడే కదిలివస్తే ఎంతమంది వస్తారో చూద్దురు గాని! భూమి ఆ బరువును మోయలేక పక్కకి ఒరిగిపోతుంది. కనీవినీ ఎరుగని చరిత్రాత్మకమయిన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీరిద్దరూ కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తున్నాను. అంతటి రంగరంగవైభోగంగా కళ్యాణం జరుగుతుంది అని చెప్పింది.
అలా ఆరోజు తల్లి పార్వతీదేవిగా జననమొందింది. అక్కడ హిమవంతుని కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది. హిమవంతునికి కుమార్తెగా పుట్టింది కాబట్టి హైమవతి అని, పర్వతరాజ పుత్రి కాబట్టి పార్వతి అని పిలువబడింది. చిన్నపిల్లగా పుట్టినా ఆవిడ ఎవరో హిమవంతుడికి తెలుసు. ఆయన కూతురిలో అమ్మవారినే దర్శనం చేశాడు. ఆ తల్లి క్రమక్రమంగా మేనకా హిమవంతుల వాత్సల్యమునకు నోచుకుని పెద్దదవుతూ యౌవనంలోకి ప్రవేశించి శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణ చంద్రుడు అవుతాడో అలా అమ్మవారు పూర్ణ చంద్రబింబము వంటి ముఖంతో పెరిగి పెద్దదై చక్కగా యౌవనంలోకి ప్రవేశించింది. యౌవనంలోకి ప్రవేశించినప్పటి నుంచి అమ్మవారి కోర్కె ఒక్కటే. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనే అయిదు ముఖములు కలిగిన పరమశివుడిని భర్తగా పొంది ఎప్పుడు మరల ఆయన వామార్ధ భాగమును చేరుకుంటానో అని ఆ తల్లి ప్రతినిత్యము తలుచుకుంటూ ఉండేది.
అక్కడ శంకరుడు ఒక ఆశ్చర్యకరమయిన స్థితిని పొంది ఉన్నాడు. దక్షిణామూర్తియై లోకమునకంతటికీ జ్ఞానమును కటాక్షిస్తున్నాడు. ఒకనాడు కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చుని ఉండగా ఆయన లలాటభాగమునుండి ఒక చెమట బిందువు ఆయన ముందుకు వంగినపుడు క్రిందపడింది. అది కైలాసపర్వత శిఖరము నుండి కింద పడుతూ వచ్చి భూమిమీద పడింది. అది శంకరుడి స్వేద బిందువు. వట్టినే పోవడానికి వీలులేదు. అందుకని భూదేవి అలా క్రిందపడిన బిందువును తాను స్వీకరించింది. అలా స్వీకరించగానే ఆ భూమిలోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. అపుడు శంకరుడు కైలాసం మీదనుండి చూసి ఈ పిల్లవాడు నానుండి చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు గనుక వీడికి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికములనేటటువంటి మూడు తాపములు ఉండవు. ఈ పిల్లవాడిని నీవు స్వీకరించు. ఈ పిల్లవాడిని భూమి కుమారుడు అని లోకం పిలుస్తుంది. వేడిని పెంచి పెద్ద చెయ్యి. అన్నాడు. ఆవిడ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడు వారణాసి క్షేత్రమునకు వెళ్ళి శంకరుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి ఒక ఆశ్చర్యకరమైన వరం ఇచ్చాడు. నువ్వు శుక్ర గ్రహమునకు మీద కుజుడు అనబడే గ్రహంగా సంచరిస్తూ ఉంటావు. నవగ్రహములలో నీవు ఒక గ్రహం అవుతావు అని. అప్పుడు వచ్చిన గ్రహమే కుజగ్రహం. తరువాత శంకరుడు కొంతకాలం తపస్సు చేస్తాను అన్నాడు. అందుకు హిమాయల పర్వతములకు వెళ్ళి కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.
ఒకనాడు హిమవంతుడు పార్వతితో ‘మహానుభావుడు శంకరుడు హిమాలయ పర్వత ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకు శుశ్రూష చేయడం వలన శుభం కలుగుతుంది. కాబట్టి రా తల్లీ నిన్ను తీసుకువెడతాను’ అని చెప్పి నక్షత్ర వీధిని దాటి శంకరుడు తపస్సు చేస్తున్న ప్రదేశమునకు తీసుకు వెళ్ళాడు. ఆ ప్రదేశం ఎంతో అందంగా రమ్యంగా ఉంది. అక్కడ శంకరుడు బ్రహ్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. తలమీద చంద్రవంక ప్రకాశిస్తుండగా అంతర్ముఖుడై యోగవిద్యలో తనలోతాను రమిస్తున్నవాడై బాహ్యమునకు ఏవిధమైన స్పర్శ లేకుండా దేనినీ చూడకుండా ధ్యానమునందు ఉన్నాడు. పార్వతీ దేవి వచ్చింది. కానీ ఆమె వచ్చినట్లు శంకరునకు తెలియదు. ఇద్దరూ దూరంగా నిలబడి చేతులు కట్టుకుని ఆయన బహిర్ముఖుడు అయ్యే వరకు ఎదురు చూస్తున్నారు. కొంతసేపటికి శంకరుడు నెమ్మదిగా సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు. హిమవంతుడు గబగబా పార్వతీ దేవిని దగ్గరకు తీసుకు వెళ్ళి అత్యంత గౌరవంగా శంకరునికి నమస్కారం చేశాడు. పరమేశ్వరుడు పార్వతీ దేవి వంక పవిత్రంగా చూశాడు.
పార్వతీదేవి మన్మథుని బాణమునకు స్త్రీరూపం దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది. సాక్షాత్తు మన్మథుడే స్త్రీ రూపం పొంది వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దేవతా స్త్రీ ఎవరయినా వచ్చిందా అన్నట్లు ఉంది. బంగారు తీగ ప్రాణం పోసుకున్నదా అన్నట్లుంది. అసలు ఈ లోకంలో ఎవడయినా పురుషుడన్నవాడు ఆవిదవంక చూసిన తర్వాత ఇంక మోహమును పొందకుండా ఉండడం అసంభవం. హిమవంతుడిని పార్వతిని చూసి శంకరుడు ఒకందుకు వెరగుపడ్డాడు. ఇంత చక్కటి కుమార్తెను కన్నందుకు పర్వతరాజు ధన్యుడు అయ్యాడని శంకరుడు భావించాడు.
పార్వతి ఒక్కమాట మాట్లాడలేదు. శంకరునికి నమస్కారం చేస్తూ తండ్రి వెనకాల నిలబడింది. ఆ తల్లి యౌవనంలోకి వచ్చినప్పటి నుంచి శివుడి భార్య కావాలని అనుకుంటున్నది. ఆవిడ శంకరుని చూసి కన్నులు తిప్పుకోలేక పోయింది. అందుకే శంకరుడి అందమును ‘కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం’ అని పొగిడింది శివపురాణం. కోటి సూర్యులు ఉదయించినట్లు అంత అందంగా ఉంటాడు. ఆవిడ ఆయన కుడి చేతికి ఉన్న పామును చూస్తూ ఉండిపోయింది. ఈ చెయ్యి తొందరలో నా చెయ్యి పట్టుకోవాలి. ఈ చెయ్యి తొందరలో నా మెడలో తాళి కట్టాలి. ఈ చెయ్యి లోకరక్షణ హేతువు. అని ఆలోచిస్తూ ఎంత తొందరగా శంకరుడిలో కలిసిపోతానా అని ఆలా చూస్తూ నిలబడిపోయింది. హిమవంతుడు కూతురుకేసి చూసి ‘అమ్మా శంకరునికి నమస్కరించు; అని ఆమె దృష్టిని మరల్చాడు. పార్వతి శంకరుడికి భార్య కావలసిన పిల్ల అని హిమవంతుడికి తెలుసు. తండ్రితనం అంటే అదే. కూతురికి మర్యాద నేర్పినవాడు తండ్రి. కూతురుని రెచ్చగొట్టినవాడు, కూతురికి నడువడిని నేర్పనివాడు తండ్రికాడు. ఇపుడు హిమవంతుడు శంకరుడికి నమస్కరించి స్తోత్రం చేశాడు. “అయ్యా, నేను ఒక కోరికతో వచ్చాను. ఈమె నా కుమార్తె. మీవంటి మహా పురుషుని సేవ చేయడం కోసం తీసుకువచ్చాను. తపస్సు చేసేవాడికి ఆడపిల్ల ప్రతిబంధకం. ఆడపిల్ల అందులోనూ యౌవనంలో ఉన్నది నాకేమి సేవ చేస్తుంది నాకెందుకు ఆమె సేవ అంటారేమో మా పిల్ల నువ్వు తపస్సు చేసుకోవడానికి పుష్పార్చన చేస్తుంది. నీ కొప్పులో పూలు పెట్టాక కానీ మా పిల్ల తన కొప్పులో పూలు పెట్టుకోదు. ఏనుగు నడిచినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంత అందమయిన నడకలు ఉన్న నా కూతురు గంధం నీ ఒంటికి రాసిన తర్వాత కానీ తన ఒంటికి రాసుకోదు. కాబట్టి నీకు గంధార్చన చేస్తుంది. అన్యాపదేశంగా తన కూతురు శంకరుడి సొత్తు అని చెప్తున్నాడు. రోజూ నీకు హస్తార్చన క్రింద నీ చేతికి కంకణములు వేసి తను కంకణములు వేసుకుంటుంది. నా కుమార్తె ముందుగా తను పట్టుపుట్టం కట్టుకోడు. తను నారచీరతో వచ్చి నీకు పట్టుపుట్టమును సమర్పించి పిమ్మట తను పట్టుపుట్టం కట్టుకుంటుంది. ఏదయినా అదేపనిగా మాట్లాడుతుందేమోనని అంటావేమో అసలు నా కూతురు నోరువిప్పి నీతో ఏమీ మాట్లాడదు. నిన్ను పూజ చేసి వెళ్ళిపోతుంది. నీవు పూజ చేసుకోవడానికి అన్నీ అమర్చేస్తుంది. నిన్ను ఇలా సేవించి వెళ్ళిపోతూ ఉంటుంది. నా పిల్ల నీకు ఇన్ని సేవలు చేసి ఆ తరువాత వరములు అడుగుతుందని అనుకుంటావేమో! అలా వరములు అడగడం కోసం నా కూతురు నీకు సేవ చేయడం లేదు. కేవలం నీకు సేవ చేయాలనే నా కూతురు కోరుకుంటోంది’ అన్నాడు. మాట మాట్లాడినప్పుడు తండ్రితనం పోకూడదు. కూతురు ఆయనను చేరిపోవాలన్న ఆర్తి పాడైపోకూడదు.
శంకరుడు ఒప్పుకోవదమా వద్దా అన్నట్లు చూస్తున్నాడు. అప్పుడు హిమవంతుడు వేడుకున్నాడు. పార్వతీదేవిని శంకరుని సేవకు వినియోగించి కూతురితో తల్లీ, ఆ మహానుభావుడిని జాగ్రత్తగా సేవించు. చీకటి పడేవేళకి ఇల్లు చేరు. నీకు శ్రేయస్సు కలుగుతుంది’ అని చెప్పి హిమవంతుడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.

No comments:
Post a Comment