Search This Blog

Thursday 12 April 2018

SRI VENKATACHALA VAIBHAVAM



SRI VENKATACHALA VAIBHAVAM



ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - తిరుమల

          చారిత్రక పరంగా చూస్తే తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారమైన ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు.ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి మామగారైన ఆకాశరాజుకు సోదరుడు.

          కలియుగంలో భక్తులను తరింపజేయటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి తిరుమలను కలియుగ వైకుంఠంగా నిలబెట్టాడు.ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వారించి నిలబెట్టినాడు.అప్పుడు వారిరువురి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది.శ్రీమహావిష్ణువు వారి దగ్గిరకి వచ్చినప్పుడు వారిరువురు ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారికి గర్వభంగం కలిగీంచాలని ఒక పరీక్ష పెడతాడు.మేరుపర్వతం ఉత్తరభాగంలో ఉన్న ఆనందశిఖరాన్ని గట్టిగా చుట్టుకోమని ఆదిశేషునికి చెప్పి వాయుదేవునితో ఆ పర్వతాన్ని అక్కడ నుంచి కదల్చగలవేమో ప్రయత్నించమని చెబుతాడు.

         ఈ పరీక్షలో తన బలాన్ని ప్రదర్శిస్తున్న వాయుదేవుని ధాటికి సమస్త లోకాలూ తల్లడిల్లుతుంటే బ్రహ్మ అభ్యర్ధన మేరకు ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలిస్తాడు.అంతట వాయుదేవుని ప్రభావం వల్ల ఆనంద శిఖరం కదిలిపోయి సర్వముఖి నది ఒడ్డున పడుతుంది.ఇది తెలిసి ఆదిశేషుడు బాధ పడుతుంటే బ్రహ్మ ఆ వేంకటాద్రిలో నిన్ను విలీనం చేస్తాను, అక్కడ శ్రీమహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి సముదాయించాడు. ఆదిశేషుడు విలీనం అయిన వేంకటాద్రి మీద విష్ణువు  పడగ అయిన శేషాద్రి పైన శ్రీనివాసుడుగా, మధ్యభాగమైన అహోబిలంలో శ్రీ నారసింహ స్వామిగా వెలిస్తే తోకభాగమైన శ్రీశైలంలో శివుడు శ్రీమల్లికార్జునుడుగా వెలిశారు అని పురాణాలు చెబుతున్నాయి.

    పద్మావతీ దేవి తిరుచానూరులో వెలిసి బ్రహ్మేంద్రాది దేవతలు సైతం ఎవరి దర్శనానికి వేత్రహస్తుల దెబ్బల్ని కూడా తట్టుకుంటూ పడిగాపులు పడుతూ ఉంటారో ఆ కందర్పదర్పహరసుందరదివ్యమూర్తిని తలచినదే తడవుగా తన వద్దకే రప్పించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నది.అప్పుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళినీ కూడా చూడలేని కొరతని ఇప్పుడు వకుళమాతగా జన్మించి తీర్చుకున్న యశోదమాతను తులసిమాలగా కంఠసీమలో అలంకరించుకున్నాడు శ్రీచక్ర శుభనిలయుడైన శృంగార శ్రీనివాసుడు!

          రామాయణ,భారత,భాగవతాది కధలలోని తన సంపూర్ణకృపకు నోచుకోని భక్తశిఖామణులను చరితార్ధులను చేస్తూ తన సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకున్నవారికి బ్రహ్మేంద్రాదులకు కూడా సాధ్యపడని తన నిజతనుస్పర్శను కూడా ప్రసాదించిన విశేషం ఈ శ్రీనివాసుని కధలో అంతర్లీనమై ఉండి భక్తవరదుని శిష్టజనవాత్సల్యాన్ని నిరూపిస్తున్నది!

2. ఆలయ విశిష్టత (importance of the deity)

          ఇక్కడి స్వామికి ఆపద మొక్కుల వాడు అని పేరు.ఏదయినా కోరిక నెరవేరాలంటే స్వామివారికి సమర్పించడం కోసం ముడుపు కట్టుకుని ఆ కోరిక తీరగానె స్వామిని దర్శనం చేసుకుని ఆ ముడుపు కట్టిన దాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీ.

          శ్రీవారి దివ్యమంగలవిగ్రహం ఎత్తు 9.2 అడుగులు.శిలాతోరణద్వారం ఎత్తూ ఈ ఎత్తూ సమానం - అంటే ఈ మూర్తి అలా నడుచుకుంటూ శిలాతోరణాన్ని దాటితే వంగనక్కరలేదు,తల మీద ఖాళీ ఉండదు.విగ్రహం మెద ఉలి చెక్కడపు ఆనవాళ్లు కనపడవు - ఒక మనిషి తనకు తానే శిలారూపం దాల్చినంత జీవకళ కనపడుతుంది ఆ మూర్తిలో!అసలు శిల్పులు అర్చామూర్తులని చెక్కదానికి సంబంధించిన ఆగమశాస్త్రనియమాలు ఈ మూర్తికి వర్తించవు.ఈ మూర్తి స్వయంభువు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలు.ఎప్పుడు ఎవరు కొలిచినా శ్రీవారి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఎన్ని రకాల నిత్యాభిషేకాలు జరిగినప్పటికీ వెంటనే ఆరిపోతాయి,ఆవన్నీ ఆరిపోయిన వెంటనే మూర్తి 110 డిగ్రీలకి చేరుకుంటుంది!

          మనం క్యూలో వెళ్తున్నప్పుడు విగ్రహం ద్వారానికి ఎదురుగా అంటే గుడి లోపల మధ్యకి ఉన్నట్టు కనబడుతుంది,కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలన  ఉంటుంది.
          స్వామి వెనక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు అలల హోరు వినబడుతూ ఉంటుంది.స్వామివారి వీపుని ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ కొద్ది సేపట్లోనే చెమటతో తడిసినట్టు అయిపోతుంది.

          స్వామివారికి ప్రతి రోజూ పూసే పచ్చ కర్పూరం చాలా ఘాటైనది,ఒక మామూలు రాతికి రోజూ దాన్ని పూస్తే కొద్ది రోజులకే పగుళ్ళు రావటం ఖాయం - మరి,ఇన్ని సంవత్సరాల నుంచి ధృవబేరుకి మాత్రం ఏమీ కావడం లేదు,ఎందుకని?

          రమణ దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం స్వామివారి ముఖం ఉదయం బాలకుని పసితనాన్ని చూపిస్తుంది,మధ్యాన్నం నడివయస్కుని గాంభీర్యాన్ని చూపిస్తుంది,సాయంకాలం శతవృద్ధుని వైరాగ్యాన్ని చూపిస్తుంది.ఆయా వేళల్లో దర్శించిన భక్తులు కూడా  ఈ భేదాన్ని తెలుసుకోవచ్చు!ఊదయవేళ దర్శించినవారికి విద్యలో వృద్ధీ చిరాయువూ, మధాహ్నవేళ దర్శించినవారికి ధృఢదేహమూ ఐశ్వర్యప్రాప్తీ, సాయంవేళ దర్శించినవారికి జ్ఞానవృద్ధీ మోక్షమూ ప్రాప్తించడం అనుభవైకవేద్యమే!

          అసలు కన్న కొసరు ముద్దు అన్నట్టు స్వామి వారి కన్న లడ్డు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది - GI certificate కూడా ఉంది!పెద్ద లడ్లూ చిన్న లడ్లూ అలిపి రోజుకి రెండున్నర లక్షల లడ్లు వినియోగం అవుతున్నాయి - పురుషులందు పుణ్యపురుషుల వలె లడ్డులందు తిరపతి లడ్డు వేరయా!చిటికెడు కొకైనుకి లక్షలు తగలేసేవాళ్ళకి,గుక్కెడు పులిసిన ఫ్రెంచి మద్యానికి వేలం పాడి కోట్లు కుమ్మరించేవాళ్ళకి ఈ లడ్డుకున్న గొప్పదనం తెలియదు - కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు.వూరికే కరకరమని నమిలి మింగదం కాదు,స్వామిని తలుచుకుంటూ తినాలి - అప్పుడే వస్తుంది అసలైన కిక్కు!

          శ్రీవారి మూర్తికి గోళ్ళు పెరుగుతున్నాయనీ జుట్టు ఉందనీ అనుకుంటున్నవి పూర్తి అసత్యాలు - అలాంటివాటితో కూడుకుని ఉండటానికి అది భౌతిక అదెహం కాదు,అఖిలాందకోటి బ్రహ్మాండనాయకుడి తేజూమయరూపం!రామ్న దీక్షితులు గారు చెబుతున్న అసలైన అద్భుతం శ్రీవారి మూర్తికి పది అడుగుల దూరంలో పది అడుగుల వ్యాసం కలిగిన ప్రదేశంలో జరుగుతుందట!దేసాద్యక్షులు గానీ,పారిశ్రామికాధిపతులు గానీ,ప్రజాస్వెవారనంలో ఉన్నవారు గానీ ఆ ప్రదేశంలో నిల్బడినప్పుడు అంతకుముందు వారికి అపరిష్కృతమైన సమస్యలకి సమాధానాలు లభిస్తున్నాయట - అలా వారి వల్ల జరగాల్సిన లోకకల్యాణ యాత్రకు విఘ్నాలు తొలగుతున్నాయి!బహుసా దీనికి కారనం ఒకటి కావ్చ్చు - శ్రీవారు తిరుమలలో ఆవ్తరించాల్ని సంకల్పించిన అత్ర్వాత తొలి అడుగును ప్రస్తూతం శ్రీవారి పాదాలు అని పిలుస్తున్న చోత ఉంచారు,రెందవ అడును శిలాతొరనద్వారం దగ్గిర మోపారు అంటున్నారు,కానీ త్రిగుణ సాంఖ్యం ప్రకారం పడాల్సిన మూడవ అడుగు ఏది?బహుశా అవతరణ వేదిక మీదకై ఎక్కి ఇటువైపుకి తిరిగి దర్సనం ఇచ్చే ముందు అటువైపుకి వేసిన మూడవ అడుగును ఇక్కద మోపి ఉండవచ్చు - అందుకే ఆ పర్దేసానికి అనత్ మాహ్త్వం వచ్చింది!

          దాదాపు ప్రతి భక్తుడికీ భక్తురాలికీ తిరుమల యాత్రలో కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి యేమిటో తెలుసా!తిరుమల అనే కాదు ఏ అలయానికి వెళ్ళినా ఎదో ఒక తీరని కోరికని స్వామికి నివేదించడానికే వెళ్తాము,అవునా?కానీ మనం ఎంత పెద్ద లిస్టుతో వెళ్ళినా సరే స్వామిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కోరికల్ని చెప్పుకోవాలనే స్పృహయే ఉండదు,కదా!గోవింద నామస్మరణ వల్లనో మూర్తి సౌందర్యం వల్లనో అనుకుంటాం మనం.కానీ అది కాదు అసలు రహస్యం! స్వామి వారి చుట్టూ సిద్దులు,తాపసులు దేవతలు  నిరంతరం ఆయనను అర్చిస్తూ ఆవరించి ఉంతారు - అదృశ్యలైన వారి తపఃఫలం మనకు కూడా నిరపేక్షతని అంటిస్తుంది.

          ఇంకొక విశేషం ఏమిటంటే చూస్తున్నంత సేపు ఆ రూపం ఎంత ఆనందం కలిగించినా ఆ మూర్తి నుంచి చూపు మరల్చిన తర్వాత ఒక్క క్షణం సైతం ఆ రూపం మనస్సులో నిలవదు అదేమిటో,అజ్ఞానం కొద్దీ ఇహలోకపు యావలో పడిపోయామని మనల్ని మనం తిట్టుకుంటాం,కానీ అది కూడా ఒక లీలయే - మళ్ళీ మనస్సులో ఆ రూపం నిలవాలంటే మళ్ళీ ఆ మూర్తిని చూడాల్సిందే,మళ్లీ తిరుమల రావల్సిందే!

          రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు స్వామిని అరక్షణం చూసినా చాలుననే తపనతో - వీరిలో దశాబ్దాల ముందు నుంచి రావాలని అనుకున్న వారు,ఆరు నెలల మునదే ప్రణాళికలు వేసుకున్నవారు,అసహాయుల నుంచి దేశాద్యక్షుల వరకు సంవత్సరానికి 30 నుంచి 40 మిలియన్లు ఉంటారు!స్వామివారి వీదెశీమారకద్రవ్యం,అదే బంగారు నిల్వలు ఇప్పటికి 52 టన్నులు - తెలుపు లెక్కల ప్రకారం!స్వామివారి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లు - మరి, పన్ను కడుతున్నాడో లేదో?కట్తమంటే విజయ్ మాల్యాలాగ పారిపోడు గద!

          తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే.అయితే,బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు.

          స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు.బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది.ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం(దించడం) చేస్తారు.

          ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే!

No comments:

Post a Comment