Search This Blog

Monday 16 April 2018

SRI SARADA BHUJANGA STOTRAM


SRI SARADA BHUJANGA STOTRAM

శ్రీ ఆదిశంకర విరచిత  **** శ్రీ శారదా భుజంగ **** ప్రయాత స్తోతము'

ఓంశ్రీమాత్రేనమః




సువక్షోజ కుంభాం సుధాపూర్ణకుంభాం!!
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం!!
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

కుంభములవంటి సువక్షోజములను కలిగినది, అమృతమయమైన కలశమును ధరించినది, సదా సుప్రసాదయై, పుణ్యాత్ములకాలంబనమై, ఎల్లపుడూ చంద్రునివంటి కళకళలాడే మోమును కలిగినది, దొండపండువంటి క్రిందిపెదవిని కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం!!
కలాభిర్వినిద్రాం కలాపైస్సుభద్రాం!!
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

చూపులలో దయాసారమును, చేతిలో జ్ఞానముద్రను ధరించినది, నిర్ణిద్రములైన నిరంతరమైన క్షీణతలేని కళలను కలిగినది, పలుకులలో శుభావహయైనది, పురాతనఐన సనాతన ఐన, సమస్త మంగళాభరణములనుకలిగిన ఆదిస్త్రీ ఐనది, తుంగభద్రానదీతీరవాసిని ఐన సువాసినిని, నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



లలామాంక ఫాలాం లసద్గాన లోలాం!!
స్వభక్తైకపాలాం యశశ్రీకపోలాం!!
కరే త్వక్షమాలాం కనత్ప్రత్న లోలాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

నుదుట తిలకమును ధరించినది, గానమునందు ఆసక్తి కలిగినది, తన భక్తులను పాలించునది (వారిగోడును ఆలించునది!) ప్రశస్తమైన చెక్కిళ్ళు కలిగినది, చేతియందు అక్షమాలను(అకారాది క్షకారాంతమైన అక్షర మాలను) జపమాలను కలిగినది, కదలాడే పురాతన చెవియాభారణములను కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



సుసీమంత వేణీం ద్రుశానిర్జితైణీం!!
రమత్కీర వాణీం నమధ్వజ్ర పాణీం!!
సుధా మంధరాస్యాం ముదాచింత్యవేణీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

చక్కగా పాపటతీసిన కేశములుకలిగినది, చూపులలో ఆడుజింకను గెలువగలిగినది, చిలుక పలుకులతో ఆనందించునది, దేవేంద్రునితో నమస్కరింపబడునది, అమృతముజాలువారే వదనము కలిగినది, ఎన్నడూ ఊహింపరాని కేశపాశముల సౌందర్యము కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



సుశాంతాం సుదేహాం ద్రుగంతే కచాంతాం!!
లస త్సల్లతాంగీ మనంతా మచింత్యాం!!
స్మరే త్తాపసైః సంగ పూర్వ స్థితాం తాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

శుభ శాంతమూర్తి ఐనది, శుభలక్షణ సంపన్నమైన దేహమును కలిగినది, కనులమీదకు వాలుతున్న ముంగురులు కలిగినది, తీగవంటి నాజూకైన దేహమును కలిగినది, అనంత, అచింత్య, తాపసులసంగమును కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



కురంగే, తురంగే, మృగేంద్రే, ఖగేంద్రే,
మరాలే, మదేభే, మహోక్షేధిరూఢాం!!
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

లేడిమీద, గుర్రముమీద, సింహముమీద, గరుడునిమీద, హంసమీద, మదపుటేనుగుమీద, మహావృషభముమీద మహర్నవమినాడు అధిష్ఠించి ఉండెడిది, ఎల్లపుడూ సామవేదరూపిణి అయినదీ, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



జ్వలత్కాంతి వహ్నీం జగన్మోహనాంగీం!!
భజన్మానసాంభోజ సుభ్రాంత భృంగీం!!
నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

వెలుగుతున్న అగ్నిజ్వాలవంటి కాంతి గలది, జగన్మోహనాకారిణి ఐనది, తనను భజించు మనసు అనే పద్మమును మరిగిన తుమ్మెదవంటిది, తన స్తోత్రముల, తన సంగీత మాధుర్యముయొక్క, నృత్యముల ప్రభచే వెలుగొందు దేహమును కలిగినది, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



భవాంభోజనేత్రాజ సంపూజ్యమానాం!!
లస న్మందహాసప్రభా వక్ర్త్రచిహ్నాం!!
చల చ్చంచలా చారు తాటంక పూర్ణాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

శివుడు, విష్ణువు, బ్రహ్మల చేత నిరంతరమూ పూజింపబడునది (ఆదిశంకరులు ఇక్కడ చమత్కారంగా విష్ణువును 'అంభోజనేత్రుడు' అని సూచించాడు,ఆ పదానికి విష్ణువుమాత్రమే అర్హుడు అన్నట్లు! అంబుజ అంటే నీటియందు పుట్టిన, మహాలక్ష్మికి నాథుడు ఆయనే కనుక కూడా కామోసు!) మందహాసప్రభలను వెలువరించు వదనమును కలిగినది, చలించుచున్న, మెరుపుతీగలవంటి శోభలను వెలువరిస్తున్న చెవికమ్మలనుకలిగినది, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



ఇది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన 'శ్రీ శారదా భుజంగప్రయాత స్తోత్రము'.


No comments:

Post a Comment