Search This Blog

Monday, 16 April 2018

HOW VISHNU SAHASRANAMAM CAME?


HOW VISHNU SAHASRANAMAM CAME?

విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది



భీష్మపితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం?

అది 1940వ సంవత్సరం. శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు ఆ వ్యక్తిని అక్కడున్న వారినందిరినీ ఉద్దేశించి, "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.

ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు

ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"

స్వామివారు, "భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"

మళ్ళీ నిశబ్దం.

స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు, "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు. ఇపుడెలా కృష్ణా" అని.

"అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.

శ్రీ కృష్ణుడన్నాడు. "అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.

"అదెలా" అని అందరూ అడిగారు.

శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకతేంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.

శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రిప్లే అవుతూంటే వ్యస మహర్షి వ్రాసిపెట్టాడు.

ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వార మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

SRI SARADA BHUJANGA STOTRAM


SRI SARADA BHUJANGA STOTRAM

శ్రీ ఆదిశంకర విరచిత  **** శ్రీ శారదా భుజంగ **** ప్రయాత స్తోతము'

ఓంశ్రీమాత్రేనమః




సువక్షోజ కుంభాం సుధాపూర్ణకుంభాం!!
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబాం!!
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

కుంభములవంటి సువక్షోజములను కలిగినది, అమృతమయమైన కలశమును ధరించినది, సదా సుప్రసాదయై, పుణ్యాత్ములకాలంబనమై, ఎల్లపుడూ చంద్రునివంటి కళకళలాడే మోమును కలిగినది, దొండపండువంటి క్రిందిపెదవిని కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం!!
కలాభిర్వినిద్రాం కలాపైస్సుభద్రాం!!
పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

చూపులలో దయాసారమును, చేతిలో జ్ఞానముద్రను ధరించినది, నిర్ణిద్రములైన నిరంతరమైన క్షీణతలేని కళలను కలిగినది, పలుకులలో శుభావహయైనది, పురాతనఐన సనాతన ఐన, సమస్త మంగళాభరణములనుకలిగిన ఆదిస్త్రీ ఐనది, తుంగభద్రానదీతీరవాసిని ఐన సువాసినిని, నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



లలామాంక ఫాలాం లసద్గాన లోలాం!!
స్వభక్తైకపాలాం యశశ్రీకపోలాం!!
కరే త్వక్షమాలాం కనత్ప్రత్న లోలాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

నుదుట తిలకమును ధరించినది, గానమునందు ఆసక్తి కలిగినది, తన భక్తులను పాలించునది (వారిగోడును ఆలించునది!) ప్రశస్తమైన చెక్కిళ్ళు కలిగినది, చేతియందు అక్షమాలను(అకారాది క్షకారాంతమైన అక్షర మాలను) జపమాలను కలిగినది, కదలాడే పురాతన చెవియాభారణములను కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



సుసీమంత వేణీం ద్రుశానిర్జితైణీం!!
రమత్కీర వాణీం నమధ్వజ్ర పాణీం!!
సుధా మంధరాస్యాం ముదాచింత్యవేణీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

చక్కగా పాపటతీసిన కేశములుకలిగినది, చూపులలో ఆడుజింకను గెలువగలిగినది, చిలుక పలుకులతో ఆనందించునది, దేవేంద్రునితో నమస్కరింపబడునది, అమృతముజాలువారే వదనము కలిగినది, ఎన్నడూ ఊహింపరాని కేశపాశముల సౌందర్యము కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



సుశాంతాం సుదేహాం ద్రుగంతే కచాంతాం!!
లస త్సల్లతాంగీ మనంతా మచింత్యాం!!
స్మరే త్తాపసైః సంగ పూర్వ స్థితాం తాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

శుభ శాంతమూర్తి ఐనది, శుభలక్షణ సంపన్నమైన దేహమును కలిగినది, కనులమీదకు వాలుతున్న ముంగురులు కలిగినది, తీగవంటి నాజూకైన దేహమును కలిగినది, అనంత, అచింత్య, తాపసులసంగమును కలిగినది ఐన నా తల్లిని, శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



కురంగే, తురంగే, మృగేంద్రే, ఖగేంద్రే,
మరాలే, మదేభే, మహోక్షేధిరూఢాం!!
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం!!
భజే శారదాంబా మజస్రం మదంబాం!!

లేడిమీద, గుర్రముమీద, సింహముమీద, గరుడునిమీద, హంసమీద, మదపుటేనుగుమీద, మహావృషభముమీద మహర్నవమినాడు అధిష్ఠించి ఉండెడిది, ఎల్లపుడూ సామవేదరూపిణి అయినదీ, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



జ్వలత్కాంతి వహ్నీం జగన్మోహనాంగీం!!
భజన్మానసాంభోజ సుభ్రాంత భృంగీం!!
నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

వెలుగుతున్న అగ్నిజ్వాలవంటి కాంతి గలది, జగన్మోహనాకారిణి ఐనది, తనను భజించు మనసు అనే పద్మమును మరిగిన తుమ్మెదవంటిది, తన స్తోత్రముల, తన సంగీత మాధుర్యముయొక్క, నృత్యముల ప్రభచే వెలుగొందు దేహమును కలిగినది, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



భవాంభోజనేత్రాజ సంపూజ్యమానాం!!
లస న్మందహాసప్రభా వక్ర్త్రచిహ్నాం!!
చల చ్చంచలా చారు తాటంక పూర్ణాం!!
భజే శారదాంబా
మజస్రం మదంబాం!!

శివుడు, విష్ణువు, బ్రహ్మల చేత నిరంతరమూ పూజింపబడునది (ఆదిశంకరులు ఇక్కడ చమత్కారంగా విష్ణువును 'అంభోజనేత్రుడు' అని సూచించాడు,ఆ పదానికి విష్ణువుమాత్రమే అర్హుడు అన్నట్లు! అంబుజ అంటే నీటియందు పుట్టిన, మహాలక్ష్మికి నాథుడు ఆయనే కనుక కూడా కామోసు!) మందహాసప్రభలను వెలువరించు వదనమును కలిగినది, చలించుచున్న, మెరుపుతీగలవంటి శోభలను వెలువరిస్తున్న చెవికమ్మలనుకలిగినది, నా తల్లి ఐన శ్రీ శారదాంబను నిరంతరమూ భజించెదను!



ఇది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన 'శ్రీ శారదా భుజంగప్రయాత స్తోత్రము'.


KANYAKUMARI



KANYAKUMARI



కన్యాకుమారి క్షేత్ర  మహిమ  :





కన్యాకుమారి అగ్రము

స్వతంత్ర భారతదేశానికి దక్షిణపు కొన-అగ్రము. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తుతగ్గి, చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరకి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. ఇది దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు. రెండు మహా సముద్రాలను వేరుచేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ప్రపంచంలో మరెక్కడయినా ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నిత్యసత్యం - సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం. మూడు సముద్రాలు కలిసి ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో మిళితమై మెరిసే సంధ్యారుణకాంతులు గగనాన ప్రతిఫలించే తీరులు చూస్తేచాలదా జన్మసాఫల్యం! అందించదా జీవితాంతం చిరకాలం గుండెల్లో గూడుకట్టుకుని ఉండే ఆనందానుభూతి? ఈ మహత్తర దృశ్యాన్ని కనులారా చూడటానికి ఎన్నెన్ని దేశాలనుండి, ఎంతెంత దూరంనుంచి, వ్యయానికీ, ప్రయాసకీ ఓర్చి వస్తున్నారు ప్రజలు. ఇది ఎంతో అనాదినుండి అతి పవిత్రమైన స్థానంగా విశేషంగా ప్రశంసించబడి, ప్రస్తుతించబడి ఉన్నది.

కన్యాకుమారి ఆలయం:

సముద్రపు ఒడ్డున భారతదేశ పుణ్యక్షేత్రం మూడు సముద్రాలు ముమ్మూర్తులై ఆదిపరాశక్తి అవతార విశేషమయిన అమ్మవారి పాదపూజ చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. పదహారేండ్ల బాలిక స్వరూపంలో దుష్టులకు దుర్నీరీక్షయై, భక్తులకు ప్రసన్న సౌకుమార్యంతో మాతృదృక్కులతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ అవతారం వెనుక బాణాసుర వృత్తాంతం పురాణకథగా చెబుతారు. వీరబలగర్వోన్నతుడై చెలరేగిన దుష్టబాణాసురుని వధించుటకు మాత పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని, అది స్థానికంగా ఉన్న రాజకుమారిగా ప్రభవించి యుక్తవయస్సు రాగానే ఆమెకు వరాన్వేషణ మెదలయిందనీ, అంతలోనే ఆమె తన అవతారపు విశేష ఉనికిని తెలిసికొని శుచీంద్రంలో తపస్సులో నిమగ్నమయిన స్థానేశ్వరుని వచ్చి తనను పరిగ్రహించవలసిందిగా రాయబార మంపినదట. స్థానేశ్వరుడందులకు ఒప్పుకొన్నాడు. ముహూర్తం నిర్ణయమైంది కారణ జన్మురాలైన మాత పార్వతి వివాహమాడితే దుష్టరాక్షసుని దునుమాడటానికి ఈ అవతారంలో కుదరదు. కనుక ఈ వివాహాన్నెలాగైనా తప్పించాలి. ముహూర్తం సమయానికి పరమశివుడు యోగ సమాధిలోకి వెళ్ళేట్లుగా నారదుడు యుక్తిపన్నాడు. యుక్తి ఫలించింది ఇంతలో బాణాసురుడు కన్యయొక్క అందాన్ని గురించివిన్నాడు. ఆమెను తనకివ్వమని వత్తిడి తెచ్చాడు. కోట ద్వారంలోకొచ్చి ప్రేలాపన మొదలెట్టాడు. ఎవరూ దరిచేర సాహసించలేదు. అప్పుడు 16 సంవత్సరాల బాలికయైన రాజకుమారి బయటికివచ్చి బాణాసురుని సంహరించింది. ముహూర్తం దాటిపోయింది. పరమశివుడు యోగనిష్టలో అలాగేవుండిపోయాడు. కన్యాకుమారి కన్యగానే మిగిలిపోయింది. పరమశివుడు స్థానేశ్వరుడు ఇంకావస్తాడని ఎదురుచూస్తూనే ఉంది. ఆలయం అంత పెద్దది కాక పోయినా విగ్రహం బహుసుందరమైంది. అమ్మవారికి అనేక మణులు మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాలెన్నో ఉన్నాయి. వాటిలో మహాప్రకాశమానమైన నాగమణి ఉంది. ఉత్సవసమయాల్లో మాత్రమే అలంకరిస్తారు. మిగతా రోజుల్లో అయితే నావికులను తప్పుదోవ పట్టిస్తుందేమోనని భద్రంగా తీసి దాచిపెడతారు. అసలు ఆలయం అత్యంత పురాతనమైనది. పురాతనమైన శిధిలాల మీద మరల పునర్నిర్మాణం జరిగింది.

TIRUCHANDUR - SUBRAHMANYA SWAMY

TIRUCHANDUR - SUBRAHMANYA SWAMY





*తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి క్షేత్రం*



పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు.

కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి:

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది. ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.

అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.

ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే. శ – శమింపజేయువాడు ర – రతిపుష్టిని ఇచ్చువాడు వ – వంధ్యత్వం రూపుమాపువాడు ణ – రణమున జయాన్నిచ్చేవాడు భ – భవసాగరాన్ని దాటించేవాడు వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.

SABARIMALA - AYYAPA SWAMY



SABARIMALA - AYYAPA SWAMY

శబరిమల అయ్యప్ప స్వామి






శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలుసు .

కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు , ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాలు మనలో చాలా మందికి తెలియదు.

ఒక్కసారి దీనిని చదవండి.
మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని అందరికీ తెలియజేయండి.

ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.

శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.

దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.

శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది.
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.

శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.

కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.

1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.

శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు.
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.

అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.

ఓం స్వామియే శరణమయ్యప్ప!!

TIRUVANNAMALAI


TIRUVANNAMALAI



తిరువణ్ణామలై ( అరుణాచలం ) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం.

అరుణాచలేశ్వరుడు:

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

PARASURAMAVATARAM


PARASURAMAVATARAM



క్షత్రియుల  ప్రాబల్యం  పేరిగి  బ్రాహ్మణోత్తము ల పై  అత్యాచారాలు  హేచ్చూమీరిన  తరుణం లో  సాక్షాత్తు  శ్రీ  హరి  బ్రాహ్మణుడి  గా  అవతరించి సహస్ర బాహువులు  కల్గిన  కార్టవీర్యార్జునడిని  వధించాడు 

ఎంతటి ఉన్నతులైనప్పటికీ, అరిషడ్వర్గాలకు లోనైతే, పతనాన్ని పొందకతప్పదని నిరూపించే కథలు మన పురాణేతిహాసాల్లో చాలానే కనపడతాయి. ఒక్కోసారి ఆ పరమాత్మే స్వయంగా అవతారమెత్తి వారిని సంహరించాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. బలిచక్రవర్తి, రావణాసురుడు, కార్తవీర్యార్జునుడు వంటివారు ఈ కోవలోనికి చెందిన వారే. శివభక్తి పరాయణుడు, వేదవిద్యా పారంగతుడు అయిన రావణాసురుడు రావణ బ్రహ్మ అని పిలిపించుకుని కూడా తనలో ఉన్న పరస్త్రీ వ్యామోహమనే ఒక బలహీనత వల్ల, గర్వం వల్ల విష్ణ్వావతారమైన రాముని చేతిలో సంహరింపబడ్డాడు. అలాగే బలిచక్రవర్తి కూడా మహా పరాక్రమవంతుడైనప్పటికీ గర్వం అనే దుర్గుణం వల్ల విష్ణుమూర్తి అవతారమైన వామనుని వల్ల పాతాళలోకానికి పంపివేయబడ్డాడు.

నలుడు, సగరుడు, పురూరువుడు, పురకుత్సుడు, హరిశ్చంద్రుడుల సరసన షట్చక్రవర్తులలో ఒకరిగా చేర్చబడిన కార్తవీర్యార్జునుడు కూడా మహాపరాక్రమవంతుడు. హైహయ వంశజుడు, కృతవీర్యుని కుమారుడు అయిన కార్తవీర్యుడు పుట్టుకతో చేతులు లేకుండా జన్మించాడు. దత్తాత్రేయుని పరమభక్తితో సేవించి ఆయననుండి నాలుగు వరములు పొందాడు. మొదటి వరముగా వేయిచేతులు, రెండవ వరముగా తాను అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషులు తనను నివారించవలెననియు, మూడవ వరముగా ధర్మయుద్ధమున భూమండలమునంతటినీ జయించి ధర్మయుక్తముగా పాలించవలెననియు, నాలుగవ వరముగా అందరికన్నా మిన్న అయిన వీరునితో యుద్ధము చేయుచుండగా మరణించవలెననియు కోరుకొనెను. దత్తాత్రేయుడు ఆ వరములను అనుగ్రహించెను. అది మొదలు తనకున్న బలపరాక్రమములతో, వేయిచేతులతో ఈ భూమండలాన్నంతటినీ జయించి, మాహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించుచుండెను. పదివేల యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకు భూరిదక్షిణలిచ్చెను. నలభైవేల సంవత్సరాలు ధర్మయుక్తముగా పరిపాలించెను. మానవులే కాక యక్ష, కిన్నెర,కింపురుష, గంధర్వాదులు కూడా కార్తవీర్యుని పరిపాలనను మెచ్చుకుంటూండేవారు. అది గమనించిన కార్త్యవీర్యార్జునిలో గర్వము ప్రవేశించింది. తనను మించినవాడు లేడనే అహంభావముతో ప్రవర్తిస్తూ ఉండేవాడు.

ఒకసారి అగ్నిదేవుడు కార్తవీర్యార్జునుని వద్దకు వచ్చి, తన ఆకలి తీర్చుకోవడానికి అతని సామ్రాజ్యములో సంచరించడానికి అనుమతి అడిగెను. అగ్నిదేవుడు అంతటివాడు తనని అడిగాడు కదా అనే అతిశయముతో అనుమతినిచ్చి, ఎవరూ అగ్నిని నిరోధించకుండా చూస్తున్నాడు. అగ్నిదేవుడు, అతని రాజ్యంలోని చెట్లు, చేమలు, అడవులు అన్నీ ఆహుతి చేసుకుంటూ ముందుకుసాగుతూ వశిష్టముని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్టముని ఆగ్రహంతో అగ్నికి అనుమతినిచ్చిన కార్తవీర్యుని “మునికుమారుడి చేతిలో హతమగుదువు గాక” అని శాపమిచ్చాడు. గర్వంతో ఉన్న కార్తవీర్యుడు ఆ మాటలను లక్ష్యపెట్టలేదు.

ఒకసారి కార్తవీర్యుడు తన భార్యలతో కూడి నర్మదానదిలో క్రీడించుచూ తన సహస్రబాహువులను అడ్డుపెట్టి నర్మదాప్రవాహాన్ని నిలువరించి, దారి మళ్ళించెను. ఆ నదీప్రవాహం అక్కడికి దగ్గరలోనే విడిది చేసివున్న లంకేశుడైన రావణుని శిబిరాలను ముంచివేసింది. రావణుడు కోపోద్రిక్తుడై, కార్తవీర్యునిపైకి యుద్ధానికి రాగా, కార్తవీర్యుడు రావణుని పట్టి బంధించి, అతనిని తన రాజ్యానికి కొనిపోయెను. పులస్త్యమహర్షి వచ్చి విడువమనగా అతని మాట మన్నించి రావణుని విడిచిపెట్టెను.

ఒకసారి కార్తవీర్యుడు వేటకి వెళ్లి, అలిసిపోయి, జమదగ్ని ఆశ్రమ సమీపంలో విడిదిచేసెను. జమదగ్ని రాజునూ, అతని పరివారాన్ని ఆదరించి, అందరికీ అతిధి సత్కారాలు చేసెను. ఇది అంతా జమదగ్నిమహర్షి వద్ద ఉన్న కామధేనువు వల్ల సాధ్యమయ్యిందని తెలుసుకున్న కార్తవీర్యుడు ఆ కామధేనువుని కోరుకొనెను. జమదగ్ని అది తన జీవనహేతువని, దానిని విడిచి తను యజ్ఞయాగాదిక్రతువులు నిర్వహించలేనని ఎంత చెప్పినా వినకుండా బలవంతంగా కామదేనువును అక్కడినుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యాత్రలకని వెళ్ళిన జమదగ్ని మహర్షి పుత్రుడూ, విష్ణ్వంశ అయిన పరశురాముడు అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుని, కార్తవీర్యునిపై యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్యుని సైన్యాన్నంతటినీ నాశనం చేసి, తుదకు కార్తవీర్యుని కూడా సంహరించాడు. సాక్షాత్ విష్ణువు చేతిలోనే హతమైన కార్తవీర్యుడు ఉత్తమగతులు పొందాడు. తన తండ్రిని చంపిన కార్తవీర్యుని పుత్రులనే కాక, అధికారగర్వంతో మిడిసిపడుతున్న క్షత్రియులందరినీ ఇరవై ఒక్క మార్లు భూప్రదక్షిణం చేసి సంహరించాడు పరశురాముడు.

షట్చక్రవర్తులలో ఒకడైనప్పటికీ, దత్తాత్రేయ వరప్రసాది ఐనప్పటికీ, రావణుడినే బంధించగల పరాక్రమవంతుడైనప్పటికీ, నాగరాజు అయిన కర్కోటకుడిని పట్టి తన రాజ్యమందు నిలుపుకోగలిగిన ధీశాలి అయినప్పటికీ, సముద్రమే సరిహద్దులుగా కలిగిన సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి ఐనప్పటికీ, సహస్ర బాహువులతో దానం చేయగల సమర్థుడైనప్పటికీ, కేవలం
గర్వం, అహంకారం అనే లక్షణాల వల్ల, వినయం, వివేకం నశించి, గోబ్రాహ్మణ అవమానాలు చేయడమే అతని పతనానికి హేతువయ్యింది. తనకున్న బలపరాక్రమాలను, శక్తియుక్తులను, విజ్ఞానాన్ని, వినయశీలసంపన్నతతో ఆ పరతత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించలేకపోవడమే అతనికి సమస్య అయింది. కార్తవీర్యుని కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి అదే. మనకున్న శక్తిసామర్థ్యాలను పరుల హితం కోసం ఉపయోగిస్తూ, గురువులు, బ్రాహ్మణులు, గోవులు, దైవం పట్ల భక్తి, గౌరవం కలిగి వారి యందు వినయంతో నడుచుకుంటూ ఆ పరమాత్మతత్త్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడమే మన లక్ష్యం కావాలి.


SIMHADRI APPANA CHANDANOSTAVAM

సింహాద్రి అప్పన్న చందనోత్సవం




*చందన చర్చిత...*

🌷 *చందనం పైపూత కాదు... . చందనం పరిమళం కాదు... ఓ అమూల్య సంప్రదాయం... అదో ఆధ్యాత్మిక సుగంధం... సృష్టిలో ఎన్ని వృక్షాలున్నా  ఈ చెట్టు అణువణువూ ఎందుకు పూజనీయమైంది?*

చందనం అమూల్యమైన దేవతావృక్షం. మరే ఇతర వృక్షానికి దక్కని అరుదైన స్థానం దీనికి దక్కింది. షోడశ ఉపచారాల్లో తొమ్మిదో ఉపచారం గంధ సమర్పణ. కేవలం పూజల్లో ఉపయోగించటానికి మాత్రమే కాదు... భారతీయ సంస్కృతిలో చందనానికో ఓ ప్రత్యేకత ఉంది. ఇంటికి అతిథులు వస్తే, వారికి చందనం ఇవ్వకుండా పంపించేవారు కాదు ఒకప్పుడు. ఇప్పటికీ వివాహాది వేడుకల్లో వచ్చే అతిథులకు తొలిగా చందనాన్ని అలంకరించి స్వాగతం పలుకుతారు. స్త్రీలు చేసుకునే నోములు, వ్రతాల్లో సువాసినులకు చందనం అలంకరించటం తప్పనిసరి. సాధారణంగా నోములు నోచుకునేటప్పుడు సువాసినులకు గంధాన్ని కంఠభాగంలో అలంకరిస్తారు. యోగశాస్త్రం ప్రకారం కంఠ ప్రాంతంలో విశుద్ధి చక్రం ఉంటుంది. రెండువేళ్లతో గంధాన్ని తీసుకుని, చక్కగా కంఠాన్ని తాకుతూ చందనం రాయటం వల్ల విశుద్ధి ఉత్తేజితమవుతుంది. ఆరోగ్యం, ఆహ్లాదం, ఆనందం, ఆధ్యాత్మికత కలగలసిన సంప్రదాయం ఇది. వివాహ శుభలేఖల్లో కూడా ‘మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి...’ అని రాస్తారు. చందనంతో చేసే సత్కారానికి గొప్పస్థానం ఉంది. కనుకనే దేవతలు సైతం తమకు ప్రీతిపాత్రమైన వస్తువుగా స్వీకరించారు.

సుగుణ నందనం:

* కంసుడి ఆహ్వానం అందుకున్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి ద్వారకకు బయల్దేరతాడు. రాచనగరిలోకి ప్రవేశించి, అక్కడి విశేషాలన్నీ పరిశీలిస్తూ, రాజవీధుల్లో నడుచుకుంటూ వెళుతుంటారు ఇద్దరు. ఇంతలో కురూపిగా ఉన్న ఓ ముదుసలి కుబ్జ... ‘కన్నయ్యా!’ అంటూ వారి దగ్గరకు వస్తుంది. ఎంతో ప్రేమగా, ‘ఆగవయ్యా! నీ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాను. ఇదిగో! నీ కోసం చందనం తెచ్చానయ్యా. ఏదీ ఇటు తిరుగు...’ అంటూ నీలమేఘశ్యాముడికి అద్దుతుంది. శ్రీకృష్ణుడు కూడా అంతే ప్రేమగా స్వీకరిస్తాడు. నువ్వు చేసిన చందన సేవ నాకు చాలా ఆనందాన్నిచ్చిందంటూ ఆమె చుబుకాన్ని పైకెత్తుతాడు. ఆశ్చర్యం...! అష్టవంకరులు తిరిగి ఉండే కుబ్జ అపురూప సౌందర్యరాశిగా మారిపోతుంది. కురూపిని కుందనపు బొమ్మగా మార్చింది చందనమే కదా.

* పరమేశ్వరుడి అభిషేకద్రవ్యాల్లో చందనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చందనంతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయంటారు. లలితాదేవికి ‘చందనద్రవదిగ్ధాంగీ’ అనే పేరు ఉంది. ఆమె శరీరమంతా చందనంతో నిండిపోయి ఉంటుందట.

* నారద, తుంబురులు దేవగాయకులు. ఇద్దరూ సంగీత విద్యలో ఆరితేరినవారు. ఓ సందర్భంలో తుంబురుడి గానాన్ని, ఆయన వీణావాదనాన్ని మెచ్చుకున్న విష్ణుమూర్తి తాను ధరించిన హారాన్ని, బంగారువస్త్రాన్ని, ఇంకా అనేక బహుమతులు ఇచ్చి అతడిని సత్కరిస్తాడు. ఇదంతా చూసిన నారదుడికి ఈర్ష్య కలిగింది. కారణం... తుంబురుడు పొందిన రత్నాభరణాలు చూసి కాదట. తన కన్నా బాగా పాడినందుకు, విష్ణువు మెచ్చుకున్నందుకు కూడా కాదట. విష్ణుమూర్తి తాను ధరించే చందనాన్ని స్వయంగా తుంబురుడికి పూయడం నారదుడికి అసూయ కలిగించింది. చందనం పూయటం అవతలి వ్యక్తికి మనం ఇస్తున్న గౌరవానికి ప్రతీక. ఇదే నారదుడికి మాత్సర్యం కలిగించింది.

అయం భగవాన్‌! శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధరమండలాఖండలస్య... వేదాల్ని ఔపోసన పట్టిన వైష్ణవస్వాములు సుస్వరంగా ఏడుకొండలవాడి వైభవాన్ని కీర్తిస్తున్నారు. ఇంతలో అర్చకస్వాములు శ్రీవారి మూలవిరాట్‌కు నమస్కరించి, ముందురోజు చేసిన అలంకారాలన్నిటినీ (నిర్మాల్యం) ఒక్కొక్కటిగా తీయటం ప్రారంభించారు. అదేక్రమంలో స్వామి వక్షస్థలంపై ఉన్న లక్ష్మీదేవికి నిన్నటిరోజున అలంకరించిన చందనాన్ని ఒకే ముద్దగా బయటకు తీశారు. పరమాద్భుతం... మాటలకందని మధురానుభూతి... ఇంతకీ ఏం జరిగింది? సాక్షాత్తు లక్ష్మీదేవి ఆకారాన్ని ఆ చందనం సంతరించుకుంది. ఆహా! చందనం చేసుకున్న పుణ్యభాగ్యాన్ని లెక్కించగలమా? లోకనాయకుడి వక్షస్థలాన్ని చేరుకుని, ఏకంగా దేవేరి రూపును తనదిగా చేసుకుంది. గోవిందా! చందనంగా మారి, నీ మేనికి నిత్యం అంటుకుని ఉండే భాగ్యాన్ని కలిగించు స్వామీ!.. భక్తుల హృదయాలు మౌనంగా స్వామిని వేడుకుంటున్నాయి.

* చందనాన్ని అరగదీసి, గంధాన్ని తీస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, సందర్భాన్ని బట్టి, కాలాన్నిబట్టి చందనగంధాన్ని తీసేవిధానంలో కొన్ని అనుఘటకాలు చేర్చుతారు. మామూలు నీరు కాకుండా పన్నీరు పోసి, చందన గంధాన్ని తీస్తే మరింత సువాసన వెదజల్లుతుంది. వేసవికాలంలో పచ్చకర్పూరం, చలికాలంలో కస్తూరి చేర్చి, గంధాన్ని తీస్తారు. పునుగు, జువ్వాది, వట్టివేళ్లు, బావంచాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు కూడా చేర్చి, చందనగంధం తీస్తారు.

* ఆహ్లాదంతో పాటు ఎన్నో ఆరోగ్యకరమైన విలువలు చందనంలో ఉన్నాయి. చల్లదనాన్ని కలిగించటంతో పాటు శరీరంలోపల ఉండే తాపాన్ని కూడా చందనం తొలగిస్తుంది. ఈకారణంగానే ఆయుర్వేదవైద్యంలో చందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. గంధాన్ని కొద్దిమోతాదులో కొబ్బరినీరులో కలుపుకుని తాగితే వెర్రిదాహం తగ్గుతుంది. చందనతైలం శరీరానికి చలువ చేస్తుంది.జ్వరం హెచ్చుస్థాయిలో ఉంటే చందనాన్ని శరీరానికి పూత పూస్తే ఉష్ణోగ్రత నెమ్మదిస్తుంది. కణతల దగ్గర చందనాన్ని రాసుకుంటే, శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అయ్యప్పదీక్షాపరులు కణతల దగ్గర గంధం రాసుకోవటంలో అంతరార్థం ఇదే. మంత్రసాధన చేసే వాళ్లు చందనాన్ని ఛాతి, నుదురు, తలమీద రాసుకోవటం కూడా ఇందుకే.

* బాగా పెరిగిన చందన వృక్షాన్ని చూడగానే మనిషి గొడ్డలి తీసుకుని బయల్దేరతాడు. ఆ వృక్షాన్ని చిన్నచిన్న భాగాలుగా నరికి, వ్యాపారం చేసుకుంటాడు. అప్పటిదాకా పచ్చపచ్చని కొమ్మలతో వెలిగిన వృక్షం ముక్కలుగా మారిపోతుంది. ఇక్కడే చందనం ఇచ్చే సందేశం దాగుంది. తనను నరికిన గొడ్డలికి కూడా చందనం సుగంధాన్ని అద్దుతుంది. తనను నరుకుతూ, ఆయాసంతో తన కిందే సేదతీరటానికి కూర్చున్న మనిషికి తన సుగంధ పరిమళాలను అందించి, చల్లదనాన్నిస్తుంది. తనను మరింత చిన్నచిన్న ముక్కలుగా చేసి, రాతిమీద అరగదీసి, చూర్ణం చేసినా, అలా చేసిన కొద్దీ మరింత సువాసన వెదజల్లుతుంది. చివరకు తనను అరగదీసిన చేతికి, రాతికీ కూడా మరింత సువాసన అందిస్తుంది. కేవలం సువాసనాభరితంగా ఉండటం మాత్రమే కాదు... ఆ సువాసనలను అనుసరించి ఉండే బాధల్ని కూడా భరించాలని... ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలకు గురికావలసి వచ్చినా ఉత్తమ లక్షణాలను కోల్పోకూడదనే సందేశాన్నిస్తుంది. అలాగే కష్టాల కొలిమిలో ఎంతగా అరిగినా, మరిగినా, కరిగినా.... మనిషి తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. కష్టాలను ఆనందంగా స్వీకరించి, కొలిమిలో కాలిన బంగారంలా మరింతగా మెరిసిపోవాలి.

ఏ దైవానికీ లేని ఎన్నో విశిష్టతలు సింహగిరి నరహరికే సొంతం. ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ, సంవత్సరమంతా నిత్య రూపంలో దర్శనమిస్తూ... ఒక్కరోజు మాత్రమే నిజ రూపంతో భక్తులను అనుగ్రహించే ఏకైక పుణ్యక్షేత్రం సింహాచలం. 364రోజులు చందనంలో ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే స్వామి... వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు మాత్రమే నిజరూపంతో సేవలందుకుంటాడు. వేడుకగా జరిగే ఈ ప్రక్రియలో ముఖ్య ఘట్టాలివీ...

గంధం కోసం మేలురకం చందనం చెక్కలను కేరళ నుంచి తీసుకువస్తున్నారు. అరగదీసేందుకు వీలుగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దీనికోసం ఆలయంలోని బేడామండపంలో అమర్చిన ప్రత్యేక రాళ్లపై ఈ ప్రక్రియ జరుగుతుంది.


SANI TRAYODASI



SANI TRAYODASI




శనిత్రయోదశి 

రేపటి దినము చాలా విశెశమైనదిగ చెప్పుకోవచ్చు. ఎందుకంటే   రేపు శనిత్రయోదశి మరియు మాస శివరాత్రి రెండూ కలిసి రావడం అనేది చాలా   అరుదైన రోజు.
సాధారణంగా   శనిత్రయోదశే ఏ  మూడు నాలుగు మాసాలకు ఒకసారి రావడం జరుగుతుంది. అంటే త్రయోదశి శనివారంతో   కలిసిరావడం. లాంటిది మాస శివరాత్రితో కూడా కలిసిరావడం   చాలా విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ రెండింటికి ఏమిటి సంబంధం ? అనిపిస్తుంది   కదూ..?
మనము శని దేవుడిని కేవలం శని అని పిలవము. *శనీశ్వరుడు* అంటాము. అంటే ఆయన ఈశ్వర స్వరూపమైన గ్రహంగా భావిస్తాము. అలంటి ఈశ్వర స్వరూపమైన శని ని ఈ పవిత్ర దినమున పూజించిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. ఉదయం శనీశ్వరుడిని ప్రదోశంలో ఈశ్వరుడిని ఒకేదినములో పూజించిన వారికి కష్టాలు తప్పినట్లే !
ఈ విళంబి నామ సంవత్సరంలో ఈ కింది రాశులవారికి శని   బాధలు ఉన్నాయి కావున, ఆయా రాశులవారు కింద   సూచించిన మంత్ర పారాయణం అభిషేకం చేసుకోవడం చాలా మంచిది.
వృషభ రాశి ( అష్టమ శని ), మిధున రాశి ( సప్తమ శని ), కన్యా రాశి ( అర్దాష్టమ శని ), వృశ్చిక రాశి ( ఏలినాటి శని ), ధనుస్సు     రాశి ( జన్మ శని - ఏలినాటి శని ), మకర రాశి ( ఏలినాటి శని )
పై రాశుల వారు రేపు అవకాశం ఉంటే ఉదయం శనికి తైలాభిషేకం, ప్రదోశంలో శివుడికి రుద్రాభిషేకం చేయించండి.
వీలుంటే హోమం నల్ల నువ్వులు కిలో మరియు నలుపు వస్త్రము   దానం చేయడం మంచిది.
*రేపు మీరు  చదువుకోవలసిన స్తోత్రం*
|కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||


ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం !!

*శని జపం చేసుకునే విధానం*
( *ఇది వేదం అర్హులైన వారికి మాత్రమే*)

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర

గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః

కరన్యాసం

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః అంగన్యాసము:

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం

ఓం శమగ్ని -- శ్రిదః !!

వ్యాస ప్రోక్త సోత్రం ( *అందరూ చదువుకోవచ్చ్చు* )


నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం |


*శని కవచ స్తోత్రము*

 శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!

నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!

హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!

ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!

పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!

*ఫలశ్రుతి*

య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!

శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!

నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!

షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!

శన్యష్టోత్తర శతమామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః ఓం సురవంద్యాయ నమః ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః ఓం సుందరాయ నమః ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః ఓం ఘనాభరణధారిణే నమః ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః ఓం మందాయ నమః ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః ఓం ఛాయాపుత్త్రాయ నమః ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః ఓం చరస్థిరస్వభావాయ నమః ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః ఓం నిత్యాయ నమః ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః ఓం వీతరోగభయాయ నమః ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః ఓం గృద్రహహాయ నమః ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః ఓం కురూపిణే నమః ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః ఓం గోచరాయ నమః ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః ఓం వశినే నమః ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః ఓం వంద్యాయ నమః ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః ఓం వరదాయ నమః

ఓం అభయహస్తాయ నమః ఓం వామనాయ నమః ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః ఓం అమితభాషిణే నమః ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః ఓం స్తుత్యాయ నమః ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః ఓం భానవే నమః ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః ఓం పావనాయ నమః ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః ఓం ధనుష్మతే నమః ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః ఓం అశేషజనవంద్యాయ నమః ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః ఓం పశూనాంపతయే నమః ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః ఓం ఘననీలాంబరాయ నమః ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః ఓం గుణాత్మనే నమః ఓం నిరామయాయ నమః ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః ఓం ధీరాయ నమః ఓం దివ్యదేహాయ నమః ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః ఓం ఆర్యజనగణణ్యాయ నమః ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః ఓం కామక్రోధకరాయ నమః ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః


*శని దశనామ స్తోత్రము *

కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః

*దశరథ శని స్తోత్రము*

కోనంతకో రౌద్ర యమాతః బబ్రుః కృష్ణః శనిః పింగళ మందః శౌరీః నిత్య స్మ్రుత్యో హరతే చ పీడః తస్మై నమః శ్రీ రవినందనయా॰

సురా అసురా కింపురుష రాజేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰

నర నరేంద్ర పశవో మృగేంద్ర వన్యాశ్చ యే కీట పతంగ బ్రింగాః పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰

దేశాచ దుర్గాని వనాని యత్ర శేనానివేశ పుర పట్టణాని పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰

తిలైర్యవైర్మశా గుదాన్నదానై అయోహీన నీలాంబర దానతోవా ప్రీనతి మన్త్రైర్నివాశరేచ తస్మై నమః శ్రీ రవినందనయా॰

ప్రయాగ కూలే యమునా తటేచ సరస్వతీ పుణ్యజలే గుహాయం యో యోగినం ధ్యానగతోపి శూక్ష్మాశ్ తస్మై నమః శ్రీ రవినందనయా॰

అన్య ప్రదేశాత్ స్వగృహం ప్రవిష్తాశ్ తదీయవరేశా నర సుఖేశాత్ గృహద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనయా॰

స్రష్ట స్వయంభూర్ భువన త్రయస్య త్రత హరీశో హరతే పినాకీ ఏకాస్ త్రిధా రిగ్ యజుః సామ వేదాః తస్మై నమః శ్రీ రవినందనయా॰

కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః

ఏతాని దశ నామాని నిత్యం ప్రాధయ పటే శనైశ్చర కృత పీడా న కదాచిద్ భవిష్యతి

*దశరథ ప్రోక్త శని స్తోత్రము*

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయచ నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక నమః పౌరుష గాత్రాయ స్థూల రోమాయతే నమః నమో నిత్యం క్షుదార్తాయ నిత్య తృప్తాయతే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమో స్తుతే నమస్తే ఘోర రూపాయ దుర్నిరీక్ష్యాయతే నమః నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వతే అభయ దాయినే అధో దృష్టే నమస్తే-స్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయచ జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజ సూనవే తుష్టోదదాసి రాజ్యం త్యం క్రుద్ధో హరపి తత్‌క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే బ్రహ్మాశక్రో యమశ్చైవ మునయస్సప్తతారకాః రాజ్యభ్రష్టాః పతం తీహ తవ దృష్ట్యావలోకితాః త్వయావలోకితాస్తే-పి నాశయాంతి సమూలతః ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వ మర్ధితః

Thursday, 12 April 2018

KAMARUPINI AMMAVARU - GOWHATHI





KAMARUPINI AMMAVARU - GOWHATHI




కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి.

పురాణ గాథ
సతీదేవి తండ్రి దక్షప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
స్థల పురాణం
పూర్వం కూచ్‌ బెహర్‌ రాజా విశ్వసింహ్‌ ఒక యుద్ధంలో అయిన వాళ్లందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. రాజు వెంటనే తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు. తన రాజ్యంలో కరవు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు.
ఆలయ పురాణం
కూచ్‌ బెహర్‌ రాజవంశానికి చెందిన చిలరాయ్‌ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహార్‌ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్‌రాయ్‌ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ప్రవేశాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు. ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.
ఉత్సవాలు
ఏటా వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపురంగులో ఉంటుంది.నవరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతుబలులు నిషేధం.
చేరుకునే మార్గాలు
దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కామాఖ్యదేవి ఆలయం ఉంది. గౌహతి రైల్వేస్టేషన్‌ నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. గౌహతిలో ఎక్కడినుంచైనా ట్యాక్సీ, ఆటోరిక్షా ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అసోం పర్యాటక విభాగం ఆలయానికి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది.

TIRUPATI - THEERTHAMS



TIRUPATI - THEERTHAMS



తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు.. మూడుమునకలేస్తే దీర్ఘాయుష్షు!

తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి.

శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.

కుబేర తీర్థం.. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి.

గాలవ తీర్థం.. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

మార్కండేయ తీర్థం... శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది.

అగ్ని తీర్థం - యమతీర్థం... వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది.

వసిష్ట తీర్థం... వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి.

వరుణతీర్థం - వాయుతీర్థం.. స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి.

సరస్వతి తీర్థం... కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది.

ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది.

స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు.

ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే... అయితే మీరు కూడా స్వామివారి పుష్కరిణిలో పుణ్య స్నానం చేస్తారా!

SRI VENKATACHALA VAIBHAVAM



SRI VENKATACHALA VAIBHAVAM



ప్రపంచ ప్రసిద్ధి గల హిందూ ఆలయాలు - తిరుమల

          చారిత్రక పరంగా చూస్తే తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారమైన ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు.ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారికి మామగారైన ఆకాశరాజుకు సోదరుడు.

          కలియుగంలో భక్తులను తరింపజేయటానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి తిరుమలను కలియుగ వైకుంఠంగా నిలబెట్టాడు.ద్వాపరయుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వారించి నిలబెట్టినాడు.అప్పుడు వారిరువురి మధ్యన పెద్ద యుద్ధం జరుగుతుంది.శ్రీమహావిష్ణువు వారి దగ్గిరకి వచ్చినప్పుడు వారిరువురు ఎవరి గొప్పతనం వారు చెప్పుకుంటూ ఉంటే వారికి గర్వభంగం కలిగీంచాలని ఒక పరీక్ష పెడతాడు.మేరుపర్వతం ఉత్తరభాగంలో ఉన్న ఆనందశిఖరాన్ని గట్టిగా చుట్టుకోమని ఆదిశేషునికి చెప్పి వాయుదేవునితో ఆ పర్వతాన్ని అక్కడ నుంచి కదల్చగలవేమో ప్రయత్నించమని చెబుతాడు.

         ఈ పరీక్షలో తన బలాన్ని ప్రదర్శిస్తున్న వాయుదేవుని ధాటికి సమస్త లోకాలూ తల్లడిల్లుతుంటే బ్రహ్మ అభ్యర్ధన మేరకు ఆదిశేషుడు తన పట్టును కొంచెం సడలిస్తాడు.అంతట వాయుదేవుని ప్రభావం వల్ల ఆనంద శిఖరం కదిలిపోయి సర్వముఖి నది ఒడ్డున పడుతుంది.ఇది తెలిసి ఆదిశేషుడు బాధ పడుతుంటే బ్రహ్మ ఆ వేంకటాద్రిలో నిన్ను విలీనం చేస్తాను, అక్కడ శ్రీమహావిష్ణువు వెలుస్తాడు అని చెప్పి సముదాయించాడు. ఆదిశేషుడు విలీనం అయిన వేంకటాద్రి మీద విష్ణువు  పడగ అయిన శేషాద్రి పైన శ్రీనివాసుడుగా, మధ్యభాగమైన అహోబిలంలో శ్రీ నారసింహ స్వామిగా వెలిస్తే తోకభాగమైన శ్రీశైలంలో శివుడు శ్రీమల్లికార్జునుడుగా వెలిశారు అని పురాణాలు చెబుతున్నాయి.

    పద్మావతీ దేవి తిరుచానూరులో వెలిసి బ్రహ్మేంద్రాది దేవతలు సైతం ఎవరి దర్శనానికి వేత్రహస్తుల దెబ్బల్ని కూడా తట్టుకుంటూ పడిగాపులు పడుతూ ఉంటారో ఆ కందర్పదర్పహరసుందరదివ్యమూర్తిని తలచినదే తడవుగా తన వద్దకే రప్పించుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ భక్తుల్ని కటాక్షిస్తున్నది.అప్పుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఒక్క పెళ్ళినీ కూడా చూడలేని కొరతని ఇప్పుడు వకుళమాతగా జన్మించి తీర్చుకున్న యశోదమాతను తులసిమాలగా కంఠసీమలో అలంకరించుకున్నాడు శ్రీచక్ర శుభనిలయుడైన శృంగార శ్రీనివాసుడు!

          రామాయణ,భారత,భాగవతాది కధలలోని తన సంపూర్ణకృపకు నోచుకోని భక్తశిఖామణులను చరితార్ధులను చేస్తూ తన సాన్నిధ్యాన్ని మాత్రమే కోరుకున్నవారికి బ్రహ్మేంద్రాదులకు కూడా సాధ్యపడని తన నిజతనుస్పర్శను కూడా ప్రసాదించిన విశేషం ఈ శ్రీనివాసుని కధలో అంతర్లీనమై ఉండి భక్తవరదుని శిష్టజనవాత్సల్యాన్ని నిరూపిస్తున్నది!

2. ఆలయ విశిష్టత (importance of the deity)

          ఇక్కడి స్వామికి ఆపద మొక్కుల వాడు అని పేరు.ఏదయినా కోరిక నెరవేరాలంటే స్వామివారికి సమర్పించడం కోసం ముడుపు కట్టుకుని ఆ కోరిక తీరగానె స్వామిని దర్శనం చేసుకుని ఆ ముడుపు కట్టిన దాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీ.

          శ్రీవారి దివ్యమంగలవిగ్రహం ఎత్తు 9.2 అడుగులు.శిలాతోరణద్వారం ఎత్తూ ఈ ఎత్తూ సమానం - అంటే ఈ మూర్తి అలా నడుచుకుంటూ శిలాతోరణాన్ని దాటితే వంగనక్కరలేదు,తల మీద ఖాళీ ఉండదు.విగ్రహం మెద ఉలి చెక్కడపు ఆనవాళ్లు కనపడవు - ఒక మనిషి తనకు తానే శిలారూపం దాల్చినంత జీవకళ కనపడుతుంది ఆ మూర్తిలో!అసలు శిల్పులు అర్చామూర్తులని చెక్కదానికి సంబంధించిన ఆగమశాస్త్రనియమాలు ఈ మూర్తికి వర్తించవు.ఈ మూర్తి స్వయంభువు అని చెప్పడానికి ఈ సాక్ష్యాలు చాలు.ఎప్పుడు ఎవరు కొలిచినా శ్రీవారి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది.ఎన్ని రకాల నిత్యాభిషేకాలు జరిగినప్పటికీ వెంటనే ఆరిపోతాయి,ఆవన్నీ ఆరిపోయిన వెంటనే మూర్తి 110 డిగ్రీలకి చేరుకుంటుంది!

          మనం క్యూలో వెళ్తున్నప్పుడు విగ్రహం ద్వారానికి ఎదురుగా అంటే గుడి లోపల మధ్యకి ఉన్నట్టు కనబడుతుంది,కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడిలో కుడివైపు మూలన  ఉంటుంది.
          స్వామి వెనక వైపు నుంచి ఎప్పుడూ సముద్రపు అలల హోరు వినబడుతూ ఉంటుంది.స్వామివారి వీపుని ఎన్నిసార్లు తుడిచినా సరే మళ్ళీ కొద్ది సేపట్లోనే చెమటతో తడిసినట్టు అయిపోతుంది.

          స్వామివారికి ప్రతి రోజూ పూసే పచ్చ కర్పూరం చాలా ఘాటైనది,ఒక మామూలు రాతికి రోజూ దాన్ని పూస్తే కొద్ది రోజులకే పగుళ్ళు రావటం ఖాయం - మరి,ఇన్ని సంవత్సరాల నుంచి ధృవబేరుకి మాత్రం ఏమీ కావడం లేదు,ఎందుకని?

          రమణ దీక్షితులు గారు చెప్పిన దాని ప్రకారం స్వామివారి ముఖం ఉదయం బాలకుని పసితనాన్ని చూపిస్తుంది,మధ్యాన్నం నడివయస్కుని గాంభీర్యాన్ని చూపిస్తుంది,సాయంకాలం శతవృద్ధుని వైరాగ్యాన్ని చూపిస్తుంది.ఆయా వేళల్లో దర్శించిన భక్తులు కూడా  ఈ భేదాన్ని తెలుసుకోవచ్చు!ఊదయవేళ దర్శించినవారికి విద్యలో వృద్ధీ చిరాయువూ, మధాహ్నవేళ దర్శించినవారికి ధృఢదేహమూ ఐశ్వర్యప్రాప్తీ, సాయంవేళ దర్శించినవారికి జ్ఞానవృద్ధీ మోక్షమూ ప్రాప్తించడం అనుభవైకవేద్యమే!

          అసలు కన్న కొసరు ముద్దు అన్నట్టు స్వామి వారి కన్న లడ్డు ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది - GI certificate కూడా ఉంది!పెద్ద లడ్లూ చిన్న లడ్లూ అలిపి రోజుకి రెండున్నర లక్షల లడ్లు వినియోగం అవుతున్నాయి - పురుషులందు పుణ్యపురుషుల వలె లడ్డులందు తిరపతి లడ్డు వేరయా!చిటికెడు కొకైనుకి లక్షలు తగలేసేవాళ్ళకి,గుక్కెడు పులిసిన ఫ్రెంచి మద్యానికి వేలం పాడి కోట్లు కుమ్మరించేవాళ్ళకి ఈ లడ్డుకున్న గొప్పదనం తెలియదు - కొయ్యబొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా అన్నట్టు.వూరికే కరకరమని నమిలి మింగదం కాదు,స్వామిని తలుచుకుంటూ తినాలి - అప్పుడే వస్తుంది అసలైన కిక్కు!

          శ్రీవారి మూర్తికి గోళ్ళు పెరుగుతున్నాయనీ జుట్టు ఉందనీ అనుకుంటున్నవి పూర్తి అసత్యాలు - అలాంటివాటితో కూడుకుని ఉండటానికి అది భౌతిక అదెహం కాదు,అఖిలాందకోటి బ్రహ్మాండనాయకుడి తేజూమయరూపం!రామ్న దీక్షితులు గారు చెబుతున్న అసలైన అద్భుతం శ్రీవారి మూర్తికి పది అడుగుల దూరంలో పది అడుగుల వ్యాసం కలిగిన ప్రదేశంలో జరుగుతుందట!దేసాద్యక్షులు గానీ,పారిశ్రామికాధిపతులు గానీ,ప్రజాస్వెవారనంలో ఉన్నవారు గానీ ఆ ప్రదేశంలో నిల్బడినప్పుడు అంతకుముందు వారికి అపరిష్కృతమైన సమస్యలకి సమాధానాలు లభిస్తున్నాయట - అలా వారి వల్ల జరగాల్సిన లోకకల్యాణ యాత్రకు విఘ్నాలు తొలగుతున్నాయి!బహుసా దీనికి కారనం ఒకటి కావ్చ్చు - శ్రీవారు తిరుమలలో ఆవ్తరించాల్ని సంకల్పించిన అత్ర్వాత తొలి అడుగును ప్రస్తూతం శ్రీవారి పాదాలు అని పిలుస్తున్న చోత ఉంచారు,రెందవ అడును శిలాతొరనద్వారం దగ్గిర మోపారు అంటున్నారు,కానీ త్రిగుణ సాంఖ్యం ప్రకారం పడాల్సిన మూడవ అడుగు ఏది?బహుశా అవతరణ వేదిక మీదకై ఎక్కి ఇటువైపుకి తిరిగి దర్సనం ఇచ్చే ముందు అటువైపుకి వేసిన మూడవ అడుగును ఇక్కద మోపి ఉండవచ్చు - అందుకే ఆ పర్దేసానికి అనత్ మాహ్త్వం వచ్చింది!

          దాదాపు ప్రతి భక్తుడికీ భక్తురాలికీ తిరుమల యాత్రలో కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి యేమిటో తెలుసా!తిరుమల అనే కాదు ఏ అలయానికి వెళ్ళినా ఎదో ఒక తీరని కోరికని స్వామికి నివేదించడానికే వెళ్తాము,అవునా?కానీ మనం ఎంత పెద్ద లిస్టుతో వెళ్ళినా సరే స్వామిని చూస్తున్నప్పుడు మాత్రం ఆ కోరికల్ని చెప్పుకోవాలనే స్పృహయే ఉండదు,కదా!గోవింద నామస్మరణ వల్లనో మూర్తి సౌందర్యం వల్లనో అనుకుంటాం మనం.కానీ అది కాదు అసలు రహస్యం! స్వామి వారి చుట్టూ సిద్దులు,తాపసులు దేవతలు  నిరంతరం ఆయనను అర్చిస్తూ ఆవరించి ఉంతారు - అదృశ్యలైన వారి తపఃఫలం మనకు కూడా నిరపేక్షతని అంటిస్తుంది.

          ఇంకొక విశేషం ఏమిటంటే చూస్తున్నంత సేపు ఆ రూపం ఎంత ఆనందం కలిగించినా ఆ మూర్తి నుంచి చూపు మరల్చిన తర్వాత ఒక్క క్షణం సైతం ఆ రూపం మనస్సులో నిలవదు అదేమిటో,అజ్ఞానం కొద్దీ ఇహలోకపు యావలో పడిపోయామని మనల్ని మనం తిట్టుకుంటాం,కానీ అది కూడా ఒక లీలయే - మళ్ళీ మనస్సులో ఆ రూపం నిలవాలంటే మళ్ళీ ఆ మూర్తిని చూడాల్సిందే,మళ్లీ తిరుమల రావల్సిందే!

          రోజుకి యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు స్వామిని అరక్షణం చూసినా చాలుననే తపనతో - వీరిలో దశాబ్దాల ముందు నుంచి రావాలని అనుకున్న వారు,ఆరు నెలల మునదే ప్రణాళికలు వేసుకున్నవారు,అసహాయుల నుంచి దేశాద్యక్షుల వరకు సంవత్సరానికి 30 నుంచి 40 మిలియన్లు ఉంటారు!స్వామివారి వీదెశీమారకద్రవ్యం,అదే బంగారు నిల్వలు ఇప్పటికి 52 టన్నులు - తెలుపు లెక్కల ప్రకారం!స్వామివారి వార్షికాదాయం 6 బిలియన్ డాలర్లు - మరి, పన్ను కడుతున్నాడో లేదో?కట్తమంటే విజయ్ మాల్యాలాగ పారిపోడు గద!

          తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే.అయితే,బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది.శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9రోజులు కన్నులపండువగా జరుగుతాయి. 'నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు.

          స్వామివారి బ్రహ్మోత్సవాలు 'అంకురార్పణ'తో ప్రారంభమవుతాయి.బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం 'ధ్వజారోహణం'.ధ్వజారోహణం తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి, వాహన మంటపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు.బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. స్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధృవబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. ఆరో రోజు రాత్రివేళలో- స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో మెరిసి భక్తులను మురిపిస్తారు. పోతనామాత్యుని విరచితమైన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింపజేస్తూ సాగే వూరేగింపు ఇది.ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు.ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే మరి. ఇక రథం విషయానికొస్తే... దానికి సారథి దారుకుడు. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూన్చిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.'రథస్థ కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యతే' అనేది శృతివాక్యం.బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు జరిపిస్తారు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే 'చక్రస్నాన ఉత్సవం'. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం(దించడం) చేస్తారు.

          ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. మళ్ళీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తర్వాతే!

SATA GAYATRI
శతగాయత్రి-మంత్రావళి


💠-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.!!
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.!!
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. !!

💠-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్!!
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ !!

💠-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.!!
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్!!
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ !!
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ !!

💠-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.!!
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.!!

💠-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.!!
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.!!

💠-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.!!

💠-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.!!

💠-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.!!

💠-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.!!

💠-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.!!

💠-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.!!

💠-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.!!
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.!!

💠-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.!!

💠-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.!!

💠-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.!!
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.!!
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.!!!
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.!!
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.!!
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.!!
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.!!
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.!!
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.!!
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.!!
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.!!
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ  నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.!!
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.!!
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.!!
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.!!
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.!!
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.!!
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.!!
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్!!
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.!!

💠-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.!!

💠-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.!!
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.!!
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.!!

💠-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.!!
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.!!

💠-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.!!

💠-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.!!
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.!!
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్.!!

💠-: శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.!!

💠-: శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.!!

💠-: శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.!!

💠 శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.!!

💠 శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.!!

💠 శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.!!

💠 శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.!!
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.!!

SRI VENKATESWARA SWAMY VAIBHAVAM


SRI VENKATESWARA SWAMY VAIBHAVAM

వేంకటేశ్వరుడ్ని కలియుగ దైవంగా భావిస్తారు.






ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తలపోస్తారు. ఆయన్ను దర్శనం చేసుకోడం అంటే దాదాపు ఆ మహావిష్ణువు దర్శనం చేసుకోడంతో సమానం అనుకుంటారు. ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడ్డం అంటే, ఇక ఈ జన్మకు కావల్సింది లేదనుకుంటారు. శ్రీహరి సంపూర్ణదర్శనంతో మోక్షం లభించినట్టే ఫీలవుతారు. అలా జరగాలంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోడంతో పాటు- పాదాలను కూడా వీక్షించాలి. దీన్నే నిజపాద దర్శనం అంటారు.

శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలు, తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు, తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. మిగిలిన సమయాల్లో స్వామివారి మూలవిరాట్ నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి. శుక్రవారం అభిషేక సేవకు ముందు, బంగారు పాదకవచాలను పక్కకు తీసి- స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట- భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు. అదీ శ్రీవారి పాదాలకున్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని- పాదాల వైపు చూపి దర్శించుకో.. తరిస్తావంటాడు. ఆయన తానున్నాని సూచించడానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు.

ఆనందనిలయంలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకో విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడిచేయి కింది వైపుగా చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణమని ఆయన సూచించడంగా దీన్ని అర్ధం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్ధమట.

శ్రీహరిని అవమానించినవీ పాదములే
సిరి అలిగినదీ ఆ పాదముల వల్లే
భృగువు అహంకారమును తొలగించినదీ పాదములే
లోకకళ్యాణము చేసినదీ ఆ పాదములే
సిరి- హరి విడిపోయినదీ ఆ పాదముల వల్లే

ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరినగుర్తులూ పాదములే. మూడడుగుల్లో ఆనంద నిలయం చేరినదీ పాదములే.. శ్రీహరి అందునా శ్రీవేంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు. ఆయన "ఇల" వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు పాదాలే.

ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంలో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంటా అని పాడాడు. అంతటి మహిమాన్వితమైనవి శ్రీవారి పాదములు. శ్రీకృష్ణావతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేసాడని చెబుతుంది భాగవతం. ఇక వామనావతారంలోనూ బలితన తలను అప్పగించడానికి కారణం పాదమే. శ్రీహరి పాదములకు ఇంతటి విశిష్టత వుంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవిల్లాడుతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడింది. బొటనవేలు చెదరడాన్ని చూసి.. ఇది ఏ దుశ్శకునమో అనుకున్నారందరూ.
వాటిని తిరిగి పునఃప్రతిష్టించారు.

ఆగమశాస్త్రంలో ఈ పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత వున్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు? అన్నది అటుంచితే శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి కావు. బ్రహ్మకడిగిన పాదములవి. బ్రహ్మము తానెడి పాదములవే. శ్రీహరి మహిమలన్నీ దాదాపు పాదముల్లోనే దాగి వుంటాయి.

శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీ దేవి ప్రేమలో పడ్డం, తర్వాత ఆమెతో పెళ్లి కావడం.. చకచకా జరిగాయి. తర్వాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోర్కెలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిసాడు.

అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదములు. కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి. అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పిందిక్కడే. కొండ నుంచి నంబి, గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్రామానుజులు.. ఈ ప్రదేశం చేరుకొని భగవారాధన చేసేవారట. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన.

కాలి నడక మార్గంలో వెళ్ళేవారికీ అలిపిరి ప్రదేశంలో కనిపిచే మండపం ,పడాల మండపం .దీనినే పాదాల మండపం అని కూడా అంటారు .క్రీ.శ .1628 కాలం నాటిది ఈ పాదాల మండపం .ఈ మండపంలో `పాదరక్షలు `లెక్కలేనన్ని ఉన్నాయి .`మాధవదాసు `అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక లేక ఇక్కడే శిలగా మరిపోయాడట .తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యo .ఆ రోజు ఉపవాసం చేయడం ,పిండితాళిగలు వేయడం సంప్రదాయం .ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహర ప్రాంతంలోని హరిజనులు ఇంటిలో ,కంచి ప్రాంతంలోని హరిజనుని ఇంటిలో పాదముద్రలు పడతాయి .ఆ పాద ముద్రలను కొలతలు వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు .శ్రీకాళహస్తి నుండి ఒకరు ,కంచి నుండి ఒకరు శ్రీవారి చెప్పులున్ని నెత్తి పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాద రక్షలను ఆ పూజ మందిరంలో పెడతారు .

ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతుంటాయట. కారణమేంటో తెలుసా.. తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట. అలమేలు మంగమ్మ దగ్గరకి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ.. వాటిని ఇక్కడే వదిలి వెళతారని పురాణ ఇతిహాసం.

నారాయణ పాదములు

తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ. దూరంలో `నారాయణ పాదం` ఉంది. శ్రీవారి శ్రీపాద ముద్రలున్న శిలఫలకం ఇక్కడే కనిపిస్తుంది. నారాయణగిరి పాదముల విషయంలో ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు. కానీ, పాద పూజ- ఛత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పునఃప్రతిష్ట చేసిన నారాయణగిరిలోనే ఈ ఉత్సవనిర్వహణ జరిగేది. వీటినే "నారాయణ పాదములు" అంటారు.

ఆషాడ శుద్ద ఏకాదశి పర్వదినం అంటే ద్వాదశి తిది ఇక్కడే శ్రీపాద పూజ,ఛత్రస్టాపన ఉత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి ప్రాతఃకాల మధ్యాహ్నకాల ఆరాధనం ముగిశాక అర్చకులు,ఏకాంగులు, అధికారులు,పరిచారకులు రెండు `భూచక్ర ` గొడుగులను, యమునోత్తరం నుండి పుష్పసరాలను,బంగారు బావి తిర్ద్దాన్ని సంసిద్ధం చేసుకొని మంగళ వాద్యాలతో బయలుదేరుతారు. మేదరగట్టు వద్దకు చేరగానే వాద్యాలు నిలిపి నారాయణగిరి వైపు కదులుతారు. ఆ గిరి మీదున్న శిలాఫలకంలోని శ్రీ పాదలకు బంగారు బావి జలంతో అభిషేకం చేస్తారు. హారతి ఆరగింపులు విర్వహిస్తారు. శ్రీవారి పాదాలున్న ప్రాంతంలోని చెట్లకు `భూచక్ర గొడుగులను` కట్టి వెనుకకు తిరుగుతారు. నారాయణగిరి దిగి బంగళాతోటకు వచ్చి చేరుతారు.ఆఫై ప్రసాద వినియోగం,వనభోజనం జరుగుతాయి. తదనంతరం మహాద్వారం చేరుకొంటారు.

అలా శ్రీవారి పాదములను ఇన్ని రకాలుగా పూజించడం గౌరవించడం జరుగుతుంది.అసలు శ్రీవారిని ఆమూలాగ్రం దర్శించుకుంటే జన్మధన్యమైనట్టే. ఇక శ్రీనివాసుని పాదం దర్శించుకుంటే- ఆయన హృదయంలో శ్రీదేవితో సమానంగా స్థానం దొరికినట్టే భావిస్తారు.

Sunday, 8 April 2018

ఆవు గురించి వివరణ




🍁ఈ ప్రపంచంలో గోవు శరీరం అత్యంత ఆరోగ్యకరమైనది, పవిత్రమైనది. వేదకాలం నుండి గోవు మనకు ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయ సాధనాలను సమకూరుస్తున్నది. భూలోకంలో ఆవు కామధేనువుతో సమానం. అంతటి మ¬న్నతమైన గో సంపదను సంరక్షించి, మన దేశాన్ని ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం మనందరి కర్తవ్యం.

వైజ్ఞానికముగా ఆవు ప్రాధాన్యత
🍁– ఒక తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే ఒక టన్ను ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభిస్తుంది. అంతేకాక వాతావరణం కాలుష్యరహిత మవుతుంది.

🍁– గృహాలను, వాకిళ్ళను ఆవుపేడతో అలికినట్లయితే రేడియోధార్మిక కిరణాల నుండి రక్షణ పొంద వచ్చు.

🍁– గో మూత్రంలో నైట్రోజన్‌, కార్బాలిక్‌ ఆసిడ్‌ వంటి రసాయనాలున్నాయి. పాలిచ్చే ఆవు మూత్రంలో లాక్టోజ్‌, సల్ఫర్‌, కాపర్‌, మాంగనీస్‌, పొటా షియం, అమ్మోనియా, గ్యాస్‌, యూరియాసాల్ట్‌ మరియు ఎన్నో రకాల క్షారాలు, ఆరోగ్యకరమైన ఆమ్లాలు ఉన్నాయి.

🍁– అణుధార్మిక శక్తి నుండి వచ్చే హానికర వాయువుల నుండి రక్షణ పొందగల సర్వాధిక శక్తి ఆవు పాలల్లో ఉంది.

🍁– ఆవు నెయ్యిని బియ్యంతో కలిపి, ఆవు పిడకలపై వేడిచేస్తే ఇథిలిన్‌ ఆక్సైడ్‌, ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌, ఫార్మాల్డిహైడ్‌లు ఉత్పన్నమవుతాయి. కృత్రిమ వర్షం కురిపించడం కోసం ప్రొపిలిన్‌ ఆక్సైడ్‌ ఆధారమని విజ్ఞానశాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

🍁– పచ్చి ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ మరియు విద్యుత్‌ లభిస్తున్నాయి. గో మూత్రంతో విద్యుత్‌ తయారవుతున్నది. గోడ గడియారాలు నడుస్తు న్నవి.

ఆరోగ్య ప్రదాయినిగా ఆవు

🍁– ఆవు పేడకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని సంరక్షించే గుణముంది.

🍁– గర్భిణీ స్త్రీలు ఆవును పూజించి రోజూ 11 సార్లు అవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సుఖ ప్రసవంతో పాటు తెలివైన శిశువు జన్మిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

🍁– ప్రపంచంలో మానవులకు ప్రాణ వాయువును ఇచ్చే ఒకే ఒక ప్రాణి గోవు.

🍁– ఆవు పాలలో కలరా వ్యాధికారక క్రిములను నాశనం చేయగల లక్షణాలున్నాయని మద్రాస్‌కు చెందిన డా||కింగ్‌ పేర్కొన్నారు.

🍁– దీర్ఘరోగాలున్నవారు, మానసిక రోగులు కొంత కాలం గోశాలలో నివాసముంటూ గోసేవ చేస్తే ఆవు నుండి వెలువడే వాయుతరంగాల కార ణంగా పై రోగాలు నయమవుతాయని శాస్త్రజ్ఞుల పరిశీలనలో వెల్లడయింది.

🍁– ఆవు మూపురంలో ఉండే ‘సూర్యకేతునాడి’ కారణంగా, విషపదార్థాలను తిని కూడా అవు వాటిని అమృతతుల్యంగా మారుస్తుంది.

🍁– ఆవు పాలు శరీరంలో చురుకుదనాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. జ్ఞాపక శక్తికి ఆవుపాలు శ్రేష్ఠమైనవి.

🍁– ఆవు పాలకు క్యాన్సర్‌, క్షయ, గుండెజబ్బులు, రక్తపుపోటు, మధుమేహం, కామెర్లు, కీళ్ళ నొప్పులు, మూలశంఖ, రక్తహీనత, మల బద్ధకం, ఉదర వ్యాధులు, వాయు సంబంధ వ్యాధులు, చర్మరోగాలు, నేత్ర వ్యాధులు, వికారము తదితర వ్యాధులను నివారించే గుణముంది.

🍁– ఆవు మూత్రం సేవిస్తే సర్వరోగ నివారిణిగా, సంజీవనిగా పనిచేస్తుంది.

🍁– ఆవు పాలలో మానవ శరీర పోషణకు అవసర మయ్యే మాంసకృత్తులు, పిండిపదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్లు మరియు కాల్షియం, ఫాస్ఫరస్‌వంటి లవణాలు సమృద్ధిగా వుంటాయి.

🍁– ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమ యం (పంచగవ్యం)తో అన్ని రకాల జబ్బులను నివారించగల ఔషధాలు తయారవుతున్నాయి. పంచగవ్యంలో విషాలన్నింటినీ తొలగించే శక్తి వున్నది.

ఆర్థికముగా ఆవు

🍁– మన జాతీయ ఆదాయంలో 6 నుండి 7 శాతం గో సంపద నుండి లభిస్తున్నది.

🍁– మన దేశ వ్యవసాయానికి, రవాణాకు 70 శాతం ఎద్దులే ఆధారం.

🍁– ఒక ఆవు నుండి సంవత్సరానికి 36 క్వింటాళ్ళ పేడ లభిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వున్న గో సంపదతో సంవత్సరానికి 32 కోట్ల టన్నుల పేడ లభిస్తోంది.

🍁– ఒక ఆవు తన జీవితకాలంలో 5,10,440 మందికి ఒక పూట భోజనం సమకూర్చగలదని స్వామి దయానంద సరస్వతి ”గోకరుణానిధి” గ్రంథంలో పేర్కొన్నారు.

🍁– ఎండిన ఆవుపేడ ఇంధనంగా ఉపయోగ పడు తున్నది. బూడిద ఎరువుగా, క్రిమిసంహారిణిగా, వంటపాత్రలను శుభ్రపరిచేదిగా ఉపయోగించు టతో కోట్లాది రూపాయలు పొదుపు అవుతు న్నాయి.

🍁– చనిపోయిన ఆవును ఒక్క సంవత్సరముపాటు నేలలో పాతిపెట్టడం ద్వారా అత్యంత విలువైన జీవన ఎరువు లభ్యమవుతుంది.

🍁– పంచగవ్య చికిత్స మరియు గో ఆధారిత వ్యవ సాయ పద్ధతుల ద్వారా దేశంలోని గ్రామా లన్నింటికీ ఉద్యోగావకాశాలు కల్పించవచ్చును.

🍁– సాధారణమైన ప్రతి ఆవు నుండి రోజుకి 10 కిలోల పేడ, 5 లీటర్ల మూత్రం లభిస్తాయి. గోసంతతికి చెందిన చిన్న లేగ దూడ నుండి కూడా సంవత్సరంలో రూ.20,000ల విలువ కల్గిన ఎరువులు లభ్యమవుతాయి.

🍁– గో మూత్రం నేడు క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతోంది.

🍁– బులంద్‌ షహర్‌, కాన్పూర్‌, ఢిల్లీ పట్టణాలలో ఎద్దులతో నడిచే ట్రాక్టర్‌ రూపొందింది. దీని ఉపయోగంతో ఖర్చు తగ్గి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

🍁– చనిపోయిన ఆవు కొమ్ములో ఆవు పేడను నింపి, స్వచ్ఛమైన నేలలో దసరా నవరాత్రులలో పాతి పెట్టి ఉగాది నవరాత్రులలో తీయటం ద్వారా ఒక్కొక్క కొమ్ము నుండి లభించే జీవన ఎరువు 4 ఎకరాలకు సరిపోతుంది.