Search This Blog

Friday, 30 March 2018




శబరిమల అయ్యప్ప స్వామి 






శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలుసు .

కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు , ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాలు మనలో చాలా మందికి తెలియదు.

ఒక్కసారి దీనిని చదవండి.
మీకు తెలియని చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని అందరికీ తెలియజేయండి.

ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.

సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.

చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.

శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.

దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.

శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది.
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.

శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.

కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.

1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.

శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.

స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు.
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.

అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.

ఓం స్వామియే శరణమయ్యప్ప!!

Wednesday, 28 March 2018

SAKTHI PEETAS - శక్తి పీఠాలు


శక్తి పీఠాలు


హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.....

ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు ..... పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు..... ఈ శక్తిపీఠాలు మనదేశం లోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి ..... ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి.... 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి..... పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. ....అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు...

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము .... మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు .... ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు ... ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు .... ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు ..... ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు ..... అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు .... ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది ...... వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు .... వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు ..... వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు .... ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు

అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది.... పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది..... ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది...... విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు.... సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు..... ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు.... ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు..... దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.... సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.... ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది....


అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ ||

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు...... ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి..... వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం.... అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం..... మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి..... అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది..... ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం...... ఆ క్షేత్రాల గురించిన వివరాలు..

1.శాంకరీదేవి

లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు..... ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు... ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు... 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది..... ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2.కామాక్షి

సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం.... ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది... పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి.... స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట..... అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు...... ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి..... ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు

3.శృంఖల

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం.... ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు... గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు..... కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు..... అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది..... పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం..... ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు..... ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి

హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం...... ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది...... ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ

మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం..... సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు..... ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు.... అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట.... 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు.... ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది.... జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు.... ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.... ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి......

6.భ్రమరాంబిక

విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి..... అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట.... రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట.... అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం...... శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు..... శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7.మహాలక్ష్మి

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి...... ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు..... కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు..... కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల.... అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు...... నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు..... మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి.... అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు

8.ఏకవీరాదేవి

మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి.... దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక..... దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు..... ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి.... అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు.... మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది.... మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది..... అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది.... ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది.... ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు

9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది.... ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి.... ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది.... పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట...... బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట..... అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం..... స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం.... ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా

10.పురుహూతిక

పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం..... పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం.... ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది.... ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి.... ఇది గయాక్షేత్రం కూడా.... గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు.... గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది.... దాన్ని నాభిగయ అంటారు.... శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.


11.గిరిజాదేవి

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి.... ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి.... గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు.... అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు.... సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు...... ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు...... ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది..... ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది..... ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12.మాణిక్యాంబ

సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం..... దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా..... సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం..... ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట.... అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట...... శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి..... ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13.కామాఖ్య

అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం..... అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు..... గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది..... సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది..... ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది..... ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు..... ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది..... కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం.... అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు..... కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14.మాధవేశ్వరి

అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు..... సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు..... నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది.... దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు.... భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు..... తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు..... స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు..... దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి.... అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15.సరస్వతి

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు.... ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు..... ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు.... ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16.వైష్ణవీదేవి

అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు..... ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు..... భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు...... ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.


17.మంగళగౌరి

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ..... అమ్మవారు మంగళగౌరీదేవి..... స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు....... ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు..... ఇక్కడి తీర్థం ఫల్గుణీనది.... ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.... ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18.విశాలాక్షి 

సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది..... వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది..... ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు..... శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.


...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు.... ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు..... ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

!!! ఓం శ్రీ మత్రే నమః !!!

Monday, 26 March 2018

Gollamamidada - Kodanda Ramalayam - కోదండ రామాలయం. గొల్ల మామిడాడ, తూర్పు గోదావరి




కోదండ రామాలయం.
గొల్ల మామిడాడ, తూర్పు గోదావరి.

ఈ  కోదండ రామాలయం  .. ఆకాశాన్ని  తాకుతున్నట్టుగా  ఉంటుంది .. 9 అంతస్తులతో .. గోపురం ప్రతీ అంతస్తు నుంచీ    చెక్కిన పురాణ గాధలను చూడవచ్చు .. రామాయణ  భారత     భాగవత  ఘట్టాలు  కళ్ళకి కట్టినట్లు మలిచారు  .. గోపురం  చివరి అంతస్తు  ఎక్కితే .. 25  కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం లో ఉన్న పాండవుల మెట్ట కనబడుతుంది ... 20  కిలోమీటర్ల లో ఉన్న  కాకినాడ కనబడుతుంది ..   భద్రాచలం లో లాగానే  ఇక్కడ  కూడా  రాములవారి కల్యాణం  ప్రభుత్వ లాంచనాలతో.. ఘనంగా   ముత్యాల తలబ్రాలు  పట్టుపీతాంబరాలతో  జిల్లా కలెక్టర్ సమర్పిస్తాడు ...  ఈ కోదండ రామాలయం చూడటం  ఒక  మధురానుభూతి.

Sunday, 25 March 2018

Gayatri Mahayagam






ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?

ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి ?

వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా.

వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపుంసి-పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా, రామాయణంగా అవతరించినవి.  ఆ రామాయణం ఏమి చెపుతూంది? వేదాలు ధర్మమును చెపుతై.  ఆలాటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య, అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటలవల్ల రాముడు 'ధర్మస్వరూపుడు'. అని గోచరిస్తుంది.

పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి యివ్వడం వాడుక. రామునికి కౌసల్య యిచ్చిన తినుబండం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.

'యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ
స వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు'

రాఘవా! నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడేది'

ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్కచేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండడమే ధృతి. 'ఎవరేమన్నా సరే' అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు. పిదప పిదప మెల మెలగా దాన్ని వదిలివేస్తారు. దానికి ఒక కట్టుబాటో నియమమో ఉండదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.

రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటయినా వదలక కాపాడుకొంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూవచ్చాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూవున్నపుడు కౌసల్య కుమారుడికి 'ధర్మంగా వర్తించుకో' అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో, ఆధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదల నన్నిటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తూంది.

ఒక కుక్క దొంగలబారినుండి మనలను కాపాడవలెనంటే దానిని మనం చక్కగా కాపాడాలి. మనం దేనిని కాపాడతామో అది మనలను కాపాడుతుంది- ''నీవు ధర్మాన్ని రక్షించుకొంటూ వచ్చావు, ఇకముందు గూడా రక్షించుకొంటూ వస్తావు. అదే. ఆధర్మమే నిన్ను రక్షించుకొంటుంది' అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి 'తన బిడ్డ అడవులపాలయిపోతున్నాడే' అని దుఃఖించక ఇట్లా చెబుతూంది. కూడా పుట్టిన సోదరుడే 'అన్నా! ధర్మం. ధర్మం' అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడముచేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టమూ సంభివిస్తూంది. దాన్ని వదలివేశావా నీకీబాధ ఉండదు' అని ఎన్నోసారులు చెప్పాడు. 'ఎవరు నవ్వినా, నాయనా! రాఘవా! ఏధర్మాన్ని నీవుధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.' అని తల్లి ఆశీర్వదిస్తున్నది.

'ధర్మం తలకాస్తుంది' అని ఒకసామెత ఉంది. ఆడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే. రావణునికి పది తలలున్నప్పటికి తాను చేసిన ఆధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.

'వేదోఽఖిలో ధర్మమూలమ్‌' వేదమే ధర్మమును చెపుతూంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించా డనీ, 'వేదవేద్యే పరే పుంసి' అనే శ్లోకం చెపుతూంది. కౌసల్యాదేవి వాక్యంవల్ల 'ధర్మ స్వరూపుడే రాముడు' అని తెలియవస్తూంది. ఇంకో చోట 'రామో విగ్రహవాన్‌ ధర్మః' అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలావుంటుంది అని అంటే రాముడై కూచుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం. వేదాలవలన తెలియదగిన వస్తువే అందరకూ కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అపుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది.

సాక్షాద్రామ చంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామమంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిల యేదీ మనస్సు కంటదు. అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.

'వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మవా'

వేదాలవల్ల తెలుసుకోదగిన పరమపురుషుడు దశరథునికి కొడుకుగా అవతరించినందున రామాయణరూపం ఎత్తిన వేదాలయొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొకదానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటుల చేస్తుంది.

AMBA SATRAM - BHADRACHALAM - SRI RAMA MAHIMA





ఒక"అన్నమ"య్య కథ!!

ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.

ఇల్లిల్లూ తిరిగి అడుక్కునేవాడు. తాను తినేందుకు కాదు. ఇతరు లకు పెట్టేందుకు.

ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు.

ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా? బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి.

అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు. సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు.

ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు.

సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే.

ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద.
నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా.

ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు.

అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు.

ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు.

ఆయన వంటకుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి.

ఆయనకిఅర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది.

శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.

భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు.

హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు.

అయ్యా... నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు.
ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే.

సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు.

ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి (డబ్బులు మాత్రం చెల్లించాలి).

ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది.

చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది.

ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ.




ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.

తెలుగువాడు ఎప్పుడో ఒకప్పుడు భద్రాచలం చూడకపోడు. ఈ సారి రాముడిని, రామదాసును దర్శించుకున్నప్పుడు ఈ రమణదాసుని మరిచి పోకండి. కాస్త ఒపిగ్గా అడిగి అయినా సరే వెతుక్కుంటూ వెళ్లి అంబసత్రాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ రెండు గుండిగలున్నాయి.

ఒకటి రామ గుండిగ
ఒకటి లక్ష్మణ గుండిగ.

(భూముల్నయితే దోచేసుకున్నారు కానీ గుండిగల్ని దోచుకునే ధైర్యం ఎవడూ చేయలేదు మరి)

Tuesday, 20 March 2018

Gaana Ramayanam 108 నామాల్లో సంపూర్ణ రామాయణము


108 నామాల్లో సంపూర్ణ రామాయణము:




 రామ రామ జయ రాజారామ | రామ రామ జయ సీతారామ | బాలకాండము: శుద్ధబ్రహ్మపరాత్పర రామ కాలాత్మకపరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మాద్యమరప్రార్థిత రామ చండకిరణకులమండన రామ శ్రీమద్దశరథనందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్రప్రియధన రామ ఘోరతాటకాఘాతక రామ మారీచాదినిపాతక రామ కౌశికమఖసంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ గౌతమమునిసంపూజిత రామ సురమునివరగణసంస్తుత రామ నావికధావికమృదుపద రామ మిథిలాపురజనమోహక రామ విదేహమానసరంజక రామ త్ర్యంబకకార్ముఖభంజక రామ సీతార్పితవరమాలిక రామ కృతవైవాహికకౌతుక రామ భార్గవదర్పవినాశక రామ శ్రీమదయోధ్యాపాలక రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ అయోధ్యాకాండ: అగణితగుణగణభూషిత రామ అవనీతనయాకామిత రామ రాకాచంద్రసమానన రామ పితృవాక్యాశ్రితకానన రామ ప్రియగుహవినివేదితపద రామ తత్క్షాళితనిజమృదుపద రామ భరద్వాజముఖానందక రామ చిత్రకూటాద్రినికేతన రామ దశరథసంతతచింతిత రామ కైకేయీతనయార్పిత రామ విరచితనిజపితృకర్మక రామ భరతార్పితనిజపాదుక రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ అరణ్యకాండ: దండకావనజనపావన రామ దుష్టవిరాధవినాశన రామ శరభంగసుతీక్ష్ణార్చిత రామ అగస్త్యానుగ్రహవర్ధిత రామ గృధ్రాధిపసంసేవిత రామ పంచవటీతటసుస్థిత రామ శూర్పణఖార్తివిధాయక రామ ఖరదూషణముఖసూదక రామ సీతాప్రియహరిణానుగ రామ మారీచార్తికృతాశుగ రామ వినష్టసీతాన్వేషక రామ గృధ్రాధిపగతిదాయక రామ శబరీదత్తఫలాశన రామ కబంధబాహుచ్ఛేదన రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ కిష్కింధాకాండ: హనుమత్సేవితనిజపద రామ నతసుగ్రీవాభీష్టద రామ గర్వితవాలిసంహారక రామ వానరదూతప్రేషక రామ హితకరలక్ష్మణసంయుత రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ సుందరకాండ: కపివరసంతతసంస్మృత రామ తద్గతివిఘ్నధ్వంసక రామ సీతాప్రాణాధారక రామ దుష్టదశాననదూషిత రామ శిష్టహనూమద్భూషిత రామ సీతావేదితకాకావన రామ కృతచూడామణిదర్శన రామ కపివరవచనాశ్వాసిత రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ యుద్ధకాండ: రావణనిధనప్రస్థిత రామ వానరసైన్యసమావృత రామ శోషితశరదీశార్తిత రామ విభీష్ణాభయదాయక రామ పర్వతసేతునిబంధక రామ కుమ్భకర్ణశిరచ్ఛేదన రామ రాక్షససంఘవిమర్ధక రామ అహిమహిరావణచారణ రామ సంహృతదశముఖరావణ రామ విధిభవముఖసురసంస్తుత రామ ఖఃస్థితదశరథవీక్షిత రామ సీతాదర్శనమోదిత రామ అభిషిక్తవిభీషణనుత రామ పుష్పకయానారోహణ రామ భరద్వాజాదినిషేవణ రామ భరతప్రాణప్రియకర రామ సాకేతపురీభూషణ రామ సకలస్వీయసమానస రామ రత్నలసత్పీఠాస్థిత రామ పట్టాభిషేకాలంకృత రామ పార్థివకులసమ్మానిత రామ విభీషణార్పితరంగక రామ కీశకులానుగ్రహకర రామ సకలజీవసంరక్షక రామ సమస్తలోకోద్ధారక రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ ఉత్తరకాండ: ఆగత మునిగణ సంస్తుత రామ విశ్రుతదశకంఠోద్భవ రామ సీతాలింగననిర్వృత రామ నీతిసురక్షితజనపద రామ విపినత్యాజితజనకజ రామ కారితలవణాసురవధ రామ స్వర్గతచంబుక సంస్తుత రామ స్వతనయకుశలవనందిత రామ అశ్వమేధక్రతుదిక్షిత రామ కాలావేదితసురపద రామ ఆయోధ్యకజనముక్తిత రామ విధిముఖవిభుదానందక రామ తేజోమయనిజరూపక రామ సంసృతిబంధవిమోచక రామ ధర్మస్థాపనతత్పర రామ భక్తిపరాయణముక్తిద రామ సర్వచరాచరపాలక రామ సర్వభవామయవారక రామ వైకుంఠాలయసంస్థిత రామ నిత్యానందపదస్థిత రామ రామరామ జయరాజా రామ రామరామ జయసీతా రామ

తాత్పర్యము: బాల కాండ: శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు , కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము

 జయము. అయోధ్య కాండ: ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము

 జయము. అరణ్యకాండ: ఓ శ్రీరామా! నీవు దండకారణ్యంలోని జనులను పావనము చేసిన వాడవు, దుష్టుడైన విరాధుని చంపిన వాడవు, శరభంగుడు, సుతీక్ష్ణులచే పూజించ బడినవాడవు, అగస్త్యుని అనుగ్రహముతో వర్ధిల్లిన వాడవు, జటాయువుచే సేవించ బడినవాడవు, పంచవటీ తీరమున నివసించిన వాడవు, శూర్ఫణకకు దుఃఖము కలిగించిన వాడవు, ఖరఆ దూషణులను సంహరించిన వాడవు, సీత కోరిన మాయలేడిని అనుసరించిన వాడవు, మారీచుని సంహరించిన వాడవు, సీతను వెదకుతూ వెళ్ళిన వాడవు, జటాయువుకు మోక్షము కలిగించిన వాడవు, శబరి ఇచ్చిన ఫలములు తిన్న వాడవు, కబంధుని బాహువులు నరికిన వాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము

 జయము. కిష్కింధకాండ: ఓ శ్రీరామ! నీవు - హనుమంతునిచే పాదసేవ పొందిన వాడవు, సుగ్రీవుని కోరిక తీర్చిన వాడవు, గర్వి అయిన వాలిన సంహరించిన వాడవు, వానరులను దూతగా పంపిన వాడవు, హితుడైన లక్ష్మణునితో కూడి యున్నవాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

సుందరకాండ: ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు, లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు, సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు. సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

యుద్ధ కాండ: ఓ శ్రీరామా! నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి. నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు, ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

ఉత్తరకాండము: ఓ రామా! నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు. సీతారామునకు, రాజా రామునకు జయము జయము. మంగళం: భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ | మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ | ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ | రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీ

BRAHMA KAPALAM బ్రహ్మ కపాలం

!!బ్రహ్మ కపాలం"!!




"శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.
నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,
ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.
ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.
కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.
అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు.
క్రమక్రమంగా ఎండి,చివరికది
కపాలంగా మారిపోయింది.

బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరి
బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.
జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.
దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా ! పరమజ్ఞామివి.
నీకు తెలియని ధర్మం లేదు.
ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .
శాసించగలవాడివి.
అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.
కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ
మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !
ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?
పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.
అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.
ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.
ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.
'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.
అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.
చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.
దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.
దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……

"ఓం నమఃశ్శివాయ"!!

భీముడునైవేద్యం - శ్రీ వేంకటేశ్వర స్వామి BHAKTA BHEEMA & SRI VENKATESWARA SWAMY MAHATYAM



భీముడునైవేద్యం - శ్రీ వేంకటేశ్వర స్వామి  BHAKTA BHEEMA  & SRI VENKATESWARA SWAMY MAHATYAM



శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం..ఎందులోనో మీకు తెలుసా

ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా.

 ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – "స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట.

స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి.

మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని.

అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట.

అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, "ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?

అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట.

స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట.

 స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.

సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.

Sunday, 18 March 2018

Sri Rama Nama Mahima - శ్రీరామ నామ మహిమ


శ్రీరామ నామ మహిమ

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.

శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటకలగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!

దశావతార జయంతులు:

1. మత్స్య - చైత్రబహుళ పంచమి, 2. కూర్మ - వైశాఖ శుద్ధ పూర్ణిమ, 3. వరాహ - చైత్ర బహుళ త్రయోదశి, 4. నారసింహ - వైశాఖ శుద్ధ ద్వాదశి, 5. వామన - భాద్రపద శుద్ధ చతుర్దశి, 6. పరశురామ - వైశాఖ శుద్ధ ద్వాదశి, 7. శ్రీరామ - చైత్రశుద్ధ నవమి, 8. శ్రీకృష్ణ - శ్రావణ బహుళ అష్టమి, 9. బుద్ధ - వైశాఖ శుద్ధ పౌర్ణమి, 10. కల్కి - భాద్రపద శుద్ధ విదియ

శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.

అసలు శ్రీరామనామ జపమే సమస్త పాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:

రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.

మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.

'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయజయరామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.

సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి.

Monday, 5 March 2018

Details of Some Important Siva temples



శివ క్షేత్రాలు:

కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:

భైరవకోన ::




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.

ధర్మస్థల ::



కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.

తంజావూరు ::


తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.

దుగ్ధేశ్వరనాథ్ ::


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.

తలకాడు ::





(1) కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2) కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.

మహేశ్వర్ ::



మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.

కోటప్పకొండ ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.

సురుటుపల్లి ::



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

పోండా ::

గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.


ఖాట్మండు ::



(1) నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2) శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.

తిరువల్లం ::

తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.

నత్తరామేశ్వరం ::



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.

కాళేశ్వరం ::



అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.

పృధుదక్ ::

హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.

గార్హముక్తేశ్వర్ ::

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.

శివగంగ ::

కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.

కాంచీపురం ::

ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::

ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.

చిదంబరం ::

పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.

తిరువణ్ణామలై ::

'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీకాళహస్తి ::

శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.

శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::

చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.