Search This Blog

Wednesday, 12 September 2018

108 Forms of Ganapathy - 108 రూపాలలో మహా గణపతులు

108 రూపాలలో మహా గణపతులు

1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య

2. మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్

3. బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం

4. తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:

5. విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:

6. సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్

7. బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||

8. లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్

9. సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||

10. దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||

11. సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే

12. విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||

13. క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం

14. హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా

15. నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ

16. వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్

17. నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||

18. ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:

19. హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్

20. మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||

21.మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం

22.మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్

23.త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||

24. వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి

25. ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||

26. ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే

27. సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే

28. గురు గణపతి
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||

29. స్వర్ణ గణపతి
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||

30. అర్క గణపతి
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||

31. కుక్షి గణపతి
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||

32. పుష్టి గణపతి
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||

33. వామన గణపతి
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||

34. యోగ గణపతి
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:

35. నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం

36. దూర్వా గణపతి
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||

37. అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||

38. లంబోదర గణపతి
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||

39.విద్యా గణపతి
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||

40. సరస్వతీ గణపతి
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||

41. సంపత్ గణపతి
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:

42. సూర్య గణపతి
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||

43. విజయ గణపతి
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:

44. పంచముఖ గణపతి
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||

45. నీలకంఠ గణపతి
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||

46. గాయత్రి గణపతి
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||

47. చింతామణి గణపతి
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||

48. ఏకదంత గణపతి
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

49. వికట గణపతి
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||

50. వరద గణపతి
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||

51. వశ్య గణపతి
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||

52. కుల గణపతి
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||

53. కుబేర గణపతి
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |

54. రత్నగర్భ గణపతి
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||

55. కుమార గణపతి
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:

56. సర్వసిద్ధి గణపతి
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||

57. భక్త గణపతి
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్

58. విఘ్న గణపతి
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:

59. ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే

60. వర గణపతి
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్

61. త్ర్యక్ష్యర గణపతి
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్

62. క్షిప్రప్రసాద గణపతి
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్

63. సృష్టి గణపతి
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ

64. ఉద్దండ గణపతి
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్

65. డుండి గణపతి
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:

66.ద్విముఖ గణపతి
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:

67. త్రిముఖ గణపతి
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:

68. సింహ గణపతి
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:

69. గజానన గణపతి
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||

70. మహోదర గణపతి
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||

71. భువన గణపతి
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||

72. ధూమ్రవర్ణ గణపతి
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ

73. శ్వేతార్క గణపతి
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే

74. ఆధార గణపతి
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||

75. భూతరోగ నివారణ గణపతి
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |

76. ప్రసన్న విఘ్నహర గణపతి
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

77. ద్వాదశభుజవీర గణపతి
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||

78. వశీకర గణపతి
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||

79. అఘౌర గణపతి
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||

80. విషహర గణపతి
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||

81. భర్గ గణపతి
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||

82. సర్వ సమ్మోహన గణపతి
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||

83. ఐశ్వర్య గణపతి
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||

84. మాయావల్లభ గణపతి
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||

85. సౌభాగ్య గణపతి
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||

86. గౌరి గణపతి
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||

87. ప్రళయంకర్త గణపతి
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||

88. స్కంద గణపతి
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||

89. మృత్యుంజయ గణపతి
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||

90. అశ్వ గణపతి
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||

91. ఓంకార గణపతి
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||

92. బ్రహ్మవిద్యా గణపతి
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||

93. శివ అవతార గణపతి
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||

94. ఆపద గణపతి
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||

95. జ్ఞాన గణపతి
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||

96. సౌమ్య గణపతి
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||

97. మహాసిద్ధి గణపతి
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||

98. గణపతి
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||

99. కార్యసిద్ధి గణపతి
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

100. భద్ర గణపతి
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||

101. సులభ గణపతి
వందే గజేంద్రవదనం – వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం – క్వులయినీ జారకోరకా పీడమ్ ||

102. నింబ గణపతి
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||

103. శుక్ల గణపతి
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||

104. విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

105. ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||

106. సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||

107. సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:

108. సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||

💐లోకా సమస్తా సుఖినోభవంతు💐

         💐💐శ్రీ మాత్రే నమః💐💐

Monday, 3 September 2018

అళగర్‌ కోవిల్‌ - ALAGHAR PERUMAL KOIL


అళగర్‌ కోవిల్‌



*దక్షిణ తిరుపతి గురించి విన్నారా!*

మధురైకి వెళ్లినవారు అక్కడి మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని, ఆ రూపాన్ని మదిలో నింపుకొని తిరుగుముఖం పడతారు. కొద్దిమంది భక్తులు మాత్రం అక్కడికి కాస్త దగ్గరలో ఉన్న అళగర్‌ కోవిల్‌ ఆలయాన్ని చూడకుండా వెనుతిరగరు. అళగర్‌ కోవిల్ అంటే మాటలా! రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది.

మధురైకి ఓ ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ, ఓ కొండ పక్కన ఉన్న ఆలయమే అళగర్‌ కోవిల్‌. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. ఆయన చాలా అందంగా ఉంటాడు. కాబట్టి అళగర్‌ (అందమైనవాడు) అన్న పేరుతో పిలుస్తారు. తమిళ సాహిత్యంలో అడుగడుగా ఈ ఆలయం ప్రత్యేకత కనిపిస్తుంది. తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదికారంలో సైతం ఈ ఆలయ వర్ణన వినిపిస్తుంది. ఇక ఆళ్వారులు కూడా ఈ స్వామిని పొగుడుతూ వందకు పైనే పాశరాలు రాసినట్లు తెలుస్తోంది. వైష్ణవ దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలలలో ఈ క్షేత్రమూ ఒకటి. ఇక్కడి స్వామి రూపం చేతనో, అడుగడుగునా అలరించే ప్రకృతి కారణంగానో.... ఈ క్షేత్రాన్ని దక్షిణ తిరుపతిగా భావిస్తుంటారు.
అళగర్‌ కోవిల్‌ వెనుక చరిత్ర ఏమిటన్న విషయం మీద పెద్దగా స్పష్టత లేదు. కానీ మధురలోని మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్‌ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈయనని దర్శించారని అంటారు. ఇక దక్షిణాది రాజుల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించినవారే.
అళగర్‌ స్వామి మహత్తును నిరూపించేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. పాండ్యరాజులలో రెండవవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. రామానుజాచార్యుడి ముఖ్యశిష్యుడైన కరుదాళ్వార్‌కు ఈ స్వామి మహిమతోనే కంటిచూపు తిరిగి వచ్చిందట. ఈ ఆలయం పక్కనే కనిపించే కొండ సాక్షాత్తు ఆ నందీశ్వరుని అవతారం అని భక్తుల నమ్మకం.

అళగర్‌ కోవిల్ దగ్గరకి చేరుకోగానే మనం వేరే ప్రపంచానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయం నమ్ముకుని వందల ఏళ్లుగా జీవిస్తున్న గ్రామవాసులు కనిపిస్తారు. ఆలయం చుట్టూ శిధిలమైన కోటగోడలు, దీని రాచరికాన్ని గుర్తుచేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. సుందరపాండ్యన్‌ అనే రాజు 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద పోయించిన బంగారపు పోత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది.

అళగర్‌ కోవిల్‌ ఆలయం వెలుపల ఉండే కరుప్పుస్వామి సన్నిధి గురించి కూడా చెప్పుకొని తీరాల్సిందే! అళగర్‌ కోవిల్‌లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలూ మట్టికరిచారు. ఆ సమయంలో వారికి ‘కరుప్పుస్వామి’ అనే కావలి దేవత కనిపించి, ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చాడట.

అళగర్‌ కోవిల్‌ వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తిమంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కపోతుందని చెబుతారు.

అళగిరి కోవిల్‌లో తిరుమాళ్‌ స్వామివారితో పాటుగా వారి సతీమణ ‘సుందరవల్లి తాయార్‌’ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు ‘కళ్యాణవల్లి తాయార్‌’ అన్న పేరు కూడా ఉంది. వీటితో పాటుగా నరసింహస్వామి, చక్రత్తాళ్వార్, వినాయకు, ఆండాళ్ దేవతల విగ్రహాలూ దర్శనమిస్తాయి. ఇక ఆలయంలో రథమండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం... ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి.

అళగిరి ఆలయం సమీపంలోనే నూపుర గంగ అనే తీర్థం ఉంది. విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తినప్పుడు, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ఆయనకు పాదపూజ చేశాడట. ఆ సమయంలో ఆయన పాదాల మీద ఉన్న ఆభరణాలని (నూపురం) తాకిన కొంత నీరు ఇక్కడ పడిందనీ.... అదే ఈనాటి నూపుర గంగ అనీ చెబుతారు. ఆ గంగలోని నీరు తాగితే సర్వరోగాలు హరించిపోతాయని భావిస్తారు.

అళగిరి కోవిల్‌ను దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే ఉన్న ‘పళమూడిర్చోళై’ అనే ఆలయానికి తప్పక వెళ్తారు. కుమారస్వామికి ఉన్న ఆరు ప్రముఖ ఆలయాలలో ఈ ‘పళమూడిర్చోళై’ ఒకటి. ఇక్కడ వల్లీదేవసేన సమేతంగా ఉన్న కుమారస్వామిని దర్శించుకుని తిరిగి మధురైకు చేరుకుంటారు.

౹౹ శ్రీ కృష్ణాష్టకం ౹౹ SRI KRISHNA ASTAKAM

౹౹ శ్రీ కృష్ణాష్టకం ౹౹
SRI KRISHNA ASTAKAM



*వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |*
*దేవకీ పరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 01*

*అతసీ పుష్ప సఙ్కాశం హార నూపుర శోభితమ్ |*
*రత్న కఙ్కణ కేయూరం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 02*

*కుటిలాలక సంయుక్తం పూర్ణచన్ద్ర నిభాననమ్ |*
*విలసత్ కుణ్డలధరం కృష్ణం వన్దే జగద్గురమ్ || 03*

*మన్దార గన్ధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |*
*బర్హి పింఛావ చూడాఙ్గం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 04*

*ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |*
*యాదవానాం శిరోరత్నం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 05*

*రుక్మిణీ కేళి సంయుక్తం పీతామ్బర సుశోభితమ్ |*
*అవాప్త తులసీ గన్ధం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 06*

*గోపికానాం కుచద్వన్ద కుఙ్కుమాఙ్కిత వక్షసమ్ |*
*శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 07*

*శ్రీవత్సాఙ్కం మహోరస్కం వనమాలా విరాజితమ్ |*
*శఙ్ఖచక్ర ధరం దేవం కృష్ణం వన్దే జగద్గురుమ్ || 08*

*కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |*
*కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి || 09*

*ఇతి శ్రీ కృష్ణాష్టకం...*


SRI KRISHNA GOVINDAM || కృష్ణం వందే జగద్గురుం || ||శ్రీ కృష్ణ గోవిందం||


|| కృష్ణం వందే జగద్గురుం ||
||శ్రీ కృష్ణ గోవిందం||



  శ్రీకృష్ణ పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఇష్టమైనవారికి జగన్నాటక సూత్రధారి. గిట్టనివారికి కపట నాటక సూత్రధారి. విలక్షణమైన వైరుధ్యాలతో మాయచేసే గమ్మత్తయిన వ్యక్తిత్వం కాబట్టే కృష్ణుడంటే అంత ఆకర్షణ. ఒకసారి చూస్తే ఇంత ఆకతాయి ఇంకెక్కడా కనిపించడు అనిపిస్తుంది. మరు నిమిషంలోనే మన సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని తెలిపే గురువు ఆయనే అన్నట్టు కనిపిస్తుంది. గోపబాలురతో ఆడిపాడినా గోవర్ధనగిరిని కొనగోటితో ఎత్తినా భారతాన్ని బాధ్యతగా నడిపించినా ఆయన ప్రతి అడుగూ మానవజీవితానికి మార్గనిర్దేశనం చేసేదే. అందుకే కన్నయ్య పుట్టిన రోజంటే (ఈరోజు కృష్ణాష్టమి) జగతికి పండగ రోజే.

శ్రావణ బహుళ అష్టమి... కృష్ణ జన్మాష్టమి. దేవకీదేవికి అష్టమ గర్భంలో ప్రవేశించిన కథానాయకుడు శ్రీకృష్ణుడు.

జన్మిస్తూనే తన నిజరూప సందర్శన భాగ్యాన్ని జననీ జనకులకు కలిగించిన మధుమోహనుడు. వారికి తన జన్మ కారణాన్నీ, వారి తక్షణ కర్తవ్యాన్నీ వివరించాడు. నందుని ఇంట నడయాడాడు. యదు కులాన్ని ఉద్ధరించాడు. బృదావనాన్ని ప్రేమతో నింపేశాడు. రేపల్లె రాగంతాళం రాజీవం చేశాడు. మరోవైపు దుష్టశిక్షణా శిష్టరక్షణా చేసి మానవజాతిని ధర్మపథాన నడిచేలా చేశాడు. మానవుడే మాధవుడిగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వం అంటే ఇదీ అని రేపటి తరాలకు చాటిచెప్పాడు. ప్రేమతో పిలిచినా, భక్తితో ధ్యానించినా, వైరంతో దూషించినా... ఇలా ఏ విధంగా తనను ఆశ్రయించినా మోక్షమిచ్చే కరుణామయుడు కృష్ణస్వామి. జీవితంలో కష్టనష్టాలూ సుఖదుఃఖాలూ ఎత్తుపల్లాలూ ప్రతీదీ ఓ భాగమే అంటాడు. వాటన్నింటిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో తన జీవన విధానంతో ఆచరించి చూపిన జ్ఞానస్వరూపుడు. గోకులంలో లీలలు చూపినా, యుద్ధం వద్దని రాయబారం నడిపినా, కురుక్షేత్రంలో వివశుడైన అర్జునుడికి గీతోపదేశం చేసినా... ప్రతిదీ మధుర ఘట్టమే. రేపటి తరానికి ఒక వ్యక్తిత్వ పాఠమే. అందుకే కంప్యూటర్‌ కంటే వేగంగా కాలానికి పోటీగా పరుగులు తీయాలని ఉవ్విళ్లూరుతున్న వేళకూడా మానవజాతి కృష్ణతత్వాన్ని వదల్లేకపోతోంది. ఆ ప్రేమతత్వాన్ని మనసావాచా మననం చేసుకుంటోంది.

*🌹ఆనందగోవిందం*

‘అధరం మధురం నయనం మధురం... మధురాధిపతే అఖిలం మధురం...’ అంటూ కన్నయ్య ముగ్ధమనోహర రూపాన్ని ఎంత కీర్తించినా తనివితీరదు. ఒక్క రూపమేనా, నల్లనయ్య... కన్నయ్య... కిట్టయ్య... గోపాలుడు... ఇలా ఆ మధుసూదనుడి పేరు తలచినా అలవికాని ఆనందమే. ‘కృష్ణుడు’ అంటేనే ‘అందరి హృదయాలనూ ఆకర్షించేవాడు’ అని అర్థం.
నిజానికి కృష్ణుడికి వశంకాని ప్రాణి ఏదీ లోకంలో లేదు. ప్రేమతో గోపికలూ, భయంతో కంసాది రాక్షసులూ, బంధుత్వంతో యాదవ పాండవులూ... ఇలా అందరూ ఆ రసరమ్య రూపాన్ని పొదివిపట్టుకోవాలని చూసినవారే. తమని తాము అర్పించుకుని తరించినవారే. మార్గాలే వేరు అందరి గమ్యమూ ఒక్కటే... కృష్ణుడిలో చేరిపోవడం. ఆయన్ను చేరుకోవడమంటే కృష్ణ తత్వాన్ని మన జీవనంలోకి ఆహ్వానించడమే. మన మనసును చైతన్యవంతంగా నిత్యనూతనంగా మహదానంద భరితంగా మలచుకోవడమే. జీవితంలో ఎదురైన ప్రతిపనిలో ఆనందాన్ని ఎలా వెతుక్కోవాలో యుగాలనాడే చేసిచూపాడు ఆ కృష్ణస్వామి. బాలుడిగా పారాడుతూనే అమ్మచనుబాలు తాగినంత సులువుగా పూతనను తుదముట్టించాడు. చేతిలో వెన్నముద్దను పెట్టుకున్నంత ఆనందంగా గోవర్ధన గిరినిమోసి గోకులాన్ని రక్షించాడు. పూబంతులు విసిరినంత అవలీలగా పరమ రాక్షసుడైన కంసమామ గుండెలమీద పిడిగుద్దుల వర్షం కురిపించి సంహరించాడు. కాళీయుడి విషపుపడగలమీద కూడా ఆనందతాండవం చేయగల చిద్విలాసరూపుడు. వేలాది రాజుల సమక్షంలో తనను అగ్రపీఠంమీద కూర్చోబెట్టినా తన కళ్లముందే ద్వారకాపట్టణం సముద్రంలో కుంగిపోతున్నా రెండూ కర్మననుసరించి వచ్చిన ఫలితాలే అంటాడు. రెంటినీ అంతే ఆనందంగా స్వీకరిస్తాడు. సమస్య తలెత్తినప్పుడూ అదే నవ్వూ... గెలిచిన తర్వాతా అదే చిరునవ్వూ. ఆ నవ్వే కృష్ణతత్వం.
సంసారాన్ని వీడడు... ఏదీ త్యాగంచేయడు... కష్టాలు ఎదురైనప్పుడు కూడా సంతోష సాగరంలో ఎలా మునకలువేయాలో సులువుగా చేసిచూపడమే మానసచోరుడి లీలావినోదం.

*🌹పూర్ణగోవిందం*

జీవితం అంటే ఏమిటీ... అని ప్రశ్నించుకునే మనుషులకు పరిపూర్ణం నుంచి ఉద్భవించిన మానవ జన్మ తిరిగి పరిపూర్ణంలోనే కలిసిపోయే నిర్దిష్టమైన గమనమన్నాడు గీతాచార్యుడు. ఈ ప్రయాణం అంత సులువైంది కాదన్నాడు. అది బంధాలతో అల్లుకుంటుందనీ బాధ్యతలతో నిండి ఉంటుందనీ, శిఖరాలను చూపిస్తుందనీ, లోతుల్లోకి తోసేస్తుందనీ తెలిపాడు. ఎలా జీవించాలో జీవితాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఆచరించి చూపాడు. అందుకే కృష్ణుడి జీవితం మానవాళికి ఓ విలువైన సందేశం. నందనందనుడు నమ్మి చేరిన వారిని కాదన్న సందర్భమే లేదు. ఒకవైపు ప్రేమను పంచుతూనే మరోవైపు ధర్మాన్ని నిలబెట్టాడు. మనిషిగా పరిపూర్ణత్వాన్ని ఎలా సాధించాలో మొత్తం మానవజాతికి చెప్పకనే చెప్పాడు. కృష్ణుడు దేవుడు కాబట్టి ఆయన జీవితం అంతా ఆనందంగానే సాగిందనుకుంటే పొరపాటే. కృష్ణపరమాత్మ సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమే కావచ్చు. ఆయనలో దేవతాంశ ఉండిఉండొచ్చు. కానీ ఇవేవీ దేవకీసుతుడిని దేవుడిగా నిలబెట్టలేదు. కేవలం ఆయనలోని స్థితప్రజ్ఞత, వర్ణించనలవికాని వ్యక్తిత్వమే గోపబాలుడిని గోవిందుడ్ని చేశాయి. అవే మానవ రూపంలో జన్మించినప్పటికీ మాధవుడిగా నిలిపాయి. నడయాడి యుగాలు గడిచినా ఆయన రూపాన్ని మన మనసుపొరల్లో సుస్థిరం చేశాయి.

శ్రీకృష్ణుడి జీవితం ఆద్యంతం మానవాళిని జాగృతం చేసే గీతాపాఠమే. యద్భావం తద్భవతిగా నిలిచిన పూర్ణజ్ఞాన స్వరూపమే. నిజానికి కృష్ణుడిని అనేకులు అనేక విధాలుగా చూశారు. రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అనుభూతి చెందారు. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే... ‘అందరితోనూ నవ్వుతూ తిరిగే అసలు సిసలైన మోసగాడు. ఏదైనా చేయగల సమర్థుడు. వయోభేదంలేకుండా ఎవరితోనైనా ఆడిపాడగల నేర్పరి...’ ఇదీ దుర్యోధనుడి అవగాహన. ‘కృష్ణుడంటేనే ప్రేమ, ప్రేమంటేనే కృష్ణుడు. ఆయన ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా ప్రేమకు వశుడే...’ ఇదీ కన్నయ్య చిననాటి ప్రేమికురాలు రాధమ్మ అనుభూతి. ‘దేవదేవుడైన శ్రీకృష్ణుడిని మించిన బలం, బలగం మరొకటిలేదు. ఆయనుండగా వేరే ఏదీ అవసరం రాదు కూడా...’ ఇదీ పాండవమధ్యముడి నమ్మకం. కృష్ణుడు పరిపూర్ణమైన విశ్వంలాంటివాడు. సూర్యుడూ చంద్రుడూ కృష్ణబిలాలూ గ్రహశకలాలూ... అన్నీ అందులో భాగమే. ఎవరు ఏది కోరుకుంటే, దేన్ని చూడాలనుకుంటే అవే కనిపిస్తాయి. కృష్ణస్వరూపమూ అంతే.

*🌹ప్రేమైకగోవిందం*

కన్నయ్యకు బంధాలంటే అమితమైన తీపి. అందుకే ఆయన అందరికీ బంధువే. ప్రతి బంధాన్నీ వెన్నముద్దల్లా అపురూపంగా ఒడిసిపట్టాడు. బంధుత్వాలను ఎలా కొనసాగించాలో చెప్పకనే చెప్పాడు. బంధాలు మనకి బంధనాలు కావనీ ఆయా రూపాల్లో భగవంతుడేననీ గ్రహించమంటూ భాగవత సూత్రాన్ని అలవోకగా వివరించాడు.

మురళీగాన లోలుడు కదా... ఆ గానం ఎంత మధురమో ఆయన ఉపదేశమూ అంతే సమ్మోహనం. మధుసూదనుడు అవతార పురుషుడే అయినా అమ్మంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు కట్టుబడ్డాడు. అందుకే పోతన సైతం చిన్నికృష్ణయ్య లీలను ఇలా చెబుతాడు...

చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్‌
జిక్కడు శృతిలతికావలి
జిక్కెనతండు లీల దల్లి చేతన్‌ రోలన్‌

... యోగుల తపస్సులకు సైతం అందలేదు. అమ్మవారి బిగికౌగిలిలోనూ ఇమడలేదు. అలాంటి అనంతాకారుడు అమ్మప్రేమకు బందీ అయ్యాడు మరి. అన్న బలరాముడన్నా ఆయనకు అలవికాని అనురాగం. అంతకు మించిన గురు భావం. మరోవైపు అన్నగా నిలబడి సుభద్రా కళ్యాణాన్ని ముందుండి జరిపించాడు. సోదరికి సవతి అయినా ద్రౌపదినీ తోబుట్టువులాగే ఆదరించాడు. చీరకొంగును చింపి వేలికి చుట్టినందుకే పరమానంద భరితుడయ్యాడు. అది ఆమె మెట్టినిల్లే చూట్టూ ఉన్నది సొంతవాళ్లే అయినా అయిదుగురు భర్తలూ పక్కనే ఉన్నప్పటికీ... కష్టకాలంలో ద్రౌపదికి తోడునిలిచింది కన్నయ్యే. అన్నా అంటూ ఆర్తిగా పిలవగానే అక్కున చేర్చుకున్నాడు. చీరలు అందించి ఆమె మానాన్ని కాపాడాడు. భీష్మాచార్యుడు యోధుడు.

వరసకి తాత. కృష్ణుడంటే అమితమైన ప్రేమ. ఆయనంటే కన్నయ్యకూ అంతే గౌరవం. కానీ కౌరవ పక్షాననిలిచి ఆయనకు వ్యతిరేకంగా పోరాడాడు. నేలకొరిగే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం ఆయన కృష్ణుడి సాన్నిధ్యాన్నే కోరుకున్నాడు. మాధవుడు వచ్చేవరకూ ప్రాణాలు అరచేతపట్టుకుని ఎదురుచూశాడు. అలాగే స్నేహం ఎలా చేయాలో స్నేహితులు ఎలా ఉండాలో కృష్ణుడిని చూసి ఈతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జతగాడైన కుచేలుడిని ఆదుకున్న తీరు అద్భుతం. కుచేలుడు నిరుపేద. శ్రీకృష్ణుడు రాజ్యాధినేత. మొహమాట పడుతూ తనవద్దకు వచ్చిన నేస్తాన్ని అడిగిమరీ అటుకుల మూట తీసుకున్నాడు. అడక్కపోయినా సకలసౌభాగ్యాలూ ప్రసాదించాడు. స్నేహితుడిని సమాదరించి, స్నేహబంధం అన్నింటికీ అతీతమైందని నిరూపించాడు కృష్ణస్వామి.

*🌹జ్ఞానగోవిందం*

పదవులకోసం పాకులాడటం, స్కాంల కోసం స్కీంలు వేయడం కాక రాజకీయమంటే ఏమిటో, దాన్ని రసవత్తరంగా ఎలా నడపాలో చూపిన రాజకీయ దురంధరుడు శ్రీకృష్ణుడు. ధర్మ రక్షణ కోసం ఆ మధుసూదనుడు నెరిపిన రాజకీయ చదరంగమే కురుక్షేత్ర యుద్ధం. దుష్టులను శిక్షించడానికీ ధర్మం పక్షాన నిలబడటానికీ మాధవుడు వేయని ఎత్తుగడ లేదు, చేయని రాజకీయం లేదు. కాళీయ మర్దనం నుంచీ కురుక్షేత్ర సంగ్రామం వరకూ ప్రతిదీ కన్నయ్య ప్రణాళికే. అంతటి రాజనీతిజ్ఞుడు మరొకడుండడు. మహాభారతాన్ని రాజకీయకోణంలో చూస్తే కృష్ణుడిదే కీలక పాత్ర. కౌరవుల దుర్మార్గాన్నీ, దుర్బుద్ధినీ దెబ్బతీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను తాను కావాలా లేక కోట్ల సైన్యం కావాలా అని ప్రశ్నించి తెలివిగా తప్పుదోవ పట్టించాడు. రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించాడు. సర్వవేదాంత సారమైన గీతా శాస్త్రాన్ని మానవాళికి అందించాడు. కురుక్షేత్ర రణరంగంలో సారధిగా అర్జునుడిని కార్యోన్ముఖుడిని చేసి మార్గదర్శి అయ్యాడు. ధర్మాన్ని రక్షించడానికి పాండవుల పక్షాన చేరి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. మహాభారత సంగ్రామంలో పాండవులకే విజయాన్ని కట్టబెట్టి అంతిమ విజయం ధర్మానిదేనని రుజువుచేశాడు. బలగం కంటే బలం, జ్ఞానం కంటే బుద్ధీ గొప్పవని చాటిచెప్పాడు.

*🌹గురుగోవిందం*

నాయకుడు అన్నవాడు ఎలా ఉండాలో కృష్ణయ్య యుగాలనాడే చూపించాడు. ముందుండి నడిపేవాడు సమస్యలకూ, సవాళ్లకూ భయపడిపారిపోకూడదు. చివరివరకూ విజయం మనదేనన్న భావంతో పోరాడాలి. తన బృందంలోనూ అదే స్ఫూర్తిని నింపాలి. గోకులంలో ఉన్నప్పుడు ఊరి సమస్యను తనదిగా భావించాడు కాబట్టే గోకులాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని చిటికెనవేలిమీద మోశాడు. తనవారికి కష్టం వచ్చినప్పుడు తాను ముందుండి పోరాడి జగత్తుకి దిశానిర్దేశం చేశాడు. జీవితమంటేనే పోరాటమని తెలిసినవాడు కాబట్టే జరాసంధుడితో పదిహేడుసార్లు యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడుగు వేయలేదు. యుద్ధంలో ఓడిపోయే సందర్భం ఎదురైన ప్రతిసారీ జరాసంధుడు పారిపోయేవాడు. కానీ మళ్లీ బలం పుంజుకుని యుద్ధానికి సై అనేవాడు. దీంతో వరుస యుద్ధాలు చేయక తప్పలేదు కన్నయ్యకు. సమస్యలకు దూరంగా ఉండటమే కాదు, అపాయంలో ఉపాయం ఎలా ఆలోచించాలో చేసి చూపాడు. ఎప్పుడూ ఎదురెళ్లి పోరాడటమేకాదు ఒక్క అడుగు వెనక్కివేసినట్టు కనిపించైనా శత్రువుని తుదముట్టించడమూ ఆయనకి తెలుసు. కాలయవనుడి ఉదంతంలో కృష్ణుడు ఈ ఎత్తుగడనే వేశాడు. అక్షౌహిణులకొద్దీ సైన్యంతో తనమీద యుద్ధానికి వచ్చిన కాలయవనుడికి నిరాయుధుడై ఎదురునిలిచాడు. భయపడినట్టు నటించాడు. కొండకోనల్లోకి పరుగులు తీశాడు. ఓ పాడుబడ్డ గుహను చేరాడు. ముందూ వెనకా ఆలోచించకుండా కన్నయ్యనే వెంబడిస్తూ గుహలోకి అడుగుపెట్టాడు కాలయవనుడు. గాఢాంధకారంలో నిద్రపోతున్న ఓ వృద్ధుడిని చూసి శ్రీకృష్ణుడిగా భ్రమించి ముచికుంద మహర్షిని తట్టిలేపాడు. ఆ ముని ఆగ్రహంతో కళ్లుతెరిచేసరికి నిలువునా భస్మమైపోయాడు. అదీ గోవిందుడి వ్యూహమంటే. భారతంలోనూ అంతే, పాండవ పక్షపాతిలా కనిపించినా వారికీ ఏమీ చేసినట్లుండడు. దుర్యోధనుడితోనూ మంచిగానే ఉన్నట్లు కనిపించినా... ఏ సహాయమూ చేయడు. కానీ తాను నిలిచిన పక్షపు బలాబలాలను తెలుసుకుంటూ ఎత్తూలూ పై ఎత్తూలూ వేస్తూ పాండవులను విజయపథాన నడిపించాడు. నాయకుడు ప్రణాళిక, వ్యూహం అన్నీ సమపాళ్లలో రంగరించి బృందాన్ని ముందుకు నడిపించాలనీ, కదనరంగంలో కత్తిపట్టితీరాలనేమీ లేదనీ వ్యవహారాన్ని చక్కదిద్దే నేర్పు ఉంటే చాలనీ చాటిచెప్పాడు. శ్రీకృష్ణుడనే నాయకుడే లేకపోతే పాండవుల విజయాన్ని ఊహించనేలేం.

భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి
అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు. మధురమైన మురళీ గానంతో ప్రకృతిని సైతం ఆనందడోలికల్లో ఓలలాడించాడు. తలచినంతనే చెంతచేరి పదహారువేల మంది గోపికల్నీ ప్రేమధారల్లో ముంచెత్తాడు. మేధాశక్తితో నారితో సైతం వింటినారిని పట్టించాడు. యుద్ధంలో పాంచజన్యాన్ని పూరించి శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాడు. అయినా... ఏ మూసలోనూ ఒదగడు. ఏ అధికారానికీ లొంగడు. అందుకే శ్రీకృష్ణుడు ‘అయినవాడే అందరికీ - అయినా అందడు ఎవ్వరికీ’!


Ganapati Dhyanam

GANAPATHI DYANAM

| శివ తనయ వరిష్టం సర్వ కళ్యాణ మూర్తిం 
పరశు కమల హస్తం మూషికం మోదకేన 
అరుణ కుసుమవాల వ్యాళలంబోదరంతం 
మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి || 

కబుద ధవళ వర్ణం పూర్ణ లక్ష్మి ప్రసన్నం 
మదగజముఖ మీడ్యం సంజలత్ కర్మయుగమం 
అభయ వరద హస్తం వాసుకీ యజ్ఞ సూత్రం 
మమ హృదయ నివాసం శ్రీ గణేశం నమామి ||   

VINAYAKA CHAVITI - VRATHAM - శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.

శ్రీ వరసిద్ది వినాయక పూజావిధానము.

శ్రీ వరసిద్ధి వినాయకవ్రతమునకు కావలసిన వస్తువులు:

పసుపు 25 గ్రా.
కుంకుమ 25 గ్రా.
పసుపు గణపతి
పార్ఠివగణపతి(మట్టితో చేసిన గణపతి)
పాలవెల్లి(అలంకారముతొ)
బియ్యం  అరకిలొ
తమలపాకులు 20
అగరవత్తులు  1 ప్యాకట్
ప్రత్తి(ఒత్తులకు,వస్త్రయుగ్మమునకు,
యజ్ణోపవీతమునకు)
దీపము(ఆవునేతితొగాని, కొబ్బరి
నూనెతొగాని)
పంచామృతములు(ఆవుపాలు, పెరుగు,నెయ్యి, తేనె, పంచదార నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు) గంధము, వక్కలు, అరపళ్ళు, బెల్లం 100 గ్రా, కొబ్బరికాయ
హారతి కర్పూరం

పార్థివ ప్రతిమా ప్రాశస్త్యము:

వినాయకుని ప్రతిమ మట్టిదే వాడవలెనా? ఏ రంగుది వాడవలెను? ఇవి అనేకుల ప్రశ్నలు. దీనికి గణేశ పురాణంలో సమాధానం కలదు.

శ్లో: || పార్థివీ పూజితామూర్తి:స్థ్రియావా పురుషేణవా ఏకాదదాతి సా కామ్యం ధన పుత్రి పశూనపి ||

పురుషుడు గాని, స్త్రీ గాని మట్టితో చేసినగణపతి ప్రతిమను పూజ చేసినచో ధన,పుత్ర, పశ్వాది సమస్త సంపదలను పొందగలరు.

ఆ ప్రతిమ ఎట్టిమతో చేయవలెను?

“మృత్తికాం సుందరాం స్నిగ్ధాం క్షుద్ర పాషాణ వర్జితాం“

శుభ్రం అయినది. మెత్తనిది, రాళ్ళు, ఇతర మాలిన్యములు లేనిది అగు మట్టిని స్వచ్చం అయిన నీటితో తడిపి  ప్రతిమచేయవలెను

శ్లో.  || కృత్వా చారుతరాం మూర్తిం గ ణేశస్య శుభాం స్వయం సర్వావయవ సంపూర్ణాం చతుర్భుజ విరాజితాం ||

నాలుగు చేతులు గల వినాయక ప్రతిమను స్వయముగ చేసుకొనవలెను. అయితే ఇది అందరికి సాధ్యం కానిది. ప్రతి పట్టణములోను అప్పటికప్పుడు మట్టిని అచ్చులో వేసి ప్రతిమను చేసి ఇచ్చు అంగళ్ళు వినాయకచవితి ముందురోజునుండే పెడుతున్నారు. అట్టి ప్రతిమ అన్నిటికన్న మంచిదని గణేశ పురాణమును బట్టి గ్రహించవలెను.

దూర్వాయుగ్మ పూజ:

వినాయకునికి అత్యంత ప్రీతికరమైనవి దూర్వలు. దూర్వలు అనగా గరిక పోచలు.  గరిక అనగా గడ్డి ప్రతిచోట ఉండును.  చిగురులు కల గరికపోచలు వినాయకుని పూజలో వజ్రాల కన్న, బంగారు పూవులు కన్న ఎక్కువ విలువ అయినవి.  గణేశుడే స్వయంగా “మత్పూజా భక్తినిర్మితా మహతీ స్వల్పికావాపి వృధా దూర్వ్వంకురై ర్వినా“ అంటే నాకు భక్తితో చేసినపూజ గొప్పది అయినను, చిన్నది అయినను దూర్వాంకురములు లేకుండా చేసినచో అది వృధా కాగలదు.

“వినా దూర్వాంకు రై: పూజా ఫలంకేనాపి నాప్యతే

తస్మాదుషసి మద్భ  త్కై రేకా వాప్యేక వింశతి:

భక్త్యా సమర్పితా దూర్వా దదాతి యత్ఫలం మహత్

నతత్క్ర్ తుశతై  ర్దా నైర్వ తానుష్టాన సంచయై :“

 దూర్వాంకురములు లేని పూజ వలన ఫలమేమియు కలుగదు.  అందుచే నాకు భక్తులగువారు ఉష:కాలమందు ఒకటి గాని, ఇరువది ఒకటి గాని దూర్వలచే పూజింవచినచో కలుగు ఫలితము వంద యజ్ఞములవలన గాని, దానముల వలన గాని, వ్రతముల వలన గాని, తపముల వలన గాని పొందుట సాధ్యము కాదు. “దూర్వాయుగ్మమం”  అంటే రెండేసి గరికపోచలు సమర్పించవలెను. ఒకటి ఒకటి విడదీయరాదు. శుభములు కలిగించునది, పుణ్యమును చేకూర్ఛునది అయిన కార్యములు  చేయునపుడు ఆటకములు లేకుండ ఆ కార్యము జరుగుటకు గణాధిపతిని ముందుగ పూజించవలెను.

వినాయకచవితి రోజున చేయు వినాయకవ్రతము ప్రముఖ శుభకార్యం కనుక ముందు పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను.  పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకులో ఉంచవలెను.  చిన్నపళ్ళెములో బియ్యం పోసి ఆ బియ్యముపై పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో సహా ఉంచవలెను. ఆకు కొన తూర్పునకు ఉండవలెను.  ఆవు నేతితో గాని, నూనెతో గాని దీపము వెలిగించి, గణపతికి నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.

శ్రీ మహాగణాధిపతయే నమ: శ్రీ గురుభ్యోనమ: హరి: ఓం

శ్లో. || శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం   ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ||

 మం.  ఓం  దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి సామోమంద్రేషమూర్జంయహానా ధేనుర్వాగస్మానం పసుష్టుతైతు

 అయం ముహూర్త స్సుముహూర్తో అస్తు.


ఆచమనం:

 పాత్ర(అనగా చిన్న చెంబు లేక గ్లాసు) తో నీరు తీసుకొని ఉద్ధరిణి లేదా చెంచాతో ఆచమనం చేయవలెను.  బొటనవ్రేలి చివరను మధ్యవ్రేలి మధ్యకణుపునకు చేర్చి అరచేతిలో మినపగింజ మునిగేటంత నీటిని పోసుకుని ఆచమనం చేయవలెను.

ఓం కేశవాయ స్వాహా: 
ఓం నారాయణాయ స్వాహా: 
ఓం మాధవాయ స్వాహా :
 (ఈ మూడు నామములు చెప్పుచూ కుడి చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను.)
ఓం గోవిందాయ నమ: (చేతిని కడుగ వలెను.)
ఓం  విష్ణవే నమ:
ఓం మధుసూదనయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం వామనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం హ్రుషీకేశవాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం దామోదరాయ నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం వాసుదేవయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
 ఓం అనిరుద్ధ య నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అధోక్షోజాయ నమ:
ఓం నరసింహయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం జనార్థనాయ నమ:
ఓం ఉపేంద్ర య నమ:
ఓం హరయే నమ:
ఓం శ్రీ కృష్ణాయ నమ:


దైవ ప్రార్థన:

 (గణపతికి నమస్కరించి ఈ క్రింది శ్లోకములు చదువ వలెను.

||శ్లో:||యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం.

 లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థో జనార్థన:
 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.
 శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ:  ఉమా మహేశ్వరాభ్యాం నమ: శచీ పురంధరాయ నమ: అరుంధతీ వశిష్టాభ్యాం నమ: శ్రీ సీతారామాభ్యాం నమ: సర్వేభ్యో మహాజనేభ్యో నమ:

భూతోచ్చాటన: (క్రింది విధముగా చదువుతూ అక్షతలు వెనుక వేసుకొనవలెను.)


శ్లో: ||ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే ||

తా: భూతోచ్చాటన అంటే భూతపిశాచములను పారద్రోలుట.  చేయబోవు కార్యమునకు అవరోధము కలిగించు భూతపిశాచములను అచటినుండి వెడలిపొమ్మని భావము.

ప్రాణాయామము: ఓం భూ:  ఓం భువ:  ఓం సువ:  ఓం మహ:  ఓం జన:  ఓం తప:  ఓం సత్యం  ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్  ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం

(గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి  భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను.  దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు.  బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)



సంకల్పము:

(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి,ఏ పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.)

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీ శైలస్య అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే,శుక్లపక్షే, చతుర్థ్యాం ………………. వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే.

(నీరు ముట్టుకొనవలెను.)

కలశారాధనం: 

(కలశం అనగా పూజ చేయుటకు నీరు తీసుకున్న పాత్ర. ఆచమనము చేయుటకు పెట్టుకున్న నీటిపాత్రను కలశారాధనకు వాడరాదు.వేరేపాత్రలో నీటిని పోసి ఆ పాత్రచుట్టూ మూడుచోట్ల గంధము, కుంకుమ, అక్షతలు అద్ది ఆనీటిలో గంధమును, పుష్పములను, అక్షతలను ఉంచితే అదే కలశము. దానిపై చేతిని ఉంచి ఈ క్రింది విధముగా చదువవలెను.

శ్లో: || కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాశ్రిత: మూలే తత్ర స్థితోబ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతా:||

కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణ:

అంగై శ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా: కలశే గంధ పుష్పాక్షతాన్ నిక్షిప్యహస్తే నాచ్చాద్య.

మం: ఆదల శేషుధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్ధైర్యజ్ణేషు వర్ధతే, ఆపోవా ఇదగ్ం సర్వం విశ్వాభూతా న్యాప: ప్రాణావా ఆప: పశవ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపోవిరాడాపస్స్వరాడాపశ్చందాగ్ స్యాపో జ్యోతీగ్ ష్యాపో యజూగ్ ష్యాప స్సత్యమాపస్సర్వా  దేవతా ఆపో భూర్భువస్సువరాప ఓం.

గంగేచ యమునేకృష్ణె గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్ధం మమ దురితక్షయకారకా: కలశోదకేన దేవం, ఆత్మానం, పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య.

(కలశములోని నీరు పుష్పముతో గణపతి పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.

గణపతి పూజ

ప్రాణ ప్రతిష్ట

(పుష్పముతో పసుపు గణపతిని తాకుతూ ఈ క్రింది విధముగా చదువ వలెను.

|| ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవింకవీనాం ఉపవశ్రవస్తమం

జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నణస్పత ఆనశృణ్వమన్ న్నోతిభి స్సీదసాధనం

 అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమినహనోదేహి భోగం

జ్యోక్పశ్యేమసూర్యముచ్చరంతమనుమతే మృళయాద స్స్వస్తి

అమృతంవై ప్రాణామృతమాప:ప్రాణానేవయధాస్థానముపహ్వ్యయతే. ||

 శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నిపుత్ర పరివార సమేతం శ్రీమహాగణాధిపతిం ఆవాహయామిస్థాపయామి పూజయామి స్థిరో భవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. గణపతి ప్రాణప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తో అస్తు.



షోడశోపచార పూజ:

(క్రింది విధముగా ఒక్కొక్క ఉపచారము చెప్పి గణపతికి అక్షతలు సమర్పించవలెను.)

శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యానం సమర్పయామి,
ఆవాహయామి,  రత్నసింహాసనం సమర్పయామి, 

(క్రింది విధముగ చదువుతు కలశములోని నీరు పుష్పముతో గణపతిపై చల్లవలెను.)

శ్రీ మహాగణాధిపతయే నమ: పాదయో పాద్యం సమర్పయామి,
హస్తయో అర్ఘ్యం సమర్పయామి,
ముఖే ఆచమనీయం సమర్పయామి
శుద్ధోదక స్నానం  సమర్పయామి
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వారత్మక:
 శ్రీ  మహాగణాధిపతయో నమ: వస్త్రయుగ్మం సమర్పయామి
 శ్రీ మహాగణాధిపతయే నమ: యజ్ణోపవీతం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమ: అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి

(ఏ క్రింది నామములు చదువుతూ గణపతికి పుష్పములు గాని, అక్షతలు గాని భక్తితో సమర్పింవవలెను.)

ఓం సుముఖాయ నమ:
ఓం ఏకదంతాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం గజకర్ణాయ నమ:
ఓం లంబోదరాయ నమ:
ఓం వికటాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ:
ఓం గణాధిపతయే నమ:
ఓం ధూమకేతవే నమ:
ఓం గణాధ్యక్షాయ నమ:
ఓం పాలచంద్రాయ నమ:
ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం హేరంబాయ నమ:
ఓం స్కందపూర్వజాయ నమ:
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమ: ఓం మహాగణాధిపతయే నమ: షోడశ నామభి: పూజాం సమర్పయామి.

(అగరవత్తులు వెలిగించి ధూపమును చూపించవలెను.)

శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి.

(దీపమునకు నమస్కరించవలెను.)

దీపం దర్శయామి.  ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.  నైవేద్యం సమర్పయామి.

(బెల్లముపై నీరు చల్లి, చుట్టూ నీరు వేసి క్రింది విధముగా చదివి నివేదనము చేయవలెను.)

ఓం భూర్భువస్సువ:  తత్సవితుర్వరేణ్యం  భర్గో దేవస్యధీమహి ధియోయోన: ప్రచోదయాత్, సత్యంత్వర్తేన పరిషించామి.

శ్రీ మహాగణాధిపతయే నమ: అవసరార్ధం గుడోపహారం నివేదయామి అమృతమస్తు  అమృతోపస్తరణమసి  ఓం ప్రాణాయ స్వాహా,  ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా,  ఓం ఉదానాయ స్వాహా,  ఓం సమానాయ స్వాహా (క్రిందివిధముగా చదివి కలశములోని నీరు వదలవలెను.) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.  ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం  సమర్పయామి

శ్రీ మహాగణాధిపతయే నమ: తాంబూలం సమర్పయామి.

(కర్పూరం వెలిగించి గంట మ్రోగించుచూ క్రింది విధముగా చదివి హారతి యివ్వవలెను.)


శ్రీ మహాగణాధిపతయే నమ: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి

సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనోగృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే తయామాసగ్ం సృజామసి సంతత  శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, శ్రీ మహాగణాధిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ద ఆచమనీయమ్ సమర్పయామి.
(పళ్ళెములో నీరు వదలి హారతి కళ్ళకు అద్దుకొనవలెను.తరువాత క్రిందివిధముగా ఉపచారములు చెబుతూ అక్షతలు సమర్పించవలెను.)

సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ్ నమస్కారాన్ సమర్పయామి.  గణాధిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో బవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.  (పూజ చేసిన అక్షతలు, పుష్పములు శిరస్సున ధరించవలెను.)

శ్లో: || ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ గణనాయక. ||

ఉద్వాసన:

మం: యజ్ణేన యజ్ణ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్, తేహనాకం మహిమానస్సచంతే, యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా:

శ్రీ మహాగణాధిపతిం యధాస్థానముద్వాసయామి. శోభనార్ధం పునరాగమనాయచ.

(గణపతిని తమలపాకుతో తీసి పూజామందిరంలో ఈశాన్యభాగంలో ఉంచవలెను.)

  (పసుపు గణపతి పూజ సమాప్తం)

      హరి: ఓం తత్సత్.

శ్రీ వరసిద్ది వినాయక వ్రతకల్పము

 పాలవెల్లిని పండ్లు, పుష్పములు, మామిడి ఆకులు మొదలగు వాటితో అందముగా అలంకరింవి దేవుని మందిరముపై వ్రేలాడదీసి, ఆ పాలవెల్లి క్రింద కర్ర చెక్కను గాని, పీటను గాని పసుపు పూసి, కుంకుమ, వరిపిండి మొదలగువానితో అలంకరింవిఉంచుదురు.  ఆపీటపై ఒక తమలపాకును కొన తూర్పువైపు ఉండునట్లు పెట్టి దానిపై వినాయకప్రతిమను ఉంచవలెను.

శ్లో: || ఓం శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ||



(వినాయక ప్రతిమను పంచామృతములచే శుద్ధి చేయవలెను.  పంచామృతములు అంటే ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపిన నీరు. వీనిలో ఒక్కొక్క ద్రవ్యముతో ప్రతిమను శుద్ధి చేయుచూ చదువ వలసిన మంత్రములు ఇవ్వబడినవి.  మంత్రము చదువుచు కొంచెము కొంచెముగా పంచామృతములు పుష్పముతో ప్రతిమపై చల్లవలెను.  పంచామృతములు లభింపనిచో కొబ్బరినీటితో ప్రతిమా శోధనం చేయవచ్చును.)

పాలు:  మం:  ఆప్యాయస్వసమేతుతే, విశ్వత స్సోమవృష్ణియం, భవా వాజస్య సంగధే

పెరుగు:  మం:  దధిక్రావ్ణ్ణోఅకారిషం, జిష్ణోరశ్వస్యవాజిన:, సురభినోముఖాకరత్, ప్రణ ఆయుగ్ంషితారిషత్

నెయ్యి:  మం:   శుక్రమసి జ్యోతిరసి తేజోపిదేవోవస్సవితోత్పునాత్వచ్ఛిధ్రేణ వసోస్సూర్యస్య రశ్మిభి:,

తేనె:    మం:   మధు వతఋతాయతే, మధుక్షరంతి సింధవ: మాధ్వీర్నస్సంత్వోషధీ:, మధుసక్తముతో షసి, మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్య:, మాధ్వీర్గావో భవంతున:

పంచదార: మం: స్వాదు: పవస్వ దివ్యాయ జన్మనే, స్వాదురింద్రాయసుహ వేతునామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే, బృహస్పతయే మధుమాగ్ం అదాభ్య:

ఉదకము: మం:  ఆపోహిష్టామయోభువ: తానఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివతమోరస: తస్యభాజయతే హన:, ఉశతీరివ మాతర:, తస్మా అరంగ మామవ: యస్యక్షయాయ జిన్వధ, ఆపోజనయధాచన:   

   ప్రాణప్రతిష్ట: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదువ వలెను.)

మం:|| తత్పురుషాయ విద్మ్హహే మహాదేవాయ ధీమహి, తన్నో దంతి: ప్రచోదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక మావాహయామి స్థాపయామి పూజయామి ||   

  (పుష్పములు , అక్షతలు వినాయకునిపై ఉంచవలెను. తరువాత పుష్పమతో వినాయకువి తాకుతూ ఈ క్రింది విధముగాచదివి, ఆ పుష్పమును వినాయకుని వద్ద ఉంచవలెను.)

మం: || అసునీతే పునరస్మాను చక్షు: పున: ప్రాణమిహనోధేహి భోగం, జ్యోక్పశ్యేమ సూర్య మచ్చరంత, మనుమతేమృడయాన స్స్వస్తి, అమృతం వై ప్రాణా:, అమృతమాప: ప్రాణానేవ ధాస్థానముపహ్వయతే. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు.

 ధ్యానం:  (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ క్రింది విధముగా చదివి వినాయకునిపై ఉంచవలెను.)

శ్లో:   భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం, విఘ్నరాజ మహం భజే.

  ఏకదంతం శూర్పకర్ణం, గజవక్త్రం చతుర్భుజం –  పాశాంకుశధరం దేవం, ద్యాయేత్సిద్ధి వినాయకం.
 ఉత్తమం గణనాధస్య వ్రతం సంపత్కరం శుభం  –  భక్తాభీష్టప్రదంతస్మాత్, ధ్యాయేత్తం విఘ్ననాయకం.
 ధ్యాయేద్గజాననం దేవం, తప్తకాంచన సన్నిభం –  చతుర్భుజం మహాకాయం, సర్వాభరణ భూషితం.
 
 శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి 

ఆవాహనం:  

మం: ||సహస్రశీర్షా పురుష:, సహస్రాక్ష స్సహస్రపాత్,సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్టద్దశాంగులం.||

శ్లో: || అత్రాగఛ్ఛ జగద్వంద్య, సుర రాజార్చితేశ్వర, అనాధ నాధసర్వజ్ఞ, గౌరీ గర్భ సముద్భవ. ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆవాహయామి.

రత్నసింహాసనం: (పుష్పములు, అక్షతలు తీసుకొని నమస్కరించి ఈ విధముగా చదివి వినాయకునికి సమర్పింవవలెను.)

మం: || పురుష ఏ వేదగ్ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, ఉతామృతత్వ శ్యేశాన: యదన్నే నాతి రోహతి ||

శ్లో: || మౌక్తికై: పుష్యరాగైశ్చ, నానారత్న విరాజితం రత్నసింహసనం చారు, ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం.||

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: రత్నసింహాసనం సమర్పయామి.

పాద్యం:

మం:  || ఏతావానశ్యమహిమా, అతోజ్యాయాగ్ శ్చపూరుష: పాదోస్యవిశ్వాభూతాని, త్రిపాదస్యామృతం దివి.||

శ్లో: || గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక, భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన. ||

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: పాదయో పాద్యం సమర్పయామి. (పుష్పముతో వినాయకుని పాదములపై నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:

మం:  || త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:,పాదోస్యేహాభవాత్పున:  తదోవిష్వజగ్వ్యక్రామత్, సాశనానశనే అభి ||

శ్లో: || గౌరీపుత్ర నమస్తేస్తు, శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం, గధపుష్పాక్ష తైర్యుతం ||

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: హస్తయో: అర్ఘ్యం సమర్పయామి. (నీరు విడువవలెను.)

ఆచమనీయం:

మం: || తస్మా ద్విరాడజాయత, విరాజో అధిపూరుష: సజాతో అత్యరివ్యత, పశ్చాద్భూమి మధోపుర: ||

శ్లో: || అనాధ నాధ సర్వజ్ఞ, గీర్వాణ పరిపూజిత, గృహాణాచమనందేవ, తుభ్యం దత్తంమయాప్రభో ||

శ్లో:  || శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమ: ముఖే ఆచమనీయం సమర్పయామి. || ( వినాయకునిపై పుష్పముతో నీరు చల్లవలెను.)

పంచామృత స్నానం:

(క్రింది విధముగా చదువుచూ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార నీరు పుష్పముతో వినాయకునిపై చల్లవలెను):

మం: || యత్పురుషేణ హవిషా, దేవాయజ్ఞ మతన్వత
       వసన్తో అస్యాసి దాజ్యం, గ్రీష్మ ఇధ్శశ్శ్రరద్ధివి: ||

శ్లో: || దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
        మధుపర్కం గ్రహణేదం గజవక్ర్త నమోస్తుతే ||

|| స్నానం పంచామృతైర్ధేవ గృహణ గణనాయక
         పయోదధి ఘృతైర్యుక్తం శర్కరామధు సంయుతం ||

శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:

పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:

శ్లో: || గంగాది సర్వతీర్ధేభ్య: అమృతైరమలైర్జలై:
     స్నానం కురిష్య భగవాన్నమ పుత్ర నమోస్తుతే : ||

శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమ:
శుద్దోదక స్నానం: సమర్పయామి.( పుషముతో నీరు వినాయకుని పపై చల్లవలెను)


వస్రం: 

మం: || సప్తాస్యాసన్ పరిధయ: త్రిస్సప్త సమధ: క్రతా:
       దేవాయద్య్హజ్ఞం తన్వానా: అబధ్యన్ పురుషపశుం ||

శ్లో: || రక్తవస్ర్తద్వయంచారు దేవయేగ్యం చ మంగళం
    శుభప్రధం గృహాణత్వం లంబోదర హరాత్మజ ||

శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ: వస్ర్తయుగ్మం సమర్పయామి.( పత్తిని ఉండలుగాచేసి తడిపి పసుపు అద్ది వస్ర్తముగా సమర్పించుట ఆచారము. అట్టివి 2 వస్ర్తములు సమర్పించవలెను).

యజ్ఞోపవీతము

మం: || తంయజ్ఞం బర్హిప్రౌక్షన్ పురుషం జాతమగ్రత:
       తేన దేవాఅయజంత సాధాఋషయశ్చయే ||

శ్లొ: || రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం
      గృహాణ సర్వధర్మజ్ఞభక్తానామిష్టదాయకం ||

శ్రీ వరసిద్ది వినాయక స్వామినే నమ:యజ్ఞోపవీతము సమర్పయామి ( ప్రత్తిని చేతితో కోంచెము మేర నూలువలె తీసి అక్కడ పసుపు అద్ది యజ్ఞోపవీతముగా సమర్పించవలెను).

గంధం:

మం: || తస్మాద్యజ్ఞాత్సర్వహుత:సంభృతం పృషదాజ్యం
       పశూగౌస్తాగౌశ్చత్రేవాయవ్యాన్, ఆరణ్యాన్ గ్రామశ్చయే ||

శ్లో: || చందనాగరు కర్పూరకస్తూరీ కుంకుమాన్వితం
     విలేపనం సుర శ్రేష్ట ప్రీత్యర్దం ప్రతిగుహ్యతం ||

శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: దివ్యశ్రీ చందనం సమర్పయామి.( వినాయకునికి గంధము ఉంగరపు వ్రేలితో సమర్పించవలెను.)

ఆభరణం:

మం: || తస్మాద్యజ్ఞాత్సర్వహుత: ఋచస్సామానీజిజ్ఞిరే
       ఛందాగం సి జిజ్ఞిరేతస్సాత్ యజుస్తస్మాదజాయతే ||

శ్లో: || అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్
    శుభాన్, గృహాణ పరమానంద ఈశుపుత్రనమోస్తుతే ||

శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ:  అలంకరణార్దాం అక్షతాన్ సమర్పయామి.   (అలంకరణార్దాం అక్షతలు సమర్పింపవలెను)

పుష్పాణి:

మం || తస్మాదశ్వాఅజాయంత ఏక్ చోభయాదత:
       గావోహా జిజ్ఞిరే తస్మాత్, తస్మాజ్జాతా అజావయ: ||

శ్లో: || సుగంధాణి సుపుస్పాణిజాజీకుందముఖానిచ
     ఏకవింశతి పత్రాణిసంగృహాణ నమోస్తుతే ||

శ్రీ వరసిద్దివినాయక స్వామినే నమ: పుష్పాణి పూజయామి ( వినాయకునికి పుష్పములు సమర్పింపవలెను)

అధాంగపూజ: (ఇక్కడ వినాయకుని ప్రతి అంగమును పుష్పములచే పూజించవలెను.)

ఓం గణేశాయనమ: పాదౌ పూజయామి.(పాదములు)
ఓం ఏకదంతాయనమ: గుల్ఫౌ పూజయామి. (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయనమ: జానునీ పూజయామి. (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయనమ: జంఘే పూజయామి. (పిక్కలు)
ఓం అఖువాహనాయనమ: ఊరూ పూజయామి. (తొడలు)
ఓం హేరంబాయనమ:  కటిం పూజయామి. (మొల)
ఓం లంబోదరాయనమ: ఉదరం పూజయామి. (కడుపు)

ఓం గణనాధాయనమ: నాభిం పూజయామి. (బొడ్డు)
ఓం గణేశాయనమ: హృదయం పూజయామి. (వక్షము)
ఓం స్థూలకంటాయనమ: కంటం పూజయామి.(కంటం)
ఓం స్కందాగ్రజాయనమ: స్కందౌ పూజయామి.(భుజములు)
ఓం పాశహస్తాయనమ: హస్తౌ పూజయామి.(చేతులు)
ఓం గజవక్త్రాయనమ: వక్త్రం పూజయామి.(నోరు)
ఓం విఘ్నహంత్రేనమ: నేత్రం పూజయామి. (కండ్లు)
ఓం శూర్పకర్ణాయనమ: కర్ణౌ పూజయామి. (చెవులు)
ఓం ఫాలచంద్రాయనమ: లలాటం పూజయామి. (నుదురు)
ఓం సర్వేశ్వరాయనమ: శిర: పూజయామి. (శిరస్సు)
ఓం విఘ్నరాజాయనమ: సర్వాంగాని పూజయామి.
ఏకవింశతి పూజ:  (వినాయకుని 21 రకముల పత్రములచే (ఆకులచే) పూజింపవలెను. సంస్కృతపదము పక్కనే ఆపత్రము యొక్క తెలుగు పేరు కూడ యివ్వడమైనది.

ఇందులో కొన్ని పత్రములు సాధారణంగా పూజకు వాడనివి. కాని వినాయకచవితి రోజున అవి వాడుటకు అనుమతించబడియున్నది.)

 ఓం సుముఖాయనమ:  మాచీపత్రం సమర్పయామి  (మాచి పత్రి)
 ఓం గణాధిపాయ నమ:  బృహతీ పత్రం సమర్పయామి  (వాకుడు)
 ఓం ఉమా పుత్రాయ నమ:  బిల్వపత్రం సమర్పయామి  (మారేడు)
 ఓం  గజాననాయనమ:  దూర్వాయుగ్మం సమర్పయామి (రెండు గరికలు)
 ఓం హరసూనవే నమ:  దత్తూర పత్రం సమర్పయామి  (ఉమ్మెత్త)
 ఓం లంబోదరాయ నమ:  బదరీ పత్రం సమర్పయామి  (రేగు)
 ఓం గుహాగ్రజాయనమ:  అపామార్గ పత్రం సమర్పయామి (ఉత్తరేణి)
 ఓం గజకర్ణాయనమ:  తులసీ పత్రం సమర్పయామి (తులసి)
 ఓం ఏకదంతాయనమ:  చూతపత్రం సమర్పయామి (మామిడి)
ఓం వికటాయనమ:  కరవీర పత్రం సమర్పయామి  (గన్నేరు)
ఓం భిన్నదంతాయనమ:  విష్ణుక్రాంత పత్రం సమర్పయామి  (విష్ణుక్రాంతి)
ఓం వటవే నమ:  దాడిమీ పత్రం సమర్పయామి  (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమ: దేవదారు పత్రం సమర్పయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమ: మరువక పత్రం సమర్పయామి (మరువం)
ఓం హేరంబాయ నమ: సింధువార పత్రం సమర్పయామి (వావిలి)
ఓంశూర్పకర్ణాయనమ: జాజీపత్రం సమర్పయామి (జాజి)
ఓం సురాగ్రజాయనమ:  గండకీ పత్రం సమర్పయామి (ఏనుగుచెవి ఆకు)
ఓం ఇభవక్త్రాయ నమ: శమీ పత్రం సమర్పయామి (జమ్మి)
ఓంవినాయకాయ నమ: అశ్వత్థ పత్రం సమర్పయామి (రావి)
ఓం సురసేవితాయ నమ: అర్జున పత్రం సమర్పయామి (మద్ది)
ఓం కపిలాయ నమ: అర్క పత్రం సమర్పయామి (జిల్లేడు)
శ్రీ గణేశ్వరాయ నమ: ఏక వింశతి పత్రాణి పూజయామి



శ్రీ విఘ్నేశ్వర అష్టోతర శతనామావళి :

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నారాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్త్వెమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖ నిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహా కాలాయ నమః

ఓం మహా బలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబ జఠరాయ నమః

ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళ స్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాఙ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వ నేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం అశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వ కర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః

ఓం సర్వ సిద్ధయే నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవన ప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్త జీవితాయ నమః

ఓం జిత మన్మథాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నెర సేవితాయ నమః

ఓం గంగా సుతాయ నమః

ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్త నిథయే నమః

ఓం భావ గమ్యాయ నమః

ఓం మంగళ ప్రదాయ నమః

ఓం అవ్వక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్య ధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః

ఓం సరసాంబు నిథయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖాలాయ నమః

ఓం సమస్త దేవతా మూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘాత కారిణే నమః

ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణ గురవే నమః

ఓం ఉన్మత్త వేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)


దూర్వాయుగ్మ పూజ:  (21గరికపోచలతో ఈపూజ చేయవలెను. క్రింది పది నామములు చదువుతూ ప్రతి నామమునకు “దూర్వాయుగ్మం” అనగా రెండేసి గరికపోచలు సమర్పించవలెను.)

ఓం గణాధిపాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఉమాపుత్రాయనమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం అఘనాశనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం వినాయకాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం ఈశపుత్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
7.ఓం ఏకదంతాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి

ఓం ఇభవక్త్రాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
ఓం మూషక వాహనాయ నమ: దూర్వాయుగ్మం సమర్పయామి
10.ఓం కుమారగురవే నమ: దూర్వాయుగ్మం సమర్పయామి

ధూపం:

మం: || యత్పురుషం వ్యదధు: కతిధావ్యకల్పయన్, ముఖం కిమస్య కౌబాహూ, కావూరూ పాదా ఉచ్యేతే ||

శ్లో: || వనస్పతిరసై ర్దివ్యై ర్నానాగన్ధై స్సుసంయుతమ్– ఆఘ్రేయస్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ||

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం – ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ
శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: ధూపమాఘ్రాపయామి.(అగరవత్తులు వెలిగించి వినాయకునికి ధూపము చూపించవలెను.)

దీపం:

మం: || బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బాహూరాజన్య: కృత: ఊరూతదస్య యద్వైశ్య: పద్భ్యాగ్ం శూద్రో అజాయత ||
శ్లో: || సాజ్యం త్రివర్తి సంయుక్తంవహ్ని నాయోజితం ప్రియం, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: దీపం దర్శయామి(దీపమునకు నమస్కరించి వినావకునికు చూపించవలెను.)

ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.(నీరువదలవలెను.)


నైవేద్యం:

మం: || చంద్రమా మనసోజాత: చక్షోస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ పాణాద్వాయురజాయత ||

శ్లో:  || సుగన్ధా స్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాందేవ చణముద్గై: ప్రకల్పితాన్ ||

భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.

(ఒక పళ్ళెములో పళ్ళు, పాలు, నీళ్ళతో పాటు చేసిన పిండి వంటలు, వంటలు కొంచెంకొంచెము ఉంచి, నీళ్ళు చల్లుతూ తర్వాత పళ్ళెము చుట్టూ నీరు త్రిప్పుచూ వినాయకునికి నైవేద్యం చూపించవలెను.)

ఓం భూర్భువస్సువ: ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య దీమహి ధియో యోన: ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి.

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కల్పోక్త నైవేద్యం సమర్పయామి.

ఓం ప్రాణాయ స్వాహా  ఓం అపానాయ స్వాహా  ఓం వ్యానాయస్వాహా  ఓం ఉదానాయ స్వాహా  ఓం సమానాయ స్వాహా  మధ్యేమధ్యే పానీయం సమర్పయామి

అమృతాపి ధానమసి, ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
(3సార్లు కొంచెం కొంచెం నీరు వదలవలెను.)

తాంబూలం:

మం: || నాభ్యా ఆసీదన్తరిక్షమ్  శీర్ష్ణో ద్యౌస్సమవర్తత  పద్భ్యాగ్ం భూమిర్దిశశ్రోత్రాత్  తధాలోకాగ్ం అకల్పయన్ ||

శ్లో: || పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం  ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||

(5తమలపాకులు, 2వక్కలు వినాయకుని వద్ద ఉంచి నమస్కరించవలెను.)


నిరాజనం:

 (కర్పూరం వెలిగించి ఈ క్రింది విధముగా చదువుతూ గంటమ్రోగించవలెను.)

మం: || వేదాహమేతం పురుషం మహాంతం, ఆదిత్యవర్ణం తమసస్తుపారే, సర్వాణి రూపాణి విచిత్య ధీర: నామాని కృత్వా అభివదన్ యదాస్తే ||

 సమ్రాజంచ విరాజంచాభి శ్రీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్ర స్యయాముఖే, తయామాసగ్ం సృజామ: సంతతశ్రీరస్త్రు, సమస్త సన్మంగళాని భవంతు

నిత్య శ్రీరస్త్రు నిత్యమంగళానిభవంతు

శ్లో: || ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తధా నీరాజనం మయాదత్త గృహాణ వరదోభవ ||

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

(పళ్ళెములో నీరు వదలవలెను.)

మంత్రపుష్పం
(చేతిలో పువ్వులు, అక్షతలు తీసుకుని క్రింది విధముగా చదువుతూ నమస్కరించవలెను.)

మం: || ధాతా పురస్తాద్యముదాజహార, శక్ర:ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్ర: తమేవం విద్వానమృత ఇహ భవతి, నాన్య: పంధా అయనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం వశ్వశంభువం ||

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలు, పుష్పములు వినాయకుని పాదములపై ఉంచవలెను.)

పునరర్ఘ్యం:

శ్లో: || అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్ద్గం పాపనాశన. ||
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: పునరర్ఘ్యం సమర్పయామి. (నీరు వదలవలెను.)

ఆత్మప్రదక్షిణ:

(అక్షతలు, పువ్వులు తీసుకుని కుడిచేతిమీదుగా తమచుట్టూ తాము తిరుగుతూ ఈక్రింది విధముగా చదువవలెను)

శ్లో:  || యానికానిచపాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపాహం పాప కర్మాణా పాపాత్మా పాప సంభవ:
అన్యధశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష వినాయక. ||

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. (అక్షతలు, పువ్వులు వినాయకుని పాదముల చెంత ఉంచవలెను.)

సాష్టాంగం:

మం: || ఉరసా శిరసా దృష్ట్యామనసా వచసాతధా  పద్భ్యా కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ||

శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: సాష్టాంగ నమస్కారం సమర్పయామి.

(సాష్టాంగ నమస్కారం అనగా ఎనిమిది అంగములతో చేయు నమస్కారము. అనగా 1.వక్షము 2.శిరస్సు 3. కండ్లు  4. మనస్సు5. వాక్కు  6. పాదములు

చేతులు  8. చెవులు. పురుషులు మాత్రమే పూర్తిగా సాగిలపడిచేయవలను.)
రాజోపచారములు: ఛత్రం సమర్పయామి, చామరంవీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, దర్పణం దర్శయామి,అశ్వానారోహయామి,గజానారోహయామి, రధానారోహయామి,ఆందోళికాది సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ మనసా సమర్పయామి. (పుష్పములను సమర్పించవలెను.)

శ్లో: ||  యస్య స్మృత్యాచ నమోక్త్యా తప: పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే వివాయక.

 మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక యత్పూజితం మయాదేవపరిపూర్ణం తదస్తుతే. ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజయాంచ,భగవాన్ సర్వాత్మక శ్రీ వరసిద్ధి వినాయక దేవతా సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు.

అపరాధ క్షమార్పణ:

శ్లో: 1.  అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయాదాసోయమితి మాంమత్వాక్షమస్వ పరమేశ్వర.

 ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వర సర్వాపరాధాన్ క్షమధ్వం
శ్రీ వరసిద్ధి వినాయక దేవతాప్రసాదం శిరసా గృహ్ణామి.(పూజ చేసిన పుష్పములు, అక్షతలు తీసుకొని శిరస్సున ధరించవలెను.)

                                            వ్రతం సువ్రతమస్తు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ప్రసాదేన సర్వకార్యేషు సర్వదా దిగ్విజయమస్తు.

ఉద్వాసన మంత్రం:

(వినాయక ప్రతిమ ఉంచిన పీటను చేతితో పట్టుకొని క్రింది మంత్రము చదువ వలెను.)

మం: || యజ్ఞేన యజ్ఞ మయజంతదేవా  తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహినానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవా: శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమ: యధాస్థానముద్వాసయామి. ||

                                                              హరి: ఓం తత్సత్

                                                              బ్రహ్మార్పణమస్తు

          (ఇంతటితో వినాయకుని పూజావిధానము పూర్తి అయినది.)





శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ:

(అక్షతలు చేతిలో తీసుకొని కధ చదువవలెను.)

శూతుడు అను ఋషి శౌనకాది మునులకు వరసిద్ధివినాయక వ్రతమును గురించి చెప్పెను.

వినాయకుడు అనగా దుష్టులను, విఘ్నములను అదుపులో పెట్టువాడు అని అర్ధము. ఇతడు విద్యాధిదైవతము గాను, వ్రాయుట అను పద్ధతిని ఆరంభించిని దైవము గాను పూజింపబడు చున్నాడు.

విఘ్నేశ్వరుని పుట్టుక: 

పూర్వం గజముఖుడైన అసురుడు పరమేశ్వరుని మెప్పించి కోరరాని వరముకోరి, తను అజేయుడుగా, ఎవరూ వధింపరాని విధంగా ఉండుటకై పరమశివుని తన ఉదరమునందు నివసించాలని వరము పొందినాడు. అది విన్న పార్వతీదేవి కలతచెంది శ్రీ మహావిష్ణువును ప్రార్ధింపగా,నందీశ్వరుని గంగిరెద్దుగా, తాను గందిరెద్దును ఆడించేవానిగా వేషము ధరించి,గంగిరెద్దును గజాసురుని ఎదుట చిత్రవిచిత్రముగా ఆడించి ఆ అసురుని మెప్పించి, ఆఅసురుని ఉదరకుహరమందున్న పరమశివుని కోరినాడు.  అంత విష్ణుమాయను గ్రహించి,తనకు చేటుకాలము దాపురించిందని తలచి, శివుని ఉద్దేశించి, గజాసురుడు  ” ప్రభూ! శ్రీ హరి ప్రభావముచే నాజీవితకాలము ముగియనున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోకములు పూజించునట్లు, నాచర్మమును నిరంతరము నీవు ధరించునట్లు వరము నిమ్మని తన శరీరమును నందీశ్వరునకు వశము చేసి శివునకు తన ఉదరకుహరమునుండి విముక్తిని ప్రసాదించినాడు.  చాలాకాలమునకు శివుడు తిరిగి కైలాసమునకు వచ్చుచున్నాడన్న శుభవార్త తెలిసిన పార్వతీదేవి సర్వాలంకారభూషితురాలై భర్తను స్వాగతింపదలచి, అభ్యంగనస్నాన

మాచరించుటకుసిద్ధమై, నలుగుపిండితో ఒక బాలునిబొమ్మను చేసి, దానికి ప్రాణప్రతిష్ట చేసి,లోపలికి ఎవరూ రాకుండా వాకిలి వద్ద కాపలా ఉంచెనుఅంత సంతోషముతో పార్వతి చెంత చేరాలని వస్తున్న పరమేశ్వరుని గాంచిన ఆ బాలుడు అభ్యంతరమందిరమందు నిలువరించగా, పరమేశ్వరుడు ఆగ్రహము పట్టలేక ఆ బాలుని శిరమును ఖండించి మందిరము లోనికి ఏగినాడు. మాటలసందర్భంలో బాలుని ప్రసక్తి రాగా జరిగిన ఘోరముతెలుసుకొన్న పార్వతీదేవిని శివుడు ఓదార్చి, ఉత్తరదిశగా తలపెట్టి నిద్రించుచున్న ప్రాణి తలను తెచ్చి ఆ కుర్రవాని మొండెమునకు అతికింపుమని తన పరివారమునకు ఆదేశించెను. వారు ఉత్తరముగా పరుండిన ఒక ఏనుగు తలను తిచ్చి ఆబాలుని మొండెమునకు

అతికించిరి. అప్పుడు శివుడు ప్ర్రాణప్రతిష్ట చేయగా ఆబాలుడు గజాననుడైనాడు.  గజాననుడు తల్లిదండ్రులకు భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక మూషికమును వాహనముగా చేసికొనెను. కొంతకాలమునకు పార్వతిపరమేశ్వరులకు కుమారస్వామి జనియించెను.  అంత మహేశ్వరుడు కుమారులతో “ఇరువురిలో ఎవరు ముల్లోకములందలి

పుణ్యతీర్ధములందు స్నానమాచరించి ముందుగా తనను చేరుదురో వారికి ఆధిపత్యము యిత్తుననెను. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనమునధిరోహించి, వాయువేగమున బయలువెడలెను. గుజ్జురూపమున నున్న గజాననుడు తన మూషకవాహనంపై తండ్రి పెట్టిన పోటి నెగ్గడం అసాధ్యమని గ్రహించి, కాస్త ఆలోచించి, ఈ పోటీ తన గురించి పెట్టినట్లు గ్రహించి, గజాననుడు భక్తితో ముమ్మారు తల్లిదండ్రులకు,ప్రదక్షిణ నమస్కారాలాచరించి ప్రణమిల్లాడు. అక్కడ కుమారస్వామి ఏ తీర్ధమునకు పోయిననూ అన్నగారు తనకన్న ముందు ఉండటం చూసి, ఆశ్చ్రర్యమునొంది, కైలాసమునకు చేరగానే తల్లిదండ్రులకు ప్రణమిల్లుతున్న అన్నగారిని చూసి, జరిగినది తెలుసుకొని, తన అహంకారమును నిందించుకొని, తండ్రితో అన్నయ్యకే గణాధిపత్యమును ఒసంగమనెను.  మహేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి తిధియందు గజాననునకు విఘ్నాధిపత్యమునొసంగెను.  ఆ దినమున గజాననుడు సర్వజనులు భక్తిశ్రద్ధలతో చేసినపూజను గ్రహించి, కుడుములు, ఉండ్రాళ్ళు ,పళ్ళు మొదలుగా గల ఎన్నో రకాలు నైవేద్యాలను ఆరగించి, కైలాసమునకేగి, తల్లితండ్రులకు పాదాభివందనం చేయడానికి ఎంతో కష్ట పడుతున్న వినాయకుని చూసి పరమశివుని శిరమునందలి చంద్రుడు వికటముగానవ్వెను. అంత రాజదృష్టి శోకిన రాళ్ళు కూడ నుగ్గవునను సామెత ననుసరించి, విఘ్నేశ్వరుని ఉదరము పగిలి కుడుములచట ఎల్లెడల ద్రొల్లెను. అంత పార్వతీ దేవి శోకించుచు చంద్రుని చూచి, ” పాపాత్మా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను. కావున నిన్ను చూచినవారు నీలాపనిందలు పొందుదురుగాక.” అని శపించెను. ఆ సమయమును సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమభార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి.  అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున క్షీణించుచుండ అంతస్వాహాదేవి అరుంధతిరూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపములను తానే ధరించి, భర్తకు ప్రియమును కలుగచేసెను. అయితే ఋషులు  అగ్ని దేవునితో ఉన్నది తమ భార్యలేనని భావించి, వారిని పరిత్యజించినారు. పార్వతీదేవి శాపానంతరము చంద్రుని చూచుటవల్లే తమకిట్టి నీలాపనిందలు కలిగెనని గ్రహించి, వారు బ్రహ్మదేవుని కడకేగి, జరిగినది విన్నవించి ప్రార్ధింపగా బ్రహ్మదేవుడు ఋషులతో వారి పత్నుల తప్పు ఏమియు లేదని తెలిపి, వారితో కూడ బ్రహ్మ కైలాసమునకు ఏతెంచి, ఉమామహేశ్వరులను సేవించి, మృతుడై ఉన్న వినాయకుని బ్రతికించెను. అంత దేవాదులు,” పార్వతీ దేవి! నీవిచ్చిన శాపవశమును లోకములకెల్ల కీడు వాటిల్లెను. కావున దానిని ఉపసంహరింపమని ప్ర్రార్ధింప అంత పార్వతీ దేవి , “ఏనాడు వినాయకుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినము చంద్రుని చూడరాదు.” అని శాపావకాశము నొసెంగెను. అంత వారందరు వారి గృహమలకేగి భాద్రపద శుద్ధచవితి నాడు చంద్రుని చూడక జాగరూకతతో సుఖముగా నుండిరి.ఇట్లు కొంత కాలము గడిచెను. అందువల్ల అతడు గణపతి అయ్యొను. అటులనే విఘ్నములకు కూడా ఆధిపత్యము ఒసగుటవలను విఘ్నేశ్వరుడైనాడు.  ఈ ఆధిపత్యములు స్వీకరించిన రోజు,తాను జన్మించినరోజు భాద్రపద శుద్ధ చవితి కనుక ఆరోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమతమ అభీష్టములు పొందెదరు. శ్యమంతకోపాఖ్యానము: ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్ముని నారదుడుదర్శించి స్తుతించుచు ప్రియసంభాషణ జరుపుచు, ” స్వామీ! సాయంసమయమాయెను. ఈనాడు విఘ్నేశ్వర చతుర్ధి గాన పార్వతీశాపముచే చంద్రుని చూడరాదు. కాన సెలవివ్వవలసింది.” అని నారదుడు వెడలగానే ద్వారకయందు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదు. అనిచాటింపు వేయించెను. ఆనాటి రాత్రి క్షీరప్రియుడగుటచే శ్రీకృష్ణుడు మింటికి చూడకనే గోష్టమునకు పోయి పాలుపిదుకుచు పాలలో చంద్ర ప్రతిబింబము గాంచి, “ఆహా! నాకిక ఎట్టి ఆపద రానున్నదో” అని సంశయించెను.

 వృష్ణి వంశీయుడగు నిమ్నుడను వానికి ప్రసేనుడు, సత్రాజిత్తు అను యిరువురు కొడుకులు ఉండెడివారు. సత్రాజిత్తు సూర్యదేవుని ఆరాధించి,సూర్యుని  మెప్పించి,అత్యంత ప్రకాశవంతమైన రోజుకి ఎనిమిది బారువుల బంగారము నిచ్చునట్టి శ్యమంతకమణి అను ఒక దివ్యమైన మణిని వరంగా పొందెను.ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణదర్శనార్ధము ద్వారకకు విచ్చేసిన సత్రాజిత్తు ద్వారా మణి మహిమను తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ మణిని ద్వారకను పాలిస్తున్న ఉగ్రసేన మహారాజుకు కానుకగా యిమ్మనెను. సత్రాజిత్తు అందుకు నిరాకరించెను. కొంతకాలమునకు ప్రసేనుడు అశుచిగా ఉండి మణిని ధరించి వేటకు వెడలెను.మహామహిమాన్వితమైన ఆమణిని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయము వాటిల్లగలదు. ఒక సింహము అది ఒక మాంసఖండముని భ్రమసి ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహింపగా జాంబవంతుడను భల్లూకరాజు సింహమును చంపి  మణిని తీసుకొనిపోయి తన కుమార్తె అయిన జాంబవతికి ఆటవస్తువుగా యిచ్చెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మరణవార్త విని,  “శ్రీకృష్ణుడు మణినీయనందులకు తనసోదరుని చంపి మణిని అపహరించెను”. అని చాటించెను. అది విని శ్రీకృష్ణుడు నాడు క్షీరమున చంద్రబింబ దర్శనదోషంబని తలచి దానిని నివారించుకొనుటకు తనపరివారముతో అరణ్యమునకు బయలుదేరి  ప్రసేనుని జాడలు, అతనిని చంపిన సింహపు జాడలు,జాంబవంతుని అడుగుల జాడలు అనుసరించి జాంబవంతుని గుహకు చేరి మణిని తీయునంతలో  జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధమునకు తలపడెను.  యుద్ధము అతిభయంకరముగా ఇరువది ఎనిమిది రోజులు సాగెను. మహాపరాక్రమవంతుడగు జాంబవంతుడు తన బలము  క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణుజొచ్చి శమంతకమణిని, తనకుమార్తె అగు జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించెను.  కృష్ణుడు ద్వారకకు చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతయు వివరించెను.  సత్రాజిత్తు తను ప్రచారము చేసిన అపవాదుకు సిగ్గుపడి తన కుమార్తె అగు సత్యభామను కృష్ణునకు సమర్పించెను.  జాంబవతి, సత్యభామలను పరిణయమాడుతున్న శ్రీకృష్ణుని మునులు, దేవాదులు భక్తిప్రపత్తుల స్తుతించి, శ్రీకృష్ణునితో, ” మీరు సమర్ధులు గాన నీలాపనిందలు బాపుకొంటిరి. మాకేమి గతి ” అని ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితి నాడు పొరపాటున చంద్ర దర్శనమయిన యెడల ఆనాడు గణపతిని యధావిధిని పూజించి ఈ శ్యమంతకమణి కధను విని అక్షతలు శిరమున దాల్చు వారు నీలాపనిందల నొందకుందురు గాక.” అని ఆనతీయ దేవాదులు సంతసించి తమనివాసములకు పోయి ప్రతి సంవత్సరము అందరు తమ తమ శక్త్యానుసారము భాద్రపద శుద్ధ్హ్హ్హ చవితి నాడు గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖముగా నుండిరి. శాపమోక్షప్రకారము వినాయక వ్రతకధను సూతుడు శౌనకాదిమునులకు వినిపించి తన నిజాశ్రమమునకరిగెను.

వినాయక వ్రత మహిమ:

  ఈవ్రతమును అన్నికులములవారు, స్త్రీపురుషులెల్లరూ చేయవచ్చును. భక్తిశ్రద్ధలతో చేసినచో వినాయకుడు వారివారి ప్రయత్నములను సఫలమొనర్చి, విజయము చేకూర్చును.  ఈ వ్రతమును చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును,దమయంతి నలుని పొందిరి. వృత్రాసురుని చంపినపుడు ఇంద్రుడు, సీతను వెదకునపుడు శ్రీరాముడు, గంగను భువికి తెచ్చునపుడు భగీరధుడు, క్షీర సాగర మధనము చేయనపుడు దేవాసురులు, కుష్టు వ్యాధి నివారణకై సోమదేవ మహారాజు ఈ వ్రతము  చేసి తమ ప్రయత్నములో అఖండ విజయమును పొందిరి. అటులనే ఏదేని బృహత్కార్యము తలపెట్టినపుడు వరసిద్ధి వినాయక వ్రతమొనరించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయము సాధింతురు.  వినాయక 

చవితి రోజున చంద్రదర్శనదోషమును పోగొట్టుకొనుటకు ఈ క్రింది శ్లోకము జపించవలెనని ధర్మసింధువునకు ఆదేశము కలదు.

శ్లో:  || సింహ: ప్రసేనమవధీత్ సింహా జాంబవతాహతా:  సుకుమారక మారోధీ:  తవహ్యేష శమంతక: ||

శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకధ సమాప్తము.

స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం  న్యాయేన మార్గేన మహిం మహీశా:   గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం  లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.

మంగళం మహత్

(కధారంభమున పట్టుకొనిన అక్షతలు శిరస్సున ధరించవలెను.)

Thursday, 23 August 2018

శ్రీవరలక్ష్మి వ్రతం SRI VARALAKSHMI VRATHAM

శ్రీవరలక్ష్మి వ్రతం
SRI VARALAKSHMI VRATHAM




(పూజా విధానం )....!!

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1 dazans
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటోల ......................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

పూజా సామాగ్రి :-

దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,
లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూ good call CVలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః


తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.

భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....


    *సర్వేజనాసుఖినోభవతుః*