Search This Blog

Thursday, 8 February 2018

SIVA MAHAPURANAM BY PUJYA BRAMHA SRI CHAGANTI KOTESWARA RAO GARU DAY - 1


SIVA MAHAPURANAM BY
PUJYA BRAMHA SRI CHAGANTI KOTESWARA RAO GARU



'శివ' అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అమరకోశము మనకు సాధికారికమయిన గ్రంథము. దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు. ఆయన అమర కోశముతో పాటు అనేక గ్రంధములను రచించాడు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. అపుడు ఆయనకు బాధ కలిగింది. 'నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను - ాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి' అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశాడు. విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి 'ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?' అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము. అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. అమరసింహుని గ్రంధాన్ని అమరకోశము అని పిలుస్తారు. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు.
శివ అన్నమాటను ఏవిధంగా మనం అర్థం చేసుకోవాలి? అమరకోశంలో దానికి అనేక రకములయిన అర్థములు చెప్పబడ్డాయి. 'శివ' 'శివా' అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి. 'శివ' అంటే శంకరుడు. 'శివా' అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.
అమరకోశములో 'శివః' అంటే - 'శామ్యతి, పరమానంద రూపత్వాన్నిర్వికారో భవతి యితి శివః' - శివుడు నిర్వికారుడు. మనకు వికారములు ఉంటాయి. జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి. వీటిని షడ్వికారములు అంటారు. ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి. ఆరు వికారములు లేనిది ఏదయినా ఉన్నదా? ఉన్నది. అదేశివ’. ఆయన నిర్వికారమై, నిరంజనమై ఉంటాడు. ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడదు. వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనపడుతుంది. కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనపడడు. మరి ఈయనకు రూపం తీసుకు వచ్చి చూస్తే ఎలా ఉంటాడు?
అమరకోశంలో అమరసింహుడు ఆయనను 'పరమానంద రూపత్వ' అంటాడు. ఆయన ఎప్పుడూ పరమానందమును పొందుతూంటాడు అని చెప్పాడు. మన అందరికీ సుఖదుఃఖములు అనే బంధములు ఉంటాయి. ఎల్లకాలం అన్నివేళలా ఆనందముతో ఉండము. ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు. పరమానందము అనేది బయటవున్న వస్తువులలో లేదు. లోపలే ఉంది. ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు. దానిని నోటితో చెప్పడం కుదరదు. పద్మాసనం వేసుకుని అరమోడ్పు కన్నులతో వుంది తనలో తాను రమిస్తూ కనపడుతూ ఉంటాడు. అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము. నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే 'శివ'. ఆనంద ఘనమే పరమాత్మ. కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలోతాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు. ఆయనకు మనస్సులో కదలిక ఉండదు.
మనం అందరం కూడ కదులుతున్న తరంగములతో కూడిన సరోవరములలాంటి వారము. మనం ఉదయం నిద్రలేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మనుండి విడివడుతుంది. వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది. చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదానివెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుఖములకు, దుఃఖములకు కూడ హేతువులు అవుతుంటాయి. ఇటువండి సంకల్పములకు అతీతుడై సంకల్పములు దేనిలోనుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై, ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ. వాడు శంకరుడు. ఆయనే శివుడు. ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు. అటువంటి ఆనంద ఘనమునకు 'శివ' అని పేరు. అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మనుష్య జన్మ ప్రయోజనము. దానికే మోక్షము అని పేరు. అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్యడైవము. అమరకోశంలో 'శేరతే సజ్జనమనాం స్యస్మిన్నితి' - ఈయన యందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది. శివ స్వరూపమును పట్టుకుంటే అది ఏరూపంగా రకంగా విభూతితో లక్షణంతో గుణంగా మీ మనస్సు యిష్టపడిన దానితో మీరు రమించి పోవడం ప్రారంభించినా, అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది. అది ఇవ్వగలదు. దానికి శక్తి ఉన్నది. అది మిమ్మల్ని కాపాడుతుంది. పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను పరమాత్మే తీరుస్తాడు. ఆయన మనకు దేనినయినా యివ్వగల సమర్ధుడు. మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరికున్నదేదీ ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు. అదీ ఆయన గొప్ప! మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి. మీరు అడిగితే యిచ్చినవాడు గొప్పవాడు కాదు. మీరు వెళ్లి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారి పోయినట్లు అయిపోతుంది. ఒకరి దగ్గరకు వెళ్లి వాచికంగా 'నాకిది యిప్పించండి' అని అడగడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది. శీలం ఉన్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియ పడిపోతాడు. అడగలేడు. అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకునే వారు. అది వాళ్ళ రోషమునకు చిహ్నము. వాని రోషమునకు, శీలమునకు వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు. మీరు శివ స్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు.
అమరకోశంలో అమరసింహుడు శివ శబ్దమునకుసజ్జనుల మనస్సు రమించే స్వరూపం కలిగిన వాడుఅని అర్థం. అది ఎలా రమిస్తుంది? దేనివలన? దానికి కారణము, కారణము అని చెప్పడం కుదరదు. మీకు మనస్సు ఉంటె భక్తీ ఉంటె ఒక్క కారణం చాలు. ఏదో ఒక కారణంతో శివుడియందు మనస్సు రమిస్తే వానికి సమస్తమయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు. కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది.
అమరకోశంలో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ - 'చేతే సజ్జన మనాంసి ఇతివా' - సాధువుల మనస్సునందు తానుండు వాడు. ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివునియందు పెట్టారు. లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి హరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరి మనస్సు శివనామము పట్టుకొని రమించిపోతున్నదో, ఎవరు శృతి ప్రమాణముచేత పరవశించి పోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు. అనగా ఆయనే శివుడయిపోయి ఉంటాడు.
అమరకోశంలో శివునకు చెప్పిన వ్యాఖ్యానమును పరిశీలించినట్లయితే శివుడిని రకంగానయినా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది. శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది. ‘నమశ్శివాయఅనేది పంచాక్షరీ మంత్రము. ‘నమశ్శివాయఅనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది.
మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.
త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు. ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే మూడు వేదములలో మధ్యలో వున్నది యజుర్వేదము. యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి. మరల యిందులో మధ్యప్రాకారము నాల్గవ కాండ. ముందు మూడు, వెనుక మూడు ఉండగా, మధ్యలో నాల్గవది వుంది. నాల్గవ కాండలో రుద్రాధ్యాయం ఉంది. రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది. అష్టమానువాకమును మీరు చదివినట్లయితే -
నమస్సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ అరుణాయ
నమశ్శంజ్గాయ పశుపతయే నమ ఉగ్రాయ భీమాయ
నమో అగ్రేవధాయ దూరేవధాయ నమో హన్త్రే హనీయ సే
నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ స్తారాయ నమశ్శంభవే మయోభవే
నమశ్శంకరాయ మయస్కరాయ నమశ్శివాయ శ్శివతరాయచ!!( శ్రీ రుద్రాధ్యాయం - అష్టమానువాకం-1 - 11)
అష్టమానువాకం చివరి పాదంలో 'నమశ్శివాయ ' అనే పదమును పెట్టారు. నమశ్శివాయ ' ముందు 'మయస్కరాయ ' అని ఉంచారు. 'మయస్కరాయ ' అంటే గురువు. గురూపదేశంతో పంచాక్షరిని పొందాలి. గురువుల పరంపరలో మొట్టమొదట శివనామమును ప్రచారం చేసి అద్వైతసిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదూ మరెవరో కాదు, సాక్షాత్తు శంకరుడే! ఎలా చెప్పగలరు? విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది. 'నమః కపర్దినే వ్యుప్త కేశాయ ' అని. 'కపర్దినే ' అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. 'వ్యుప్తకేశాయ ' అంటే అసలు వెంట్రుకలు లేని వాడు. మొత్తం పూర్ణ ముండనం చేయించుకొని ఉన్నవాడు. అలా ఎలా కుదురుతుంది? పక్కనే వున్నా నామంలో పెద్ద జటాజూటం వున్నట్లు చెప్పబడింది. పక్కనే వున్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో వున్నవాడు. రెండూ ఎలా సమన్వయము అవుతాయి? గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడయినా చెప్పారా? దీనికి వ్యాసభగవానుడు వాయుపురాణంలో 'శివుడు గుండుతో ఉన్నాడు' అని చెప్పారు. మరి గుండుతో శివుడు ఎక్కడ వున్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు. పూర్ణ ముండనం చేయించుకున్న శివ స్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది? వాయు పురాణంలో వ్యాస భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు -
'చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి'
'నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో వుండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనపడుతున్నాడో ఆయనే పరమశివుడు' అని చెప్పబడింది. ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయపు బట్ట గుండు మీద వేసుకొని, చేతిలో వేదములు పట్టుకొని యిలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు? శంకరాచార్య స్వామి వారు.
నమః కపర్దినే - పరమశివుడు. వ్యుప్తకేశాయ - శంకరాచార్యుల వారు కాబట్టి శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ - శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు గురుపరంపరే నడుస్తున్నది.
ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.
కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!
అటువంటి శంకర భగవత్పాదులై భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనంయివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!
అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివఅనేమాట ఎంత గొప్పదో, ‘శివంఅన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.

Wednesday, 24 January 2018

Suryanaryana Dandakam - సూర్య నారాయణ దండకం




 Suryanarayana Dandakam సూర్య నారాయణ దండకం


శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ 2సార్లు
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!

పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!

జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!

దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!

శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!

Suryanarayana Namalu




🌸🌞🌸🌞🌸🌞🌸🌞🌸🌞🌸
మాఘ మాసపు ఆదివారాలు మహత్తు కలవి. ఈనాళ్ళలో *సూర్య ఆరాధన* తప్పకుండా చేయాలంటారు. అంతేకాక సూర్యుడు మకరరాశిలో సంచరించే మాఘమాసపు ప్రతీరోజూ కూడా అత్యంత విశేషమైనది!

_శ్రీమద్వాల్మీకి రామాయణం యుద్ధకాండంలోని *ఆదిత్యహృదయ* స్తోత్రంలో శ్రీరామునికి అగస్త్యమహర్షి ఉపదేశించిన అత్యంత మంగళప్రదమైన *125 సూర్యనామాలు* వున్నాయి, వాటికి *"నమః"* చేర్చితే సూర్య మంత్రాలు. ప్రతీరోజూ ప్రాతఃస్నానం ఆచరించి సూర్యోదయ సమయానికి ముందు 5నిముషాల ముందు  చదవడం మొదలు పెట్టి సూర్యోదయ సమయానికి ఈ 125 నామాలు పూర్తిచేయ గలిగితే అత్యంత శుభదాయకం._
🌅🌅🙏🌅🌅

1.రశ్మిమతే నమః
2.సముద్యతే నమః
3.దేవాసుర నమస్కృతాయ నమః
4.వివస్వతే నమః
5.భాస్కరాయ నమః
6.భువనేశ్వరాయ నమః
7.సర్వదేవాత్మకాయ నమః
8.తేజస్వినే నమః
9. రశ్మిభావనాయ నమః
10.దేవాసురగణ లోకపాలాయ నమః

11.బ్రహ్మణే నమః
12.విష్ణవే నమః
13.శివాయ నమః
14.స్కందాయ నమః
15.ప్రజాపతయే నమః
16.మహేంద్రాయ నమః
17.ధనదాయ నమః
18.కాలాయ నమః
19.యమాయ నమః
20. సోమాయ నమః

21.అపాం పతయే నమః
22.పితృదేవతాయ నమః
23.వసుమూర్తయే నమః
24.సాధ్యమూర్తయే నమః
25.అశ్విమూర్తయే నమః
26.మరున్మూర్తయే నమః
27.మనవే నమః
28.వాయుమూర్తయే నమః
29.వహ్నయే నమః
30.ప్రజారూపాయ నమః

31.ప్రాణాయ నమః
32.ఋతుకర్త్రే నమః
33.ప్రభాకరాయ నమః
34.ఆదిత్యాయ నమః
35.సవిత్రే నమః
36.సూర్యాయ నమః
37.ఖగాయ నమః
38.పూష్ణే నమః
39.గభస్తిమతే నమః
40.సువర్ణసదృశాయ నమః

41.భానవే నమః
42.హిరణ్యరేతసే నమః
43.దివాకరాయ నమః
44.హరిదశ్వాయ నమః
45.సహస్రార్చిషే నమః
46.సప్తసప్తయే నమః
47.మరీచిమతే నమః
48.తిమిరోన్మథనాయ నమః
49.శంభవే నమః
50.త్వష్ట్రే నమః

51.మార్తండకాయ నమః
52.అంశుమతే నమః
53.హిరణ్యగర్భాయ నమః
54.శిశిరాయ నమః
55.తపనాయ నమః
56.అహస్కరాయ నమః
57.రవయే నమః
58.అగ్నిగర్భాయ నమః
59.అదితేః పుత్రాయ నమః
60.శంఖాయ నమః

61.శిశిరనాశనాయ నమః
62.వ్యోమనాథాయ నమః
63.తమోభేదినే నమః
64. ఋగ్యజుఃసామపారగాయ నమః
65. ఘనవృష్టయే నమః
66. అపాంమిత్రాయ నమః
67. వింధ్యవీథీ ప్లవంగమాయ నమః
68. ఆతపినే నమః
69. మండలినే నమః
70. మృత్యవే నమః

71. పింగళాయ నమః
72. సర్వతాపనాయ నమః
73. కవయే నమః
74. విశ్వస్మై నమః
75. మహాతేజసే నమః
76. రక్తాయ నమః
77. సర్వభవోద్భవాయ నమః
78. నక్షత్రగ్రహతారాధిపాయ నమః
79. విశ్వభావనాయ నమః
80. తేజసామపి తేజస్వినే నమః

81. ద్వాదశాత్మనే నమః
82. పూర్వాయ గిరయే నమః
83. పశ్చిమాద్రయే నమః
84. జ్యోతిర్గణానాం పతయే నమః
85. దినాధిపతయే నమః
86. జయాయ నమః
87.జయభద్రాయ నమః
88. హర్యశ్వాయ నమః
89. సహస్రాంశవే నమః
90. ఆదిత్యాయ నమః

91. ఉగ్రాయ నమః
92. వీరాయ నమః
93. సారంగాయ నమః
94. పద్మప్రబోధాయ నమః
95. ప్రచండాయ నమః
96. బ్రహ్మేశానాచ్యుతేశాయ నమః
97. సూర్యాయ నమః
98. ఆదిత్యవర్చసే నమః
99.  భాస్వతే నమః
100. సర్వభక్షాయ నమః

101.రౌద్రవపుషే నమః
102.తమోఘ్నాయ నమః
103.హిమఘ్నాయ నమః
104.శత్రుఘ్నాయ నమః
105.అమితాత్మనే నమః
106.కృతఘ్నఘ్నాయ నమః
107.దేవాయ నమః
108.జ్యోతిషాంపతయే నమః
109.తప్తచామీకరాభాయ నమః
110.హరయే నమః

111.విశ్వకర్మణే నమః
112.తమోభినిఘ్నాయ నమః
113.రుచయే నమః
114.లోకసాక్షిణే నమః
115.భూతనాశాయ నమః
116.భూతస్రష్ట్రే నమః
117.ప్రభవే నమః
118.పాయతే నమః
119.తపతే నమః
120. వర్షతే నమః

121.సుప్తేషు జాగ్రతే నమః
122.భూతేషు పరినిష్ఠితాయ నమః
123.అగ్నిహోత్రాయ నమః
124.అగ్నిహోత్ర ఫలప్రదాయ నమః
125.పరమసమర్ధాయ భగవతే బ్రహ్మణే నమః


Monday, 15 January 2018

Tiruppavai - తిరుప్పావై 30వ రోజు పాశురము




తిరుప్పావై 30వ రోజు పాశురము

వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిరైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిర్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువగుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్

తిరుప్పావై ముప్పైవ రోజు సంక్రాంతి. సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండగ. మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ప్రకృతిలో వసంత ఋతువు ఆహ్లాదాన్ని ఇచ్చినా, ఈ కాలం మనకు పంటలతో ఒక నిండు తనాన్ని కల్గించే కాలంగా మనం అనుభవిస్తుంటాం. నెలరోజులు ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి, తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేంచేసి ఉన్న శ్రీరంగనాథుణ్ణి వివాహమాడాలని అనుకుంది. తత్ ఫలితంగా శ్రీవెల్లిపుత్తూర్ నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహమాడాడు. గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి పొందిన రోజుని భోగి అంటారు. రంగనాథుణ్ణి భోగరంగడు అని అంటారు. భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు. భోగి దాటిన మరునాడే సంక్రాంతి. తరువాత రోజు కనుమ. ఈ మూడు రోజులు కలిపితే ఒక అందమైన పండగ.

దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణం వస్తుంది. దక్షిణాయనం దేవతలు రాత్రి, ఉత్తరాయణం పగలు. రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకంలో ప్రవర్తిస్తుంటాం. మనలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇక రాత్రి నివృత్తి అయ్యినట్లుగనే దేవతలకు ఉత్తరాయణం ప్రవృత్తి ఇక దక్షిణాయణం నివృత్తి. దేవతలు మేల్గాంచి ఉన్నప్పుడు మనుష్యులలో దైవీ శక్తులు మేలుకొని ఉంటాయి, దక్షిణాయనంలో అసురీ ప్రవృత్తులు మేలుకొని ఉంటాయి. రోజులో బ్రహ్మ ముహూర్తం ఎట్లా అయితే తెల తెల వారే సమయంలో ఉంటుందో, ధనుర్మాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది, ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేట్టు చేస్తుంది. ఈ భావనతోనే మనం ధనుర్మాస వ్రతం ఆచరిస్తాం. తిరుప్పావై ఒక్కో పాశురాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని తయారుచేసుకుంటాం, తద్వార చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా చూడాలి, మన చుట్టు ఉండే సమాజంతో ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది. మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది. మంచి మార్గంలో అడుగు పెట్టడం అన్నమాట, క్రాంతి అంటే అడుగు పెట్టడం, సం అంటే మంచిగా అని అర్థం. ఈ రకంగా మంచిగా బ్రతకటానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది "సంక్రాంతి" అయ్యింది.

సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయం కూడా, ధనుఃరాశి నుండి మకరరాశికి మారుతాడు కనుక కొందరు ఈ రోజు శుభకార్యాలు చెయ్యరు. సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించటానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాదులు చేస్తుంటారు. అందుకే మరునాడు కనుమ పండుగ, తమ బంధువులను, అల్లుల్లను ఇంటికి రప్పించుకొని వివిద సత్కారాలు చేస్తారు. ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం. శ్రీరంగనాథుడు గోదాదేవిని వివాహమాడటంచే విష్ణుచిత్తులవారికి ఆల్లుడైయ్యాడు. శ్రీరంగంలో వివాహం జరిగి, కనుమ నాడు గోదాదేవితో కలిసి శ్రీవెల్లిపుత్తూర్ చేరి ఆరాధన అందుకున్నాడు.

ఇవన్నీ భావించి మన పూర్వులు మనకొక పండగను అందించారు. ఈ పండగలో గొబ్బిల్లను పూజిస్తారు, గొబ్బిల్లు వ్రతం ఆచరించిన గోపికల ప్రతీక. గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు, వేరొకరు వారికి తెలియదు. శ్రీకృష్ణుడు ఏది చెబితే అది వారికి వేదం. ఆయన చెప్పినదాన్ని పాటించాలి అని కోరుకుంటారు. ఈ గోపీ ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుణ్ణి పొందిందో, మనం కూడా భగవత్ ప్రవృత్తి కల్గి లోకంలో ప్రవర్తించాలని తెలియడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండగను ఏర్పాటు చేసి ఇచ్చారు.

మనం ఆచరించే ప్రతి పండుగ పైపైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించినా, దాని వెనకాతల ఆధ్యాత్మిక సందేశం మన ప్రతీ పండగలో కనిపిస్తుంది.

ప్రతి పండగలో మూడు విషయాలు సూచిస్తారు.

1. ఆధ్యాత్మిక ఉన్నతి
2. శారీరక ఆనందం
3. మన దోషాలు తొలగటం

మామూలుగా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు. మనం అన్నం మాని నివృత్తి చేయలేం, అందుకే పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు.

అవి మనం దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు.

వివిద ధానధర్మాలు చేతనైనంతవరకు చేస్తారు. బసవన్నలను సత్కరిస్తారు. రంగనాథుణ్ణి సత్కరించినట్లా అన్నట్లు తమ తమ అల్లుల్లను సత్కరిస్తారు. అలాంటి ఈ పండగ మనలోని దోషాలని తొలగించి పుష్టిని ఇవ్వుగాక.

ఈ రోజు పాశురం ఈ దివ్య ప్రభందాన్ని రాసిందెవరు అని తెలిపే పాశురం. ఇక ఫలశృతిని తెలుపుతుంది ఈ పాశురం. ఈ ముప్పై పాశురాలను రోజు చదవాలి, లేని పట్ల చివరి రెండు అయినా తప్పని సరి అనుసంధానం చేయాలి. ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి కృష్ణుణ్ణి పొందారు. కలియుగంలో గోదాదేవి ఈ వ్రతం ఆచరించి రంగనాథుణ్ణి చేరింది.

"వంగ క్కడల్" అలలతో కూడిన ఆ పాలసముద్రాన్ని "కడైంద" చిలికినప్పుడు "మాదవనై" ఆయన లక్ష్మీదేవిని పొందినవాడైయ్యాడు. ఆయనే "క్కేశవనై" కేశవుడు, అందమైన కేశపాశం కల వాడు.

దేవలోక ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకీ అనే పాముతో దేవతలు అసురులు మైత్రితో చిలికారు. ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించాడు. పర్వతం క్రిందకు పడి పోకుండా కూర్మంగా ఒక రూపం, పైన పర్వతం నిలిచి ఉండటానికి పైన ఒక రూపం, ఇటు దేవతలకు అటు అసురలకు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు. కలిసి చేసే పనికి పరమాత్మ తనిదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్షనం. అలా మనం కలిసి ఆచరించే తిరుప్పావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు. ఆలా చిలికినందుకు అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడైనాడు. అసలు సాగర మధనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకి చేర్చుకోవడానికే అని ఆండాళ్ అమ్మ "మాదవనై" అంటూ రహస్యం చెబుతుంది.

"శేయిరైయార్" భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కల "శెన్ఱిఱైంజి" ఆ గోపికలు "అంగ ప్పఱై కొండవాత్తై" చంద్రుడివలె ప్రకాశించే "తింగళ్ తిరుముగత్తు" ఆ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు. "అణి పుదువై" భూమికి అలంకారమైన శ్రీవెల్లిపుత్తూర్ లో "ప్పైంగమల త్తణ్ తెరియల్" చల్లటి తులసి మాలను ధరించి ఉన్న "పట్టర్బిరాన్" విష్ణుచిత్తుల వారి కూతురైన "కోదై" గోదాదేవి "శొన్న" చెప్పిన "శంగ త్తమిర్ మాలై" తీపైన ఈ పాటల మాలయైన "ముప్పదుం తప్పామే" ముప్పై పాటలను, ఒక్కటీ వదలకుండా చెప్పాలి. తిరుప్పావై ఒక మాలిక కదా, మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది. మరియూ ఈ తిరుప్పావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరివి, ప్రతి మెట్టూ అవసరం. "శెంగణ్ తిరుముగత్తు" వాత్సల్యమైన ఆ ముఖంతో "చ్చెల్వ త్తిరుమాలాల్" ఉభయ విభూది అనే ఐశ్వర్యం కల నాథుడు, "ఇంగిప్పరిశురైప్పర్" ఆయన చల్లని చూపులు తిరుప్పావై చదివే వారిపై ఉంటాయి. "ఈరిరండు మాల్ వరైత్తోళ్" రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు. "ఎంగుం తిరువగుళ్ పెత్త్" అన్ని చోట్లా దివ్య అనుగ్రహాన్ని పొంది "ఇన్బుఱువర్" ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు.