Search This Blog

Showing posts with label Siva. Show all posts
Showing posts with label Siva. Show all posts

Monday, 25 June 2018

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం SRI RUDRADHYAYAM - NAMAKAM & CHAMAKAM WITH MEANING

శ్రీరుద్రం - నమకం - చమకం - తాత్పర్య సహితం 
SRI RUDRADHYAYAM - NAMAKAM & CHAMAKAM WITH MEANING




రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.

మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.

మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది

ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.

శ్రీరుద్రధ్యానమ్
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి, నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.

రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి ( లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ) ఉంటుంది.

శ్రీ రుద్ర ప్రశ్నః
కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహితా
చతుర్థం వైశ్వదేవం కాణ్డమ్ పఞ్చమః ప్రపాఠకః

నమకం
మొదటి అనువాకము:
ఓం నమో భగవతే’ రుద్రాయ || నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | యా తే’ రుద్ర శివా తనూరఘోరాஉపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి | యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్మ్’సీః పురు’షం జగ’త్| శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్మ్ సుమనా అస’త్ | అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ | అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశోஉవైషాగ్ం హేడ’ ఈమహే | అసౌ యో’உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః | నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నోஉహం తేభ్యో’உకరన్నమః’ | ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | అవతత్య ధనుస్త్వగ్మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ | విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ | యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయాஉస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ | నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే | పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్ || ౧ ||

శమ్భ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||

తాత్పర్యము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము. ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక. గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

రెండవ అనువాకము:
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో నమో’ బభ్లుశాయ’ వివ్యాధినేஉన్నా’నాం పత’యే నమో నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’ || ౨ ||

తాత్పర్యము:
స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.

మూడవ అనువాకము:
నమః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో నమః’ కకుభాయ’ నిషఙ్గిణే” స్తేనానాం పత’యే నమో నమో’ నిషఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యే నమో నమో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యే నమో నమో’ నిచేరవే’ పరిచరాయార’ణ్యానాం పత’యే నమో నమః’ సృకావిభ్యో జిఘాగ్మ్’సద్భ్యో ముష్ణతాం పత’యే నమో నమో’உసిమద్భ్యో నక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యే నమో నమ’ ఉష్ణీషినే’ గిరిచరాయ’ కులుఞ్చానాం పత’యే నమో నమ ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వో నమో నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వో నమో నమ’ ఆయచ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వో నమో నమోஉస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వో నమో నమ ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వో నమో నమః’ స్వపద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వో నమో నమస్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వో నమో నమః’ సభాభ్యః’ సభాప’తిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోஉశ్వ’పతిభ్యశ్చ వో నమః’ || ౩ ||

తాత్పర్యము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

నాలుగవ అనువాకము:
నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వో నమో నమ ఉగ’ణాభ్యస్తృగం-హతీభ్యశ్చ’ వో నమో నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వో నమో నమో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వో నమో నమో’ గణేభ్యో’ గణప’తిభ్యశ్చ వో నమో నమో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వో నమో నమో’ మహద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వో నమో నమో’ రథిభ్యోஉరథేభ్య’శ్చ వో నమో నమో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వో నమో నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వో నమో నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వో నమో నమస్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’ నమః కులా’లేభ్యః కర్మారే”భ్యశ్చ వో నమో నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వో నమో నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వో నమో నమో’ మృగయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వో నమో నమః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ || ౪ ||

తాత్పర్యము:
దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

అయిదవ అనువాకము:
నమో’ భవాయ’ చ రుద్రాయ’ చ నమః’ శర్వాయ’ చ పశుపత’యే చ నమో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య చ నమః’ కపర్ధినే’ చ వ్యు’ప్తకేశాయ చ నమః’ సహస్రాక్షాయ’ చ శతధ’న్వనే చ నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’ చ నమో’ మీఢుష్ట’మాయ చేషు’మతే చ నమో” హ్రస్వాయ’ చ వామనాయ’ చ నమో’ బృహతే చ వర్షీ’యసే చ నమో’ వృద్ధాయ’ చ సంవృధ్వ’నే చ నమో అగ్రి’యాయ చ ప్రథమాయ’ చ నమ’ ఆశవే’ చాజిరాయ’ చ నమః
శీఘ్రి’యాయ చ శీభ్యా’య చ నమ’ ఊర్మ్యా’య చావస్వన్యా’య చ నమః’ స్త్రోతస్యా’య చ ద్వీప్యా’య చ || ౫ ||

తాత్పర్యము:
సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో ఉన్నరుద్రునికి నా నమస్కారములు.

ఆరవ అనువాకము:
నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’ చ నమః’ పూర్వజాయ’ చాపరజాయ’ చ నమో’ మధ్యమాయ’ చాపగల్భాయ’ చ నమో’ జఘన్యా’య చ బుధ్ని’యాయ చ నమః’ సోభ్యా’య చ ప్రతిసర్యా’య చ నమో యామ్యా’య చ క్షేమ్యా’య చ నమ’ ఉర్వర్యా’య చ ఖల్యా’య చ నమః శ్లోక్యా’య చాஉవసాన్యా’య చ నమో వన్యా’య చ కక్ష్యా’య చ నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’ చ నమ’ ఆశుషే’ణాయ చాశుర’థాయ చ నమః శూరా’య చావభిన్దతే చ నమో’ వర్మిణే’ చ వరూధినే’ చ నమో’ బిల్మినే’ చ కవచినే’ చ నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నాయ చ || ౬ ||

తాత్పర్యము:
అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు, వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు, గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.

ఏడవ అనువాకము:
నమో’ దుందుభ్యా’య చాహనన్యా’య చ నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’ చ నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ చ నమో’ నిషఙ్గిణే’ చేషుధిమతే’ చ నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’ చ నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే చ నమః స్రుత్యా’య చ పథ్యా’య చ నమః’ కాట్యా’య చ నీప్యా’య చ నమః సూద్యా’య చ సరస్యా’య చ నమో’ నాద్యాయ’ చ వైశన్తాయ’ చ నమః కూప్యా’య చావట్యా’య చ నమో వర్ష్యా’య చావర్ష్యాయ’ చ నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య చ నమ ఈధ్రియా’య చాతప్యా’య చ నమో వాత్యా’య చ రేష్మి’యాయ చ నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ || ౭ ||

తాత్పర్యము:
పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు, మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను, వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.

ఎనిమిదవ అనువాకము:
నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ నమః’ శఙ్గాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హన్త్రే చ హనీ’యసే చ నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’శ్శమ్భవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ నమస్తీర్థ్యా’య చ కూల్యా’య చ నమః’ పార్యా’య చావార్యా’య చ నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ చ నమ’ ఆతార్యా’య చాలాద్యా’య చ నమః శష్ప్యా’య చ ఫేన్యా’య చ నమః’ సికత్యా’య చ ప్రవాహ్యా’య చ || ౮ ||

తాత్పర్యము:
ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు, రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు

తొమ్మిదవ అనువాకము:
నమ’ ఇరిణ్యా’య చ ప్రపథ్యా’య చ నమః’ కిగ్ంశిలాయ’ చ క్షయ’ణాయ చ నమః’ కపర్దినే’ చ పులస్తయే’ చ నమో గోష్ఠ్యా’య చ గృహ్యా’య చ నమస్-తల్ప్యా’య చ గేహ్యా’య చ నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’ చ నమో” హృదయ్యా’య చ నివేష్ప్యా’య చ నమః’ పాగ్మ్ సవ్యా’య చ రజస్యా’య చ నమః శుష్క్యా’య చ హరిత్యా’య చ నమో లోప్యా’య చోలప్యా’య చ నమ’ ఊర్మ్యా’య చ సూర్మ్యా’య చ నమః’ పర్ణ్యాయ చ పర్ణశద్యా’య చ నమో’உపగురమా’ణాయ చాభిఘ్నతే చ నమ’ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో నమో’ విక్షీణకేభ్యో నమో’ విచిన్వత్-కేభ్యో నమ’ ఆనిర్ హతేభ్యో నమ’ ఆమీవత్-కేభ్యః’ || ౯ ||

తాత్పర్యము:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు, ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో, మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు, ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు, కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.

పదవ అనువాకము:
ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత | ఏషాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మాஉరో మో ఏ’షాం కించనామ’మత్ | యా తే’ రుద్ర శివా తనూః శివా విశ్వాహ’భేషజీ | శివా రుద్రస్య’ భేషజీ తయా’ నో మృడ జీవసే” || ఇమాగ్మ్ రుద్రాయ’ తవసే’ కపర్దినే” క్షయద్వీ’రాయ ప్రభ’రామహే మతిమ్ | యథా’ నః శమస’ద్ ద్విపదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ అస్మిన్ననా’తురమ్ | మృడా నో’ రుద్రోత నో మయ’స్కృధి క్షయద్వీ’రాయ నమ’సా విధేమ తే | యచ్ఛం చ యోశ్చ మను’రాయజే పితా తద’శ్యామ తవ’ రుద్ర ప్రణీ’తౌ | మా నో’ మహాన్త’ముత మా నో’ అర్భకం మా న ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ | మా నో’உవధీః పితరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః | మా న’స్తోకే తన’యే మా న ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః | వీరాన్మా నో’ రుద్ర భామితోஉవ’ధీర్-హవిష్మ’న్తో నమ’సా విధేమ తే | ఆరాత్తే’ గోఘ్న ఉత పూ’రుషఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నమస్మే తే’ అస్తు | రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః | స్తుహి శ్రుతం గ’ర్తసదం యువా’నం మృగన్న భీమము’పహన్తుముగ్రమ్ | మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో అన్యన్తే’ అస్మన్నివ’పన్తు సేనా”ః | పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః | అవ’ స్థిరా మఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకాయ తన’యాయ మృడయ | మీఢు’ష్టమ శివ’మత శివో నః’ సుమనా’ భవ | పరమే వృక్ష ఆయు’ధన్నిధాయ కృత్తిం వసా’న ఆచ’ర పినా’కం బిభ్రదాగ’హి | వికి’రిద విలో’హిత నమ’స్తే అస్తు భగవః | యాస్తే’ సహస్రగ్మ్’ హేతయోన్యమస్మన్-నివపన్తు తాః | సహస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ | తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి || ౧౦ ||

తాత్పర్యము:
పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు. మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక. నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక. ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము. భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా! శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర! నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.

పదకొండవ అనువాకము:
సహస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ | తేషాగ్మ్’ సహస్రయోజనేஉవధన్వా’ని తన్మసి | అస్మిన్-మ’హత్-య’ర్ణవే”உన్తరి’క్షే భవా అధి’ | నీల’గ్రీవాః శితికణ్ఠా”ః శర్వా అధః, క్ష’మాచరాః | నీల’గ్రీవాః శితికణ్ఠా దివగ్మ్’ రుద్రా ఉప’శ్రితాః | యే వృక్షేషు’ సస్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః | యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కపర్ది’నః | యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ | యే పథాం ప’థిరక్ష’య ఐలబృదా’ యవ్యుధః’ | యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిషఙ్గిణః’ | య ఏతావ’న్తశ్చ భూయాగ్మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే | తేషాగ్మ్’ సహస్రయోజనేஉవధన్వా’ని తన్మసి | నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”உన్తరి’క్షే యే దివి యేషామన్నం వాతో’ వర్-షమిష’వస్-తేభ్యో దశ ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యో నమస్తే నో’ మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి || ౧౧ ||

త్ర్యం’బకం యజామహే సుగన్ధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మాஉమృతా”త్ | యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివేశ తస్మై’ రుద్రాయ నమో’ అస్తు | తము’ ష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వ’స్య క్షయ’తి భేషజస్య’ | యక్ష్వా”మహే సౌ”మనసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య | అయం మే హస్తో భగ’వానయం మే భగ’వత్తరః | అయం మే” విశ్వభే”షజోஉయగ్మ్ శివాభి’మర్శనః | యే తే’ సహస్ర’మయుతం పాశా మృత్యో మర్త్యా’య హన్త’వే | తాన్ యఙ్ఞస్య’ మాయయా సర్వానవ’ యజామహే | మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” | ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః | తేనాన్నేనా”ప్యాయస్వ ||

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||

సదాశివోమ్ |

ఓం శాంతిః శాంతిః శాంతిః
తాత్పర్యము:
ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు, కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు, పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్

VARANASI VAIBHAVAM వారణాసి కాశి వైభవం

VARANASI VAIBHAVAM
వారణాసి కాశి వైభవం



కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం

కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ బుభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం
స్వయంగా శివుడు నివాసముండె నగరం

ప్రళయ కాలంలో మునుగని అతి  ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన తన త్రిశూలంతో కాశీిని పైకెత్తి కాపాడతాడు.

కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం.

కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం....

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని  కాశి లోనికి అనుమతించడు.
కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.

కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....డిండి గణపతి కాల బైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...
కాబట్టే కాశీలో  కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.

కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యం తో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.

కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.

అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీపూరిలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా  విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.

గోముకం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశి ఘాట్లను వదిలి దూరం జరగలేదు.

శివుని కాశిలోని కొన్ని వింతలు...

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తొవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ  జాడ దొరకకుండా ఉంటుంది.

కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూలచెట్లు మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. అస్సలు ఇ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి
అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞ్యానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

కాశి విషవేశ్వరునికి శవ భస్మ లేపనం తో పూజ ప్రారంభిస్తారు .

కాశిలోని పరాన్న బుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లబిస్తుంది.

కాశి క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రేట్లు ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రేట్ల పాపం అంటుతుంది.

విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు
జగత్అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి..

 ఇందులో దేవతలు,ఋషులు,రాజులూ, తో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించిన వి ఎన్నో వున్నాయి
అందులో కొన్ని
1) దశాశ్వమేధఘాట్ బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే రోజు సాయకాలం విశేషమైన గంగామా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్ చంద్రుడు చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్ సతి దేవీ కన్ను పడిన స్థలం విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్ పశుపతి నాథ్ మందిరం బంగారు కళశంతో నేపాల్ రాజులూ కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్ట మొదటిది దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రం తో  తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానమ్ చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపలు తొలిగి పోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్ ఇప్పుడు సిందియా ఘాట్ అంటారు ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందు మాధావుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్ ఇక్కడే బుగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్ గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్ తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం  పొందినది.

11) హనుమాన్  ఘాట్ ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లబచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్ పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం కూలీగా పని చేసి దైవ పరక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు
నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాసపర్వతం నుండి బుగర్భ జలాధార కలుస్తున్నది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లబిస్తున్నది.

15) నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్ ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం...
ఇక్కడ స్నానం చేస్తే పాపలు తొలిగి 64 యోగినిలు శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్  ఘాట్ ఇక్కడే పూర్వం బ్రమ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విజ్ఞాలను తొలగించమని వక్రతుండ వినాయకున్నీ తపస్సు చేసి ప్రసన్నున్ని చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశి
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము కాశీలోని గంగా నది ప్రవాహంలో                     అనేక ఘాట్ల ద్ధగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి

పూర్వం కాశిలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.
కానీ  మొహమ్మదియ దండ యాత్రికులు కాశిని లక్ష్యంగా  చేసుకొని దాడులు చేసి  ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము

విశ్వనాథ ,బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు నేటికీ విశ్వనాథ మందిరంలో నంది మజిదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.
అక్కడే శివుడు త్రశులం తో త్రవ్విన జ్ఞ్యాన వాపి తీతం బావి ఉంటుంది

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిరం అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

వీరభద్రుడు - VEERABHADRUDU - SRISAILAM


 వీరభద్రుడు - VEERABHADRUDU - SRISAILAM





శ్రీశైలంలో ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనపడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు.

చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. అపుడు లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్నా రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జునా అని మరొకమారు పిలిపించుకున్నాడు.

ఇష్టకామేశ్వరి - ISTAKAMESWARI DEVI

 ఇష్టకామేశ్వరి - ISTAKAMESWARI DEVI




మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.

కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.

ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.

* అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
* అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
* రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
* ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
* సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
* కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?

అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.

ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు

ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు.

ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే.

త్రయంబకుడు - TRAYAMBAKESWAR

త్రయంబకుడు - TRAYAMBAKESWAR

త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి??? శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి???
శివ తత్వాన్ని వివరించే అద్భుతమైన పోస్ట్....అందరూ తప్పకుండా చదవండి

మహా మృత్యుంజయ మంత్రం:

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

అర్ధం :-

అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!








ఉదయం తెలిసినామె మా యింటికి వచ్చారు. మాటల మద్యలో... ఈ మద్య ఒకరి సూచన ప్రకారం 'మహా మృత్యుంజయ మంత్రం' రోజూ పదకొండుసార్లు చదువుతున్నానండి. కానీ, కొన్ని సందేహాలున్నాయండి. ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా, మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదండీ... మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియడం లేదు. అది అడుగుదామనే వచ్చానండీ ... అన్న ఆమెకు, నా అవగాహన మేరకు నేనిచ్చిన బదులిది -

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదండీ, పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.

ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.

ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -

జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.

మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

పంచభూతాత్మకుడు :- శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

త్రయంబకుడు :- శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

నామము :- శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.

విభూతిదారుడు :- సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

త్రిశూలం :- సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.

నాగాభరణుడు :- సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.



శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.

తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.

మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.

ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.

విన్నపం :- ఆమె ప్రశ్నలకు నేను విన్న, చదివిన వాటివలన నా అవగాహన మేరకు నాకు అన్పించినది ఇలా చెప్పాను. ఈ టపా చదివినవారు ఇందులో ఏమైనా సవరణలు గానీ, ఇంకా ఏమైనా సూచనలు గాని ఉంటే తెలపగలరని ఆశిస్తున్నాను.
Sent from my ASUS

Sunday, 17 June 2018

కేదారనాథ్ - KEDARNADH

కేదారనాథ్




జయ భోలేనాథ్ - భోలే నాథుడిపై భక్తిని రెట్టింపు చేసే కధ

కేదారనాథ్ ని ‘జాగృత మహాదేవుడు’ అని ఎందుకు అంటారు? రెండు నిముషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది. పూర్తిగా చదవండి-
 ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు। దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు। మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు। అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి।
 చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు। కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు। అతడు మందిరం ద్వారాలు మూసేవేళ అక్కడకు చేరాడు। పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు- ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను। కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’। అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే। నియమం నియమమే మరి। అతడు చాలా దుఃఖపడ్డాడు। మాటిమాటికీ శివుని స్మరించాడు. ‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా?’ అని। అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు।
 పూజారి అన్నాడు కదా- ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలయ్యాకే తలుపును తెరిచేది’ అని। ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’। అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు। అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు। ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి। కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద – ఆయన తప్పక కృప చూపుతాడని। అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి।
 అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు। చూస్తే ఒక సన్యాసి అతని వైపు వస్తున్నాడు। ఆ సన్యాసి అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు। అడిగాడు- ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’। అని బాధపడ్డాడు. సన్యాసి అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు। తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండిపోయాడు।  సన్యాసికి అతడి పై దయ కలిగింది। ఆయన- ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది। నీకు తప్పక దర్శనం దొరుకుతుందనిపిస్తున్నది’। అని అన్నాడు
 మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు। సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి। అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు। అతడికి ఏదైనా అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు। అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు – ‘నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’। అని. పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు – ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా। ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే। నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను। నేనెటూ కదలలేదు’। అని.
 పూజారి ఆశ్చర్యానికి అంతే లేదు। ఆయన అన్నాడు – ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం। నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ అని. పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు। ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు? అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు। ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’। అని.
 వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు। ఇట్లా అన్నారు – ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే। నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు। ఆయనే తన యోగమాయతో నీకు ఆరునెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు। కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు। ఇదంతా నీ పవిత్రమైన మనస్సు, శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది। మేము నీ భక్తి కి ప్రణామాలు అర్పిస్తున్నాము’। అని.
#LordShivaStories

శివుని చిహ్నములు - SIVA IDOLS - MEANING

శివుని చిహ్నములు



అర్ధ నారీశ్వరత్త్వం సృష్టికీ, పరమేష్టికీ, మాతాపితృ సంబంధానికి చిహ్నంగా ఉన్నది. ఈ సంబంధమేకాక మరికొన్ని సంబంధాలు ఉన్నాయి. శ్రీ దక్షిణమూర్తిస్తోత్రంలో శ్రీభగవత్పాదులు అన్నారు-

విశ్వం పశ్యతి కార్యకారణతమా స్వస్వామి సంబంధతః
శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః,
స్వప్నే జాగ్రతి వాయఏష పురషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||

జీవుడు మెలకువలోనూ కలలోనూ ఈ విశ్వంలో కొన్నింటిని కార్యాలుగానూ కొన్నింటిని కారణాలుగానూ కొందరను దొరలగానూ, కొందరను బంటులనుగానూ, కొందరను గురువులనుగానూ, కొందరును శిష్యులనుగానూ, కొందరను కొడుకులనుగానూ, మరికొందరను తండ్రులనుగానూ చూస్తూ మాయచే బ్రమసి నానాజ్ఞానాలతో నిండియున్నాడు. నిజానికి ఈ జీవుడు దేవుడే, పరమాత్మే; ఇవి అన్నీ అసత్యాలే అని దీని భావం.

ఈశ్వరుడు 'జగతీనాంపతిః'. అందుచే మనమందరమూ ఆయన సేవకులం. మన ఆజ్ఞానం తొలగించి సద్గురువై జ్ఞానదానం చేసేదీ ఆయనే. భక్తితో ఆయనకు ఒక్క బిల్వదళం అర్పిస్తే చాలు. ఆ ఆశుతోషుడు సంతోషించి తన కరుణా పూరితాపాంగవీక్షణం మనపై ప్రసరింపజేస్తాడు. మనకు ఐహిక సంపదయేకాక ఆముష్మికసంతోషం కూడా ఇస్తాడు. ఈ విషయమే ఈ క్రింది శ్లోకంలో ఉన్నది.

''త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుషమ్,
త్రిజన్మ పాపసంహార మేకబిల్వం శివార్పణము||''

బిల్వం అతిపవిత్రమైనది. ఇది మూడుదళాల కూడిక. శివునికి మూడు కన్నులున్నట్టు బిల్వానికి మూడు దళాలు ఉంటవి. అది లక్ష్మికి వాసస్థానం. అందుచేతనే లక్ష్మీ అష్టోత్తరంలో 'బిల్వనిలయాయై నమః' అన్న ఒక నామం ఉన్నది. శ్రీ సూక్తమున్నూ-

''ఆదిత్యవర్ణే తపసోధిజాతో
వనస్పతి స్తవవృక్షోథ బిల్వః'
తస్యఫలాని తపసానుదన్తి మాయా
అన్తరాయాశ్చ బాహ్యాఅలక్ష్మీః||''

అనిచెప్పుతున్నది. బిల్వదళోపరిభాగాలలో (వెనుకవైపు) శ్రీలక్ష్మీదేవి ఉన్నట్టు మన నమ్మిక. అందుచేతనే లింగానికి బిల్వపు వెనుకభాగం తగిలేటట్టు మనం అర్చిస్తాము.

మనం కొన్ని శివచిహ్నాలను ధరించాలని శాస్త్రంనిర్దేశిస్తున్నది. అది విభూతి నుదుట పూసుకోవడం' రుద్రాక్షలను ధరించడం. అంతేకాదు, మన జిహ్వా పంచాక్షరీమంత్ర పరాయణమై పోవాలి. హృదయం స్ఫాటికవర్ణంతో వెలిగిపోయే ఆ శివస్వరూపానుసంధానం చేయాలి. ఆ హిరణ్యబాహువును మన హస్తాలతో బిల్వదళాలతో అలంకరించాలి.

రుద్రాక్షవృక్షాలు నేపాళంలోనూ, జావా బలిదీవులలోనూ ఉంటున్నవి. నడుమ తొఱ్ఱగలిగిన పండు సృష్టిలో ఇది ఒక్కటే, ఒకమూలగాగ్రువ్వబడటం తక్క రుద్రాక్షలకు వేరే ప్రయోజనమున్నట్టు కనిపించదు. సృష్టికర్త ఉద్దేశమూ అదేనేమో. బత్తాయిబలిస్తే అందు వివిధముఖాలున్న తొనలున్నట్లు రుద్రాక్షలకూ ముఖాలున్నాయి. ఏకాదశముఖాల తోడి రుద్రాక్షలను శివభక్తులు ధరిస్తారు. ఆరు ముఖాలున్న రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని (షణ్ముఖుడు) భక్తులు ధరిస్తారు. ఏకముఖ రుద్రాక్షమున్నూ కలదు. కాని దొరకడం కష్టం. దాని వెల అత్యధికం.

పంచాక్షరీ మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. 'నమశ్శివాయ' అనే ఆమంత్రంలోశివశబ్దం దాని జున్ను. పాపపరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.

గోవు మనకు చాలా పవిత్రమైనది, ఏ మృగపు పురీషమయినా సరే; కంపుకొడుతూ దుర్గంధభూయిష్ఠంగా ఉంటుంది. ఒక్క గోసంబంధమైనది మాత్రం అలాఉండదు. గోమయానికి వాసన లేకపోవడమేకాదు. అది ఎక్కడైనా దుర్గంధం ఉంటే దానిని పోగొట్టుతుంది. పూర్వులు తమ ఇండ్లను గోమయాలం కృతం చేయడానికి ఇదే కారణం. గోమయంతో చేసిన విభూతి కూడా చాలా పవిత్రమైనది.

ఈ బాహ్యచిహ్నాలూ - ఈ శివచిహ్నాలు అంతశ్శుద్ధినీ కలిగిస్తవి. అందుచే అనుష్ఠానాలను విధ్యుక్తంగా చేయడం, శివనామాన్ని జపించడం, శివస్వరూపానుసంధానం చేయడం మనకు ముఖ్యధర్మం. ఇట్లు చేసినామంటే ఈశ్వరప్రసాదంవల్ల మన శ్రేయస్సేకాక జగత్ సౌఖ్యమూ సిద్ధిస్తుంది. సైనికులున్నారు. వాళ్లకు ప్రత్యేకమైన దుస్తులుంటాయి. కవాతు, శిక్షణలతో పాటు ఈదుస్తులూ వారి కొక వీరోచితమైన భావాన్నీ ఉద్రేకాన్నీ కలిగిస్తవి. అట్లే మనం ఈ బాహ్యశివచిహ్నాలను ధరించడంవల్ల మన శివభక్తీని పెంపొందించుకొంటాము. చిత్తవిక్షేపాన్ని తొలగించడానికి ఎన్నో మార్గాలున్నది. యోగశాస్త్రము 'వీతరాగ విషయం వా చిత్తం. అని చెప్పుతున్నది.

ప్రాణాయామమూ ఈ ధారణకు ఒక మార్గమే. ఏదన్నా సంతోషవార్త వింటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని క్షణాలు కట్టుబడతై. దుఃఖవార్తలు విన్నప్పుడూ ఇంతే. ఆ క్షణంలో మన మనస్సు నిర్వికల్పంగా ఉంటుంది. దీనివల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకీ, మనస్సుకూ ఒక సంబంధం ఉండదని మనం సులభంగ గుర్తించవచ్చు. అందుచే ''ఈ బాహ్యచిహ్నాలవల్ల సంస్కారాలవల్ల ఏమి ప్రయోజన ముంటుంది?'' అని మనం అనుకోరాదు. అవి అతంశ్శుద్ధికి సాధకాలు అవుతవి. మన మందరమూ ఈ అతంశ్శుద్ధికి పాటుపడి ఈశ్వరప్రణిధానం చేయాలి. ఇది మనకు కర్తవ్యం.                      

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


శివభక్తి - SIVA BHAKTI

శివభక్తి



'సర్వేవేదా యత్పద మామనంతి' మనము శ్రుతుల నుండి ఒక విషయాన్ని శివభక్తి
తెలిసికొంటున్నాము. అదేమిటి? ఒక వేదాలేకాక ఋషులూ, మునులూ, జ్ఞానులూ, యోగులూ, అందరూ ఏవస్తువును పొందగోరి దేనిని వెతుకుతున్నారో ఆ వస్తువేది? అది ఓంకారము. ఈ ఓంకారమును మాండూక్యము విరివిగానూ స్పష్టంగానూ చెప్పింది - 'శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే ఆత్మా స విజ్ఞేయః' అని అనగా ఆ బ్రహ్మము శాంతమూ శివమూ. అంతేకాక అద్వయమైన విశ్వతైజపప్రాజ్ఞులకు మీదివస్తువూ అదియే; అట్టి ఆ ఆత్మ ఎరుగదగినదీ అని :

'విద్యాను శ్రుతి రుత్కృష్టా రుద్రైకాదశినీ శ్రుతౌ,
తత్ర పంచక్షరీ తస్యాం శివ ఇ త్యక్షరద్వయమ్||

వేదములో యజుర్వేదము మేలుబంతి. యజుర్వేదములో నాలుగవ కాండలో రుద్రము ఉండుటవల్ల నాలుగవ ప్రశ్నముదానికి మిక్కిలి. రుద్రము మధ్య పంచాక్షరి దాని కంటె దొడ్డది. ఆ పంచాక్షరిలోనూ రెండు అక్షరము లిను మిక్కిలి. ఆ అక్షరములు శివ అనునవి. ఈ అక్షరద్వయము జీవరత్నమని శ్రీమరప్పయ దీక్షితులవారు బ్రహ్మతర్కస్తవములో ఇట్లా చెప్పారు:

యజ్జీవరత్న మఖిలాగమ లాలనీయం
యే చ త్రినేత్ర మృడ శంకర నామధేయైః,
ఏతై రపి స్ఫుట మనన్యసమాశ్రయం తే
విఖ్యాప్యతే సకల జీవ సుఖ ప్రదత్వమ్.

అట్టి పరమమంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయగోరేవారు చేయవలసిన పని ఏమిటి? మొదటిది విభూతిథారణ. విభూతి అనగా ఐశ్వర్యం అది అగ్నిలో కాలి శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటినిండా భస్మ అలదుకుంటాడు. రెండవది రుద్రాక్షథారణ రుద్రాక్షం అంటే శివుని మూడవ కన్ను. ఇంతమంది దేవతలలో ఫాలమందు కన్ను ఉన్నవాడు ఆయన ఒక్కడే. మూడవది పంచాక్షరీజపము. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివశివ అన జపం చేయాలి. నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించటం. లక్ష్మి ఐదు చోటులలో ఎక్కువగా ఉంటుందట. మారేడు, ఆవు వెనుక తట్టు, పతివ్రతల పాపట, ఏనుగుతల పద్మము అనేవి లక్ష్మీ నివాసస్థానాలు. అందుచేత లక్ష్మీప్రదమైన మారేడుదళాలతో చేసే పూజ శివునికి అత్యంత ప్రీతి కల్గిస్తుంది. ఐదవది హృదయంలో సదా సదా శివధ్యానంపై జెప్పిన వెలుపలి పూజతో పాలులోపల శివస్వరూపానుసంథానం ఎడతెగకుండా చేయాలి అని అభిప్రాయం.

సాయంకాలం సమయాన్ని ప్రదోషం అని అంటారు. త్రయోదశినాటి సంధ్యాకాలం మహాప్రదోషం. ప్రదోష సమయాలలో శివస్మరణ విధిగా చెయ్యాలి. కనీసం ఐదు నిమిషాలైనా ప్రదోషసమయంలో శివస్మరణ చేస్తారని సంకల్పం చేసుకొని మానసికంగా స్మరణమూ వాచికంగా శివశబ్దోచ్చారణమూ చేస్తే ఆత్మకు శ్రేయస్సు కలుగుతుంది.

శివ అంటే మంగళం. 'శ్వశ్రేయసం శివం భద్రరి కళ్యాణం మంగళం శుభం' అని అమరుడు. ప్రాయోపవేశానికి సిద్ధుడైన పరీక్షిత్తుకు శుకాచార్యులవారు భాగవతం వినిపించారు. దానిలో దక్షునికథ ఉన్నది. దక్షుడు శివద్వేషి, శివుడు మంగళస్వరూపుడు. అట్టి శివుని ద్వేషించినవానికి అమంగళం అశివం కాక మరేమి తటస్థిస్తుంది? 'దాక్షాయణిదక్షునిచూచి
యద్ ద్వ్యక్షరం నామ గిరే రితం నృణాం

సకృత్ర్పనంగా దఘ మాశు హన్తి తత్,
పవిత్ర కీర్తిం త మలంఘ్య శాసనం
భవా నహూద్వేష్టి శివం శివేతరం||'

ఇదెక్కడి పాపం! నీవు శివుణ్ణే ద్వేషిస్తున్నావు! నీకు అశివమే ప్రాప్తించక ఓహో ఏంప్రాప్తిస్తుంది?

పూర్వం ఎవరైనా సహగమనంచేస్తే వారివస్త్రాలు భద్రపరచి కొలిచేవారట. మనోనిగ్రహం ఎంతో ఎంతో లేకపోతే సహగమనం చేసే ధైర్యం కలుగదు. అట్టి నిగ్రహంతో మనోనిశ్చయం చేసుకొని సహగమనం చేసినవారు ఆత్మజ్ఞానం కలవారితో సమానమైనవారు. అందుచేతనే పూజింపదగినవారు అయ్యేవారు. అట్టి సందర్భంలో అంబిక ఈ మాటలు చెప్పింది గనుక ఇది ముమ్మాటికీ సత్యం. నిప్పుగుండంలో శరీరం త్యాగం చేసేటప్పుడు చెప్పిన మాటకంటే నిక్కమైన మాట వేరే ఏమన్నా ఉంటుందా?

పాపాన్ని వొక్కకోణంలో పోగొట్టగలిగే వస్తువు ఒక్కటి ఉన్నది. దానికై అన్నిచోట్లా వెదకనక్కరలేదు. వేదాలకు జీవరత్నమూ, దేహానికి ప్రాణమూ, దేవాలయానికి మహాలింగమువలె వెలుగుచున్న శివ అనే రెండక్షరాలు పాపాన్ని పటాపంచలు చేయటానికి పరమౌషధం. మనిషి పుట్టక పుట్టి సాఫల్యం కోరేవానికి శివనామోచ్ఛారణ తప్ప వేరే ఉపాయంలేదు. పరమేశ్వరుడు మనకు నాలుక యిచ్చినందులకు ఫలం శివ శివ అని జపం చేయడమే.

అపి వా య శ్చాండాలః శివ ఇతి వచం విసృజేత్
తేన సహ సంవసేత్

అని శాస్త్రాలు చండాలునికి సైతం శివనామోచ్ఛారణం విధించినవి. సారాంశం ఏమిటంటే ఎప్పుడూ శివస్మరణం వైష్ణవ ప్రధానమైన భాగవతం శివనామ ప్రశస్తిని చెప్పటం మరొక విశేషం. ఒకానొక గొప్ప స్త్రీ ఒకానొక గొప్ప సమయంలో చెప్పిన మాటలు ఇవి.

పరమేశ్వరునికీర్తిని నోరారా వర్ణించడం చేతనూ వీనులారా వినడంచేతనూ మనము పవిత్రులము అవుతాము. అతని ఆజ్ఞ అనుల్లంఘనీయం, అతడు అంతటా నిండి ఉన్నాడు.

అహంభావమున్నవారిని ఆయన శిక్షిస్తాడు. తప్పుచేసిన పిల్లలను దండించే తండ్రివలె దేవతల నాతడు దక్షయజ్ఞంలో శిక్షించాడు. సముద్రమధన కాలంలో కాలకూటం పుట్టినపుడు ఆయన దానిని గుటుక్కున మింగి వానినందరిని రక్షించాడు. ఇట్లా రక్షణ శిక్షణాలు రెండూ చేయగల దక్షుడు ఆయన. పరమేశ్వరుని ముఖాముఖిగా చూడపనిలేదు. ఆయన నామం వొకటేచాలు. పాపపరిహారానికి శివనామం కంటె సులభోపాయంలేదు. ప్రదోషంలో శివ శివ అంటే చాలు. శిష్టులు సాయంసమయమున శివనామం చెప్పడం వాడుక. ఆపరమేశ్వరుడు వేదముల కన్నింటికీ తాత్పర్యం అనదగిన ఓంకార స్వరూపమై యున్నాడు. పరమేశ్వరుడు ప్రభవ బ్రహ్మమేకాక స్వరూప బ్రహ్మము కూడాను- 'సర్వే వేదా యత్ పదమామనన్తి' వేదములన్నీ ఓంకారాన్ని చెప్పినవి. సాయంసమయంలో శివథ్యానమూ ప్రదోష సమయంలో ఈశ్వరదర్శనమూ చేయాలి. దేవతలు శివదర్శనం కోసం శివాలయానికి ప్రదోష సమయంలో వస్తారట.

సాంఖ్య సూత్రాలు ఈశ్వరుణ్ణి త్రినేత్రుడని చెప్పినవి. అతడు మహాపురుషుడని యోగసూత్రాలలో పతంజలి –

'క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్టః
పురుషవిశేష ఈశ్వరః'

అని అంటాడు.

'శబ్దాదేవప్రమితః' అని బ్రహ్మసూత్రములు చెప్పినవి.

ఇట్లా శ్రుతులూ, కర్మకాండకు చెందిన రుద్రమూ, జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తులూ, సూత్రాలూ, పురాణాలూ పరమేశ్వరుని నామమాహాత్మ్యం వర్ణించినవి. ఈశాన శబ్దానికి ఏది అర్థమో అదే పరమేశ్వర స్వరూపం. శివశబ్దానికి దీర్ఘంతీస్తే శివా అని ఔతుంది. అది అంబికా నామం.

'యా తే రుద్ర శివా తనూ రఘోరఽపాపకాశినీ,
తయా నస్తను వా శంతమయ గిరిశం తాభిచాకశీహి'

- శ్రీరుద్రమ్.

'తతస్మైతే తనువౌ ఘోరాన్యా శివా న్యా'

- తై. సంహిత

పరమేశ్వరునికి రెండురూపాలు. పరమ మంగళమైన రూపం వొకటి. కంకాళంతోటి జుంజురు జడలతో ఉన్న రూపం వొకటి. సర్వమంగళానామం అంబికది.

'యాతే రుద్ర శివ తనూః శివా విశ్వాహ భేషజీ,
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసేః'

ఆ అంబికయే ప్రాణం. ఈస్వరూపద్వయమే జగత్తుకు తలిదండ్రులు.

'కో బ్రాహ్మణౖ రుపాస్యః?
గాయత్ర్యర్కాగ్ని గోచరః శంభుః'

అని ఆదిశంకరులు ప్రశ్నోత్తరమాలికలో చెప్పారు. గాయత్రి, సూర్యుడు, అగ్ని - వీనిలో ఉండేవాడు శివుడు. ఈ మూటిలోను పరమేశ్వరుని ఆరాధించవలెను.

'సౌరమండల మధ్యస్థం సాంబం సంసారభేషజం
నీలగ్రీవం విరూపాక్షం నమామి శివ మవ్యయమ్|'

అని మరొక శ్లోకం.

'యోరుద్రోగ్నౌ' అని శ్రీరుద్రం పరమేశ్వరుని అగ్ని స్వరూపాన్ని వర్ణించింది.

'శాస్త్రం శారీర మీమాంసా దేవః శ్రీ చంద్రశేఖరః
గురుః శ్రీ శంకరాచార్యః నంతు మే జన్మజన్మని||'

నేను ఎన్ని జన్మలెత్తినా నాకు చంద్రమౌళీశ్వరుడే స్వామి. శంకరాచార్యులే గురువు. ఏజన్మ యెత్తినా అన్ని అవస్థలలోను శివనామస్మరణ చేస్తే మనకు పరమశాంతి దొరుకుతుంది.                      

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Monday, 16 April 2018

TIRUVANNAMALAI


TIRUVANNAMALAI



తిరువణ్ణామలై ( అరుణాచలం ) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం.

అరుణాచలేశ్వరుడు:

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.

Tuesday, 20 March 2018

BRAHMA KAPALAM బ్రహ్మ కపాలం

!!బ్రహ్మ కపాలం"!!




"శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు.
నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు కానీ,
ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది.
ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు.
మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.!
దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది.
కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది.
అది ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు.
క్రమక్రమంగా ఎండి,చివరికది
కపాలంగా మారిపోయింది.

బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే , అది సరాసరి
బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది.
జగద్గురువు , మహాతపస్వి ఆయనకూ ఆ పాప ఫలం తప్పలేదు.
దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

'దేవాదిదేవా ! పరమజ్ఞామివి.
నీకు తెలియని ధర్మం లేదు.
ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి .
శాసించగలవాడివి.
అయినా, మాపై క్రుపతో ఒక సలహా ఇవ్వమని కోరావు.
కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము…
ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళూ కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయు ఈ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ
మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా !
ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ? అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే తానెలా ఇవ్వకుండా ఉండగలడు.?
పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు.
అప్పటినుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు.
ఆ తరువాత శివుడు ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు.
ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు.
'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు .
ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట . ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను (విష్ణువును) ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది.
అంటే అది అధోలోకాలను, ఊర్ధ్వ లోకాలను అనుసంధానం చేసే ముఖం.
చిరకాల శివహస్త స్పర్శవల్ల దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం.
దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి.
దానికితోడు నాశక్తి , శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి.'
అని భావిస్తూ విష్ణువు శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే ! ఆ కపాలం కాస్తా ఊడి కిందపడి శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారియైన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది.
తమ పిత్రుదేవతలను పునరావ్రుతరహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునేవారికి రాజమార్గమై నిలచింది.!!!……

"ఓం నమఃశ్శివాయ"!!

Monday, 5 March 2018

Details of Some Important Siva temples



శివ క్షేత్రాలు:

కొన్ని విశిష్టమైన శివ క్షేత్రాలు:

భైరవకోన ::




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల 'ప్రకాశం' జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. నడక దూరంలో ఈ క్షేత్రము కలదు. ఎక్కడ చూసినా కోనేరులు, శివ లింగాలు కనిపించే ఈ కొనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీ.శ. 7, 8 శతాభ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లిఖార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు.

ధర్మస్థల ::



కర్నాటక రాష్ట్రంలో గల 'ఉడిపి' నుండి 120 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇది మంగుళూరు నుండి 75 కి.మీ. దూరంలో ఉన్నది. నేత్రావతి నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'మంజునాథేశ్వరాలయం'. క్రీ.పూ. 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది.ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వలన కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూలవిరాట్ ను జైనులు ప్రతిష్ఠించారు. 800 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతుంది.

తంజావూరు ::


తమిళనాడు రాష్ట్రంలో గల 'చెన్నై' నుండి 335 కి.మీ. దూరంలో గల 'తంజావూరు' అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వరాలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజచోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడినది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తయిన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురం పై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తయిన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజచోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం 'యునెస్కో' వారిచే ప్రపంచ సంస్కృతీ చిహ్నంగా గుర్తింపు పొందినది.

దుగ్ధేశ్వరనాథ్ ::


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల 'గోరఖ్ పూర్-బటని' మార్గంలోనున్న 'గౌరీబజార్' స్టేషన్ నుండి 15 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగము 12 జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఉన్నయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుదు తనకు తానుగా కదులుతుంది. ఒక్కక్కసారి రోజంతా కదులుతుంది. హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు లింగాన్ని గట్టిగా పట్టీ ఉంచినప్పటికీ కదలిక లేకపోవటం ఆశ్చర్యం.

తలకాడు ::





(1) కర్నాటక రాష్ట్రంలో గల 'మైసూర్' నుండి 60 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలోనున్న ఇచ్చటి ఆలయం పేరు 'వైద్యేశ్వరాలయం'. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీకమాసం 5 సోమవారాలలో దర్శనం ఇచ్చింది. మరలా పునర్దర్శనం క్రీ.శ. 2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాల కొకసారి కార్తిక మాసంలో 5 సోమవారాలు పడినపుడు మాత్రమే దర్శనం ఇస్తుంది. అప్పుడు జరిగే 'పంచలింగ దర్శనం' అనే మహోత్సవానికి లక్షల కొలదీ జనం వస్తారు.
(2) కర్ణాటక రాష్ట్రంలోని 'మైసూర్' నుండి 600 కి.మీ. దూరంలో గల క్షేత్రం 'తలకాడు'. ఈ ఆలయం పేరు 'పాతాళేశ్వరాలయం'. క్రీ.శ. 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయ ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖవారి దయ వలన బయటపడింది. నేల మట్టంకన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోకి మారుతూ కనిపిస్తుంది.

మహేశ్వర్ ::



మధ్యప్రదేశ్ రాష్త్రంలో 'ఇండోర్' నుండి 100 కి.మీ. దూరంలో గలదు ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయంపేరు 'రాజరాజేశ్వరాలయం'. పురాణాలలో 'మాహిష్మతి'గా పిలువబడే ఈ క్షేత్రం అనడు కార్తవీర్యార్జునుని రాజధాని. అయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా 'సహస్రధార'గా నర్మదానది ప్రవహిస్తుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం 'అహల్యేశ్వరాలయం' చూడవలసినది. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలఓ ఒకటైన 'స్వాహాదేవి' మందిరం ఉంది. రాజరాజేశ్వరాలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికీ ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండదీపం దర్శనం ఇస్తుంది.

కోటప్పకొండ ::


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'గుంటూరు' నిల్లాలోని నరసరావుపేట నుండి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు. స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండమీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం కలదు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటిమీద 3 శివాలయాలు ఉన్నాయి. వేలకొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి.

సురుటుపల్లి ::



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

పోండా ::

గోవా రాష్ట్ర రాజధాని 'పానాజీ' నుండి 22 కి.మీ. దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరానున్న ఈ ఆలయం బంగారు కలశంతో ధర్శనమిస్తుంది. ఇండో-పోర్చుగీసు-ఇస్లాం నిర్మాణ శైలీ విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీప స్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహ స్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో, స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీ.శ. 1560 వరకు 'కుశస్థలి'లో గల ఆలయంలో పూజలందుకునేది.


ఖాట్మండు ::



(1) నేపాల్ దేశ రాజధాని అయిన 'ఖాట్మండు' క్షేత్రంలోని ఒక ఆలయం పేరు 'విశ్వరూప మందిరం'. ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి, గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధానాలయంలో శివుడు వేయి చేతులతో పార్వతిని ఆలింగనం చేస్తున్నట్లు సుమారు 50 అడుగు విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉ. 5.00 గం.లకు, సాయంకాలం 7.00 గం.లకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది.
(2) శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధినొందినది పశుపతినాథలింగం నేపాల్ లోని ఖాట్మండులో కలదు. నేపాల్ లోని అత్యంత పవిత్రమైన 'ఖాట్మండు' ప్రదేశం;హిందూధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిల్చింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి (పార్వతి). ఖట్మాడులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం 'పశుపతి' అనే నామంతో ప్రసిద్ధి పొందినది. ఇది శివుని అష్టమూర్తులలో 'యాజమాన' మూర్తిగా కూడా కొలువబడుతున్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామములలో పశుపతి ఒకటి.

తిరువల్లం ::

తమిళనాడు రాష్ట్రంలో 'రాణిపేట'కు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'బిల్వనాథేశ్వరాలయం'. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. 1500 ఏళ్ళనాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీ.పూ. 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవ రాజులు 850 బి.సి. లో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్యపూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం.

నత్తరామేశ్వరం ::



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా 'అత్తిలి' నుంది 6 కి.మీ. దూరంలో గల క్షేత్రమిది. గొనని నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'రామలింగేశ్వరాలయం'. ఆలయంలోని శివలింగాన్ని పరుశురాముడు ప్రతిష్టించినట్లు చరిత్ర. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కుడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలుగా నిలువు చారలు ఉంటాయి.

కాళేశ్వరం ::



అంధ్రప్రదేశ్ రాష్త్రంలో 'కరీంనగర్' జిల్లా కేంద్రం నుండి 130 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణీ సంగమంలో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'కాళేశ్వరాలయం'. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అనే రెండు లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం క్రింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలుంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న 'యమకోణం' చూచి తీరవలసింది.

పృధుదక్ ::

హర్యానా రాష్త్రంలో కురుక్షేత్రం నుండి 50 కి.మీ. దూరంలో గణ పిహోవా స్టేషను నుండి 4 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం పేరు 'సంగమేశ్వరాలయం'. దీనిని 'అరుణాయి మందిరం' అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంతలోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతి నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగంను చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో ధర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేహలేదని చెబుతారు.

గార్హముక్తేశ్వర్ ::

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 'ఢిల్లీ-మొరాదాబాద్' లైనులో గల 'బ్రజ్ ఘాట్' నుండి 6 కి.మీ. దూరంలో గల క్షేత్రం ఇది. ఒక సిద్ధుని ద్వారా ఇచ్చటి ఆలయానికి చేరిన శివలింగం తెల్లని స్ఫటికంతో నిర్మితమై సప్త వర్ణాలను వెదజల్లుతుంది. ఏడాదికొకసారి పెద్ద శివలింగం నుండి చిన్న శివలింగం పుడుతుంది. బహు ముఖాలతో కూడిన శివలింగం నుండి అనేక భాగాలు విడివడిన సంగతి బాగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంతకు పూర్వం చిన్న లింగం వెలువడిన స్థానంలో నుండి మరొకటి బయటపడుతోంది.

శివగంగ ::

కర్ణాటక రాష్ట్రంలోని 'బెంగళూరు' నుండి 60 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చటి ఆలయం పేరు 'గంగాధరేశ్వరాలయం'. గుహలోపల ఉన్న 2-1/2 అడుగుల ఎత్తుగల శివలింగానికి పసుపుగా ఉన్న నెయ్యిని మర్దిస్తే అది చూస్తుండగానే తెల్లటి వెన్నగా మారుతుంది. కాదని తొలచి చేసిన ఓ విశాలమైన గుహలో ఉన్న ఈ శివలింగాన్ని చేరుకోవాలంటే దాదాపు 200 మెట్లు ఎక్కి వెళ్ళాలి. అర్చన టికెట్ తో పాటే నెయ్యి కూడా ఇస్తారు. యూరోపియన్ హేతువాదులు తపదేశం నుండి (మనల్ని నమ్మక) నెయ్యిని తెచ్చి లింగానికి రుద్ది వెన్నగా మారే వాస్తవాన్ని అంగీకరించారు. ఈ వెన్నని బాధా నివారణ మందుగా వాడుతుంటారు.

కాంచీపురం ::

ఏకామ్రేశ్వరుడుగా (క్షితిలింగం) పరమశివుడు పృథ్వీలింగంగా వెలసి అనంత మహిమలతో భక్తులను తరింపజేసేదే ఈ కాంచీ క్షేత్రం. 'ఏక' అంటే ఒక, 'అమ్ర' అంటే మామిడి. ఈశ్వరుడు అంటే శివుడు. (ఏక+అమ్ర+ఈశ్వరుడు) అంటే మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి వారు గనుక ఈ స్వామికి ఏకామ్రేశ్వరుడు అనే పేరు ఏర్పడినట్లు చెప్పబడింది. ఈ ఆలయాన్ని 'పెద్దపడి' అని పిలుస్తారు. దీనినే 'తిరువేంకంబం' అని 'తిరుకుచ్చి ఏకంబం' అని 'తిరు ఆలయం' అని తమిళులు పిలుస్తారు. శివకంచి ఏకమ్రేశ్వరస్వామి ఆలయం విశాలమైన మూడు ప్రాకారాలతో, ఎత్తైన గోపురంతో అద్భుతమైన శిల్పకళావైభవోపేతంగా ఉంటుంది.
పంచరామాలు ::

ఈ పంచారామ క్షేత్రాలు ఆంధ్రరాష్ట్రంలో మూడు జిల్లాలలో వెలసినవి. అవి - గుంటూరు జిల్లాలోని అమరావతిలోను, పశ్చిమ గోదావరి జిల్లాలోని గునుపూడి భీమవరంలో ఒకటి, పాలకొల్లులో ఒకటి, తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలోని ఒకటి, సామర్లకోట కుమారారామ భీమేశ్వరంలో ఒకటి వెలసి భక్తుల పూజలందుకొంటున్నాయి. ఇక ఆలయ విశేషాలు పరిశీలిస్తే శివుని లింగాకృతిలో విచిత్రమైన విభేదాలు - అమరారామంలో 36 అడుగుల ఎత్తులో 9 అడుగులు మాత్రమే దర్శిస్తాము. ద్రాక్షారామంలో 14 అడుగులు, సామర్లకోటలో 12 అడుగులు ఎత్తుగల శిలింగం. భీమవరం, పాలకొల్లులో రెండడుగుల ఎత్తు ప్రమాణం గల శివలింగం దర్శిస్తాము. అమరారామంలో బాలరాముండేశ్వరి సహిత అమరేశ్వరస్వామిగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబ సహిత భీమశ్వరునిగాను, కుమారారామంలో బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరునిగాను, సోమారామంలో పార్వతి, అన్నపూర్ణసమేత సోమేశ్వరునిగానూ, క్షీరామంలో పార్వతి సహిత శ్రీరామలింగేశ్వరునిగాను పూజింపబడుతున్నారు. ఈ పంచారామ క్షేత్రాలైదింటిలోను ద్రాక్షారామానికి ప్రత్యేక విశిష్టత కలదు. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబదేవి అష్టాదశపీఠాలలో 12వ శక్తిపీఠంగాను, భీమేస్శ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ ఉపలింగంగాను ప్రసిద్ధి చెందినది.

చిదంబరం ::

పరమశివుని పంచభూతాల్లో అయిదవది, శివుని అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటైనది -- ఆకాశరూపంలో కొలువుతీరిన చిదంబరం క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరానికి సుమారు 250 కి.మీ. దూరంలో దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేసే చిదంబరాన్ని ప్రాచీనకాలంలో తిల్లయ్-వనం, వ్యాఘ్రపురం, పొన్నాంబళం, పురియార్, పుండరీకపురం, భూలోక కైలాస్ అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో ఈ స్థలానికి చిదంబరం అనే పేరు వ్యాప్తిలోకి వచ్చి స్థిరపడింది. చిదంబరం అంటే చిత్ + అంబరం, చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే అనంతమైన ఆకాశం. చిదంబరంలో (చిత్ సభ, కనుక సభ, దేవసభ, నృత్యసభ, రాజసభ) పంచ సభలకి ప్రాధాన్యం ఉంది గనుక ఆ పేరు వచ్చింది. 'తిల్లయ్' అనే వృక్షాలు అధికంగా ఉండడం వాళ్ళ ఈ క్షేత్రానికి 'తిల్లయ్' వనం అనే పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారి పేరు "శివకామసుందరి'.

తిరువణ్ణామలై ::

'తిరు' అంటే పెద్దది, 'అణ్ణా' అంటే అగ్ని 'మలై' అంటే కొండ అని అర్థం. ఎత్తైన కొండపై వెలసిన స్వామి అరుణగిరి రూపంలో అవతరించిన శివమహాదేవుని మహిమాన్వితమైన జ్యోతిస్వరూపమే అణ్ణామలయ్యార్ స్వామి. ఇక్కడ పర్వతమే శివ స్వరూపం. ఇదికాక లింగరూపంగా ఆలయంలో కొలువున్నారు. అమ్మవారి పేరు 'అపీతకుచాంబ'. తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులోని (ఉత్తర ఆర్కాట్ జిల్లా) ప్రస్తుతం సంబురాయర్ జిల్లాలో ఉంది. ఈ పట్టణం తాలూకా కేంద్రం విల్లిపురం. కాత్పాడి రైలు మార్గంలో చెన్నైకి 226 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీకాళహస్తి ::

శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువుగా బిల్వకావనములో సువర్ణముఖీ నదీ తీరంలో వెలిశాడు. 'శ్రీ' అంగ సాలెపురుగు, 'కాళీ' అనగా పాము, 'హస్తి' అనగా ఏనుగు, ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యమంది శివునిలో లీనమైపోయాయి. అందువలన ఇచ్చటి స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడని, ఈ పురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఇచ్చట అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలో ఉండి మహాయోగులను స్పర్శ మాత్రమునే గ్రహింపదగియుండేవారట. త్రేతాయుగంలో స్వర్ణ రూపంగా, ద్వాపరయుగంలో రజిత రూపంగా, ప్రస్తుత కలియుగంలో శ్వేతశిలా రూపం పొంది తన సహజ వాయుతత్వ నిదర్శనంగా గర్భాలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపములను రెండింటిని ఎల్లప్పుడూ చలింపజేస్తూండటం గమనించదగినది. ఇక్కడి జగదంబ 'జ్ఞానప్రసూనాంబ'.

శీర్కాళి :: వైదీశ్వరన్ కోయిల్ ::

చిదంబరానికి, కుంభకోణానికి మధ్యలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్, శీర్కాళ్ గొప్ప క్షేత్రాలు. వైదీశ్వరన్ కోయిల్, శీర్కాలి రెందు, కేవలం 8 కి.మీ. దూరం ఉన్న ప్రక్క ప్రక్క ఊళ్ళు. వైదీశ్వరన్ కోయిల్ ఉత్తర తమిళనాడు వారికి చాలా ముఖ్యమైన పవిత్రస్థలం. ఒకానొక ముని తనకు గొప్ప జబ్బు చేయగా పరమేశ్వరుని గూర్చి ఎంతో భక్తితో తపస్సు చేయగా శంకరుడు ఒక వైద్యుని రూపంలో ప్రత్యక్షమై, అతని జబ్బు నయం చేశాడమొ స్థల పురాణం. ఈ ప్రాంతం వారు ఇంట్లో ఎవరికీ ఏ జబ్బు చేసినా, ఈ వైదీశ్వరునికి మొక్కుకుంటారు. ఊరు మాత్రం అతిచిన్న పల్లెటూరు. అయినా దేవాలయం మాత్రం ఎన్నడూ భక్తులతో నిండి ఉంటుంది. ఈ మధ్య ఈ ఊరికి చెందిన 'నాడీగ్రంథ' జ్యోతిష్కులు అన్నిచోట్ల వెలియడంతో ఈ ఊరికి జ్యోతిషం చెప్పించుకుంటానికి వచ్చేవారు ఎక్కువ అయ్యారు. వైదీశ్వరన్ కోయిల్ కు శీర్కాలి మధ్యదూరం కేవలం ఐదు మైళ్ళు. తమిళులందరికి శిర్కాలి చాలా పవిత్రమైన యాత్రాస్థలం. తమిళులకు ఈ దేవాలయం సంస్కృతిక కేంద్రం లాంటిది. ఈ ఊరిని గూర్చి వారందరూ ఎంతో పవిత్రంగా భావిస్తారు. గొప్ప శివభక్తాచార్యుడు 'జ్ఞాన సంబంధర్' ఈ శిర్కాలిలోనే జన్మించారు. ఈ సంబందర్ పసికూనగా ఉన్నప్పుడు పార్వతీదేవి స్వయంగా తన స్తన్యమిచ్చి ఆ పిల్లవాని ఆకలి తీర్చింది. ఆ తరువాత నుంచి ఆ పిల్లవాడు అమిత జ్ఞానవంతుదై చిన్నతనం నుండే గొప్ప శివభక్తుడై శివతత్వాన్ని అందరకూ ప్రభోదిస్తూ కేవలం పదహారు సంత్సరాలు మాత్రమే జీవించి, తనువూ చాలించారు. అయితే, ఆ పదహారు సంవత్సరాల లోపునే అయన అనేక వేల కీర్తనలు రచించారు. అందులో దాదాపు నాలుగు వందల కృతులు.