Search This Blog

Sunday, 17 December 2017

Tiruppavai - తిరుప్పావై 1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం


Tiruppavai Vratham - Margali Masam - All Pasurams explanation by Sri Pujya Guru Brahmasri Chaganti Koteswara Rao Gari - Discourses - Telugu 







తిరుప్పావై 1వ రోజు - భగవంతుని మొదటి స్థానం నారాయణతత్వం

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం

"మార్గళి త్తింగళ్" మార్గశిర్షం మంచి మాసం, ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే, అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షినాయిణం వారికి రాత్రి అయితే ఉత్తరాయిణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షినాయిణం నుండి ఉత్తరాయిణంకు మారుతాడు, అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. "మది నిఱైంద నన్నాళాల్" చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం, చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. "నీరాడ ప్పోదువీర్ పోదుమినో" స్నానం చేయటానికి వెల్దాం! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. "నేరిళైయీర్" భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే.
"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి" పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని "చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్" సంపన్నులైన గోప పిల్లల్లా, మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం. ఏ భయమూ అవసరం లేదు. "కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్" పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ, ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా! "ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం" మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందించి పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. "కార్మేని" నల్లని మేఘంలాంటి ధివ్య కాంతులతో, అంతం లేని గుణాలు కల్గి, "చ్చెంగణ్ " వాత్సల్యం కల్గినవాడు. "కదిర్మదియం పోల్ ముగత్తాన్" చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. "నారాయణనే నమక్కే పఱైతరువాన్" నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా "పారోర్ పుగళప్పడింద్" ఫలం సాక్షాత్తు పరమాత్మే, ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.
నారాయణ మంత్రం
ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి. ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణగుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.
ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ". విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సఖల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సఖల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపల మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్యమంత్రంగా అందించింది.
ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి, నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది, దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.

Saturday, 16 December 2017

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు....

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు....

కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్......

SRI SANESWARA SWAMY - DETAILS

SRI SANESWARA SWAMY - DETAILS



శ్రీ శనీశ్వరుడు కు  సంబందించిన  సమాచారం 

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

జనన వృత్తాంతము :

అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .
లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను . తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు . సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను .
శని జన్మ నక్షత్రము : శని విభావనామ సంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .

శని పెళ్ళి :

లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .

హరిచ్శంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందేరు .
శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.

శనీశ్వరుడు మరియు హనుమంతుడు

హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.

శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.

శనీశ్వరుడు - శివుడు :

పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను . పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .

నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . " శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం అలోచించాడు . ఆ ఆడవిలోతూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్ర లొ ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుదంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్ల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు శని నెమ్మదిగా వినయం గా . శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు తనను(శనిని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు. నెలకు రెండు త్రయోదశి లుంటాయి . సంత్సరానికి 12 త్రయోదశి లు . అధిక మాసము ఉన్న సంవత్సరాన్నికి 14 త్రయోదశి లు ఉంటాయి. ఇందులో కొన్ని త్రయోదశి లకు హిందువులలో విశిస్టమైన ప్రాధాన్యత ఉంది .

ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.

శనిత్రయోదశి : ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.
అంతేగాకుండా ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.
అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోష కాలంలో శుచిగా స్నానమాచరించి, ఉపవాసముండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-
1 మయూరి నీఎలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శని కి తిలభిషేకం చేఇంచుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన
10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన
11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును

న్యాయాధికారి

మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మందపల్లి మందుడు
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.

ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.
శని తీర్థయాత్రలు
* మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరి శ్రీ శనైశ్చర దేవాలయం, మంగళూరు, కర్ణాటక.
* శ్రీ శని మహాత్మ దేవాలయం పావగడ, తుంకూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.
* శనిదేవుని ఆలయం, గ్వాలియర్ కోకిలవనం, వ్రిందావనం.
* శ్రీ శని దేవాలయం బీధ్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నస్తన్పూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర నమూనా తీర్థ్ నందూర్ బార్, మహారాష్ట్ర.
* శ్రీ శని క్షేత్ర రామేశ్వర తీర్థం.
* శ్రీ శని తీర్థం తిరునలరు పుదుచేరి.
* శ్రీ శని మందిర్ తీర్థం, ఉజ్జయిని.
* శ్రీ శని శింగనాపూర్, మహారాష్ట్ర.
* శ్రీ శని తీర్థ క్షేత్ర, అసోల, ఫతేపూర్ బేరి, మెహ్రులి, ఢిల్లీ.
* శ్రీ సిధ్ శక్తి పీట్ట్ శనిధాం.
* శ్రీ శని దేవాలయం, మడివాల, బెంగుళూరు
* శనైశ్కర దేవాలయం, హస్సన్
* శ్రీ శనిమహాత్మ దేవాలయం, సయ్యాజిరావు మార్గం, మైసూరు.
* శ్రీ శనీశ్వర దేవాలయం, నందివడ్డేమను, నాగర్ కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వర ఆలయం, శ్రీ కాళహస్తి ఆలయం కాంప్లెక్స్, శ్రీ కాళహస్తి, తిరుపతికి 35 కి.మీ. ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శని దేవాలయం, హత్ల, జామ్నగర్ జిల్లా, గుజరాత్
* శ్రీ శనీశ్వరాలయం వీరన్నపాలెం, పర్చూర్ మండలం, ప్రకాశం (జిల్లా) ఆంధ్రప్రదేశ్.
* శ్రీ శనీశ్వరాలయం, మందపల్లి, రావులపాలెం కి 5 కిలోమీటర్లు దూరం. తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.(ఇది పురాతన ఆలయము)
* శ్రీ శనీశ్వర దేవాలయం, గుంజూరు, వర్తూర్ అనంతరం, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కన్నన్మంగల, బెల్తూర్ అనంతరం, శ్రీ సత్య సాయి ఆశ్రమం, వైట్ఫీల్డ్, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, చిక్క తిరుపతికి వెళ్ళే మార్గంలో, బెంగుళూరు, సమేతహళ్లి, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, తిరుపతి, తిరుపతి బస్సు స్టాండ్ దగ్గర, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, కంగ్ర, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, హోసూర్ మెయిన్ రోడ్, హొస రోడ్, బసపుర, బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం.
* శ్రీ శనీశ్వర దేవాలయం, వైట్ఫీల్డ్, సవన హోటల్ దగ్గర, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ అభయ శనీశ్వర దేవాలయం(1956) రామ్మూర్తినగర్, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - రామ్మూర్తినగర్, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - హేబ్బాల్, హేబ్బాల్ ఫ్లైఓవర్ క్రింద, బెంగుళూరు, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - అడంబక్కం, చెన్నై, భారతదేశం.
* శ్రీ శనైశ్కర దేవాలయం - డెల్ దగ్గర (నెక్స్ట్ సిగ్నల్ వద్దగల వైట్ గోపుర)కోరమంగల ఇంటర్మీడియట్ రింగ్ రోడ్
* శ్రీ శనైశ్కర దేవాలయం - నతున్గుంజ్, బంకుర, పశ్చిమ బెంగాల్, సంప్ర-ప్రసేన్జిట్ దరిప,S/O లేట్ దేవదాస్ దరిప.
* శ్రీ శనీశ్వర దేవాలయం, అనేకల్, బెంగుళూరు దగ్గర, కర్ణాటక, భారతదేశం

Sunday, 3 December 2017

SRI DATTATREYA STOTRAM

SRI DATTATREYA STOTRAM




జటాధరం పాండురంగం
శూలహస్తం కృపానిధిం
సర్వ రోగహరం దేవం
దత్తాత్రేయమహం భజే

జగదుత్పత్తి కర్త్రేచ స్థితి
సంహార హేతవే
భవపాశ విముక్తాయ
దత్తాత్రేయ నమోస్తుతే

జరాజన్మ వినాశాయ
దేహశుద్ధి కరాయచ
దిగంబర దయామూర్తే
దత్తాత్రేయ నమోస్తుతే

కర్పూరకాంతి దేహాయ
బ్రహ్మమూర్తి ధరాయచ
వేదశాస్త్ర పరిజ్ఞాయ
దత్తాత్రేయ నమోస్తుతే

హ్రస్వదీర్ఘ కృశస్థూల
నామగోత్ర వివర్జిత
పంచభూతైక దీప్తాయ
దత్తాత్రేయ నమోస్తుతే

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ
యజ్ఞరూప ధరాయచ
యజ్ఞప్రియాయ సిద్ధాయ
దత్తాత్రేయ నమోస్తుతే

ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః
అంతే దేవః సదాశివః
మూర్తిత్రయ స్వరూపాయ
దత్తాత్రేయ నమోస్తుతే

భోగాలయాయ భోగాయ
యోగయోగ్యాయ ధారిణే
జితేంద్రియ జితజ్ఞాయ
దత్తాత్రేయ నమోస్తుతే

దిగంబరాయ దివ్యాయ
దివ్యరూప ధరాయచ
సదోదిత పరబ్రహ్మ
దత్తాత్రేయ నమోస్తుతే

జంబుద్వీపే మహాక్షేత్రే
మాతాపుర నివాసినే
జయమానసతాం దేవ
దత్తాత్రేయ నమోస్తుతే

భిక్షాటనం గృహేగ్రామే
పాత్రం హేమమయం కరే
నానా స్వాదమయీ భిక్షా
దత్తాత్రేయ నమోస్తుతే

బ్రహ్మజ్ఞాన మయీముద్రా
వస్త్రే చాకాశభూతలే
ప్రజ్ఞానఘన బోధాయ
దత్తాత్రేయ నమోస్తుతే

అవధూత సదానంద
పరబ్రహ్మ స్వరూపిణే
విదేహదేహ రూపాయ
దత్తాత్రేయ నమోస్తుతే

సత్యరూప సదాచార
సత్యధర్మ పరాయణ
సత్యాశ్రయ పరోక్షాయ
దత్తాత్రేయ నమోస్తుతే

శూలహస్త గదాపాణే
వనమాలాసుకంధర
యజ్ఞసూత్ర ధరబ్రహ్మన్
దత్తాత్రేయ నమోస్తుతే

క్షరాక్షర స్వరూపాయ
పరాత్పర తరాయచ
దత్తముక్తి పరస్తోత్ర
దత్తాత్రేయ నమోస్తుతే

దత్త విద్యాఢ్య లక్ష్మీశ
దత్త స్వాత్మ స్వరూపిణే
గుణనిర్గుణ రూపాయ
దత్తాత్రేయ నమోస్తుతే

శత్రునాశకరం స్తోత్రం
జ్ఞానవిజ్ఞాన దాయకమ్
సర్వపాపం శమంయాతి
దత్తాత్రేయ నమోస్తుతే

ఇదం స్తోత్రం మహద్దివ్యం
దత్తప్రత్యక్ష కారకమ్
దత్తాత్రేయ ప్రసాదాచ్చ
నారదేన ప్రకీర్తితమ్

                                        - నారద మహర్షి
                              

Friday, 24 November 2017

SRIVENKATESWARA SWAMY'S MARRIAGE PRO NOTE WITH KUBERA




SRIVENKATESWARA SWAMY'S MARRIAGE PRO NOTE WITH KUBERA

ఏన్నో వేలసంవత్సరాలక్రితం వేంకటేశ్వర స్వామివారు తన వివాహం కోసం కుభేరుని దగ్గర అప్పుచేసినప్పుడు వ్రాసిన ప్రాంసరీనోటు ...ఆనాటినుంచీ ఇది వరాహస్వామి పీటంక్రింద భద్రపరిచారు ...ఒక పుణ్రాత్ముడిద్వారా నాకు ఫోటో వచ్చింది ...ఈ అతిపురాతన అధ్బుత తాళపత్రాన్ని చూసి తరించండి.




Thursday, 23 November 2017

SKANDOPTATTI - RAMAYANAM - KUMARASAMBHABAM

SKANDOPTATTI - RAMAYANAM - KUMARASAMBHABAM



పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”. 
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.
“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.
ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.
ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.
పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

స్కందోత్పత్తి

1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా!
సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!!
2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్!
ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!!
3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా!
తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!!
4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా!
సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!!
5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః!
సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!!
6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు!
తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!!
7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః!
జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!!
8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్!
ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!!
9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన!
ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!!
౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్!
అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!!
౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన!
శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!!
12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః!
గర్భం ధారయ వై దేవి దేవతానాం ఇదం ప్రియమ్!!
౧౩. తస్యతద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్!
దృష్ట్వా తన్మహిమానం శ సమంతాదవకీర్యత!!
౧౪. సమంతతస్తదా దేవీం అభ్యషించత పావకః!
సర్వస్రోతా౦సి పూర్ణాని గంగాయా రఘునందన!!
౧౫. తమువాచ తతో గంగా సర్వ దేవా పురోహితం!
అశక్తా ధారణే దేవా తవ తేజస్సముద్ధతం!
దాహ్యమానాగ్నినా తేన సంప్రవ్యథిత చేతనా!!
౧౬. అథాబ్రవీదిదం గంగం సర్వదేవ హుతాశనః!
ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతామ్!!
౧౭. శ్రుత్వా త్వగ్నివచో గంగా తమ్ గర్భమతి భాస్వరం!
ఉత్ససర్జ మహాతేజః స్రోతోభ్యో హాయ్ తదానఘ!!
౧౮. యదస్యా నిర్గతం తస్మాత్ తప్తజాంబూనదప్రభం!!
౧౯. కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం!
తామ్రం కార్ష్ణాయసం చైవ తైక్ష్ణ్యాదేవాభ్యజాయత!!
౨౦. మలం తస్యా భవత్ తత్ర త్రపుసీసకమేవ చ!
తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధత!!
౨౧. నిక్షిప్తమాత్రే గర్భే టు తేజోభిరభిరంజితం!
సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనమ్!!
౨౨. జాత రూపమితి ఖ్యాతం తదాప్రభ్రుతి రాఘవ!
సువర్ణం పురుష వ్యాఘ్ర హుతాశన సమప్రభం!
తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం!!
౨౩. త౦ కుమారం తతో జాతం సేంద్రా స్సహమరుద్గణాః!
క్షీరసంభావనార్థాయ కృత్తికా స్సమయోజయన్!!
౨౪. తాః క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం!
దదుః పుత్త్రోయ మస్మాకం సర్వాసామితినిశ్చితాః!!
౨౫. తతస్తు దేవతా స్సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్!
పుత్త్రస్త్రైలోక్యవిఖ్యాతో భవిష్యతి న సంశయః!!
౨౬. తేషాం తద్వచనం శ్రుత్వా స్కన్నం గర్భపరిస్రవే!
స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యథానలమ్!!
౨౭. స్కంద ఇత్యబ్రువన్ దేవాః స్కన్నం గర్భపరిస్రవాత్!
కార్తికేయ౦ మహాభాగం కాకుత్స్థ జ్వలనోపమమ్!!
౨౮. ప్రాదుర్భూతం తతః క్షీరం కృత్తికా నామనుత్తమమ్!
షన్ణా౦ షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః!!
౨౯. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తాదా!
అజయత్ స్వేన వీర్యేణ దైత్యసైన్యగణాన్ విభుః!!
౩౦. సురసేనాగణపతిం తతస్తమతులద్యుతిం!
అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః!!
31. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా!
కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవ చ!!
౩౨. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః!
ఆయుష్మాన్ పుత్త్ర పౌత్త్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్!!
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్త త్రి౦శస్సర్గః!!

*** గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు. ***

Tuesday, 11 July 2017

PURI JAGGANATHA RADHA YATRA

 PURI JAGGANATHA RADHA YATRA

జగన్నాథ రథయాత్ర 


రథోత్సవం


రథోత్సవం అనగా రథంపై దేవుని ఊరేగించడం. రథోత్సవమును రథ యాత్ర అని కూడా అంటారు. రథ యాత్ర హిందూ మతం పండుగ. ఉత్సవాల సమయంలో పలు దేవ వాహనములపై దేవతల ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. రథోత్సవము జరిగే ముందుగా దేవ ఉత్సవ విగ్రహములకు కళ్యాణం జరిపిస్తారు, ఈ కళ్యాణాన్ని కళ్యాణోత్సవం లేదా కళ్యాణ మహోత్సవం అంటారు. కళ్యాణోత్సవం తరువాత స్వామి వారు సతీ సమేతంగా అత్తవారింటికి రథంపై ఊరేగింపుగా వస్తున్నట్టు ఈ ఉత్సవాన్ని భక్తజనులు ఆనందంగా జరుపుకుంటారు.
రథోత్సవము నాడు రథమును బాగా అలంకరిస్తారు, రథమును భక్తులు లాగేందుకు రథమునకు మోకు కడతారు. రథయాత్ర ప్రారంభ పూజలు తరువాత జయజయధ్వనాలతో రథయాత్ర నిర్వాహకుని సూచనల మేరకు మోకులను పట్టుకుని భక్తులు రథమును కదలిస్తారు.

జగన్నాథ రథయాత్ర


రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.

రథ నిర్మాణం[మార్చు]


రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహించాక.... జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్‌. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.

ఘోషయాత్ర

రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని 'పతితపావనుడు' అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయజయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజుల పాటూ ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును 'హీరాపంచమి' అంటారు. వారంపాటూ గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు . జగన్నాథుడు మాత్రం దారిలో 'అర్థాసని' ('మౌసీ మా'గా ప్రసిద్ధి) గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునాబెష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.

పద్యము

"త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం 1
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్" 2

తాత్పర్యము

ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం మవుతుంది.

విశ్వాసం

  • పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
  • రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
  • ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్రాగమనాభిలాషులయి వస్తుండేవారు. కాని ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంథాల్లో ఈ దేవాలయం యొక్క, ఇందున్న శ్రీ జగన్నాధస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర వీడియో ఇందు ఆలయం ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలు పెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిధిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతీ, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంత కాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలోచేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ళ తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్పురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారయి పూరీ చేరాడు.
తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా వొప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు వొప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరువమనేంతవరుకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు వొప్పుకున్నారు.
కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేక పోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు. ఎలా వున్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే:
అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలయిన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.
ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావతారల్లోని కృష్ణుని ఆవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్థకంగా ఉంటుంది కూడా.
అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.

ఆలయ నిర్మాణ విశేషాలు':

ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది. రథయాత్ర:
పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.
పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.
ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.